ఇవాళ మీకో సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. సిద్ధిపేట సమీపంలోని ఒక పొలంలో రంగు రంగుల వరి కనిపించింది. సాగు చేస్తున్న రేణుకను పలకరిద్దామంటే ఆమె మట్టిని చేతుల్లోకి తీసుకొని వానపాములతో మాట్లాడుతోంది.వారిద్దరి మాటలు అయ్యాక ఆమెను కలిశాం.
‘‘ అవి నాతో పాటు ఎవుసం చేస్తాయన్నా… ఈ పొలం కింద ఎరువును తయారు చేసి,భూమిని గుల్లగా చేస్తాయి. వానలు పడినపుడు నీరంతా లోపలకు ఇంకిపోతుంది. వాటిని నమ్ముకొని నల్ల,ఎర్ర వరిని పండిస్తున్నా…’’ అంది.‘ మీలాంటోళ్లు ఫేస్‌బుక్‌లో ఉండాలమ్మా…’ అన్నాను.‘ మా పొలమే నా ఫేస్‌బుక్ అన్నా!’’ అని వీడర్ అందుకుంది.
రేణుక సాగు విధానం ఈ వీడియో లో చూడండి
ఇవి కూడా చదవండి…
భావాలను చంపే తుపాకులు పుట్టలేదు..
అడవిని కాపాడే మానవులను చూస్తారా?
అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్!