About Us

1……About Us
We are Journalists with decades of experience in the field of media, and our quest is to brighten the lives of common people. In our society, though a little, goodness and humanity exist, and still, there are honest people. Viewing the society with optimism, it is the maiden step towards a good change. So as to track the traces of goodness and spot the humanity, and to disseminate such stories to the public, Rural Media, with an optimistic outlook, started this news portal.
There may be, or may not be, a solution for every problem. But, we have a conviction that every solution emerges, only after a real struggle, whether it is mental or physical. Our aim is to focus on such subjects.
That’s why, we preferred digital media as our platform. The stories that are posted here, will certainly motivate people to have more attachment to life, and enhance their hope for the future.
We sincerely endeavor to present such inspiring stories to the world, which indirectly tell that humanity still exists and there is no dearth of kind heated people, who care for fellow citizens despite differences.
We would like to share on our portal, the great efforts and success stories of such performers, who contribute to the progress and development of our society, from all walks of our life, no matter whether they are labourers, workers, tribal, noble hearted persons or organisations.
If you like our approach,
Please join us to strengthen our hands. You are welcome to contribute inputs in the form of news stories, photographs and videos, either by mail or by what’sapp.
However, do not forget to take the consent of those, about whom you wish to create a story.
-Shyammohan.


మేము…..
మీడియా రంగంలో దశాబ్దాల అనుభం ఉన్న పాత్రికేయులం…
సామాన్యుడి బతుకుల్లో వెలుతురు నింపాలనే తపన ఉన్నవాళ్లం…
కొంచెమే కావచ్చు మంచితనమంటూ ఉంది.
ఏ మూలనో మానవత్వం కొంత మిగిలే ఉంది. నిజాయితీపరులైన
వారు లేక పోలేదు.
ఆశావాదంతో ఆలోచిస్తే ఇదంతా మార్పు దిశగా తొలి అడుగు.
ఎక్కడో ఏ మూలనో చిక్కుకు పోయిన మంచి తనపు ఆనవాళ్లను,
మానవత్వపు చిరునామాల్నీ వెతికి పట్టుకోవడానికి అశావాదపు దృష్టితో అక్షరాలను పువ్వుల్లా సుతారంగా …..స్పృశించ డానికే ఈ ‘రూరల్ మీడియా’ న్యూస్ పోర్టల్.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కానీ ప్రతి పరిష్కారం వెనుకా ఓ పోరాటం మాత్రం ఉండి తీరుతుంది … దీనిని ఫోకస్ చేయడమే మా లక్ష్యం…
అందుకే డిజిటల్ మీడియాను వేదికగా చేసుకున్నాం.
ఇక్కడన్నీ, బతుకు మీద మమకారాన్ని పెంచే కథనాలు.
భవిష్యత్ పట్ల ఆశను పెంచే శుభ సంకేతాలు .
మనిషి మారిపోలేదనడానికి,మానవత్వం కనుమరుగై పోలేదని చెప్పడానికి గుండెల్లోని తడింకా ఇంకిపోలేదని రుజువు చేయడానికి ఎన్నో వార్తా కథనాలు ప్రపంచం ముందుంచబోతున్నాం…
రండి … మాతో చేతులు కలపండి….
కర్షకులు,కార్మికులు,గిరిజనులు, పురజనులు,మానవత్వమున్న మహానుభావులు, సంస్ధలూ ఎవరైనా సరే …
ఈ సమాజ ప్రగతిలో,అభివృద్దిలొ,ఉత్పత్తిలో భాగస్వాములైతే వారి విజయాలు మాక్కావాలి. వాటిని లోకానికి పంచుతాం…