అటు చూస్తే కొర్ర మసాలా దోశ,
ఇటుచూస్తూ జొన్న ఇడ్లీ!
ఎటు చూసినా మిల్లెట్ బిసిబెలిబాత్… !
ఎంచుకొనే సమస్య ఎవరి కైనా కలిగి తీరుతుంది. జహీరాబాద్‌లోని కెఫె గ్రీన్ ఎత్నిక్ చూసినపుడు.
పేద మహిళల స్వయం సమృద్ధి కోసం పనిచేస్తున్న డక్కన్ డెవలప్ మెంట్ సోసైటీ ఈ మిల్లెట్ రెస్టారెంట్‌ని ఇటీవల ప్రారంభించింది. ఆహార ప్రియుల ఆరోగ్యానికి మేలు చేసి, ఇమ్యూనిటీని పెంచే, చిరుధాన్యాలతో చేసిన అరుదైన రుచికరమైన వంటలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
విభిన్న రుచులు….
ఉదయంపూట… కొర్ర.సామ,జొన్న ఇడ్లీలు,జొన్న ,రాగి,కొర్ర దోశలు, కొర్రవడ,రాగి సేమియా జొన్న ఉప్మా… జొన్న ఉల్వ సూప్, మిల్లెట్ పాయసం. మధ్యాహ్నం … మెంతి సజ్జల రొట్టెలు, సామల కిచిడీ మిల్లెట్ సాంబార్ రైస్, సామల బిసిబెలిబాత్… కొర్రల పెరుగన్నం… జహీరాబాద్ స్పెషల్ బిర్యాని . సాయంత్రం… కొర్ర బాదుషా, సామల అరిసెలు, మిల్లెట్ కేక్‌లు ఉంటాయి.
‘‘ ఉదయం 7 నుండి రాత్రి 9.30 వరకు ఈ రెస్టారెంట్ తెరిచే ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో మిల్లెట్స్ పండిస్తున్న మహిళా రైతులే ఈ రెస్టారెంట్‌ని నిర్వహిస్తున్నారు. ’’ అని డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ ప్రతినిధి శ్రీనివాస్ చెప్పారు.
ఇది కూడా చదవండి…
అక్కడ విత్తనాలను వింతపరికరంతో విత్తుతారు ! https://www.ruralmedia.in/back-to-nature/this-antique-seeder-with-carved-geometric-patterns-is-a-beautiful-ode-to-our-agrarian-society/
అడవిని కాపాడే మానవులను చూస్తారా? https://www.ruralmedia.in/indepth/the-eco-friendly-chenchu-tribes/
ఉద్యమంగా సాగు …
జహీరాబాద్ చుట్టూ విసిరేసినట్టుండే ఎల్గోయి,రేజింతల్,జీడిగడ్డ,పస్తాపూర్,గొడ్డిగార్ పల్లి, ఖాసింపూర్, పొట్‌పల్లి, చిలుకపల్లి తదితర 25 గ్రామాల్లో వెయ్యి మంది ఆడబిడ్డలు 12వందల ఎకరాల్లో చిరుధాన్యాలను ఒక ఉద్యమంగా సాగు చేస్తున్నారు.
భూసారం పెంచుతున్నాం
‘‘ ఒకే రకం పంటలు వేయడం వల్ల భూమి చవుడు బారుతుంది. చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయి. అందుకే పంటల మార్పిడిని అనుపరిస్తున్నాం. దీనివల్ల ఎరువుల వినియోగం తగ్గుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి, భూసారం పెరుగుతుంది.’’ అంటోంది అర్జున్ నాయక్ తండాలో రాగులు, సజ్జలు పండిస్తున్న చాందీ భాయి.
ఇది కూడా చదవండి…
ఈ ఆకులతో చేసిన టీ లో అద్భుత ఔషధ గుణాలున్నాయి… https://www.ruralmedia.in/desktop-story/awesome-health-benefits-of-bamboo-leaf-tea/
……………………………….
వీరికి ఏ సీజన్‌లో ఏ పంట వేస్తె ఎక్కువ దిగుబడి వస్తుంది? ఏ ఎరువు వల్ల దిగుబడి ఎలా పెరుగుతుంది. వంటి అంశాలు పట్ల అవగాహన కల్గిస్తున్నారు.
……………………………………
డక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ అరుదైన కథనాలు
How To Make Jowar Roti https://youtu.be/v_s6d6F99JU
Seed Bank:Types of millets in telugu https://youtu.be/l9rdRNK8ESo
Deccan Development Society PV Satish Interview https://youtu.be/0CC9fw1E7mU
………………………………………
కోవిడ్‌ని ఎదుర్కొనే శక్తి కోసం
వీరు పండిరచే పంటలు ఆరోగ్యానికి మేలు చేసేవి. రాగులు. కొర్రలు, అండుకొర్రలు,సజ్జలు, ఈధలు, అరికలు. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాల సమ్మిళితమై తిండిగింజలు. పోషకాలను అందరించడమే కాకుండా, రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి, దేహాన్ని శుద్ధిచేస్తాయి. మనిషికి ఆరోగ్యం అందిస్తాయి.
కెఫె గ్రీన్ ఎత్నిక్ కి ఎలా వెళ్లాలి?
తెలంగాణలో, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మెయిన్ రోడ్‌లో రిలయన్స్ స్మార్ట్ పక్కనే ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలకు ఈ ( 9550343143 ) నెంబర్‌లో సంప్రదించండి.
……………………………………..
కొండగాలి, కొత్తసాగు!
మామూలుగా పొలం పనే కష్టం. కొండల వాలులో చుక్క నీరు నిలువని చోట వరి పండిరచడమంటే, నిత్యజీవన పోరాటమే! అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడీ యువకుడు. కొండమీదకు మెట్లుగా మడులు కడుతూ,నాట్లు వేస్తూ, మనకందనంత ఎత్తుకి ఎలా వెళ్తున్నాడో, https://youtu.be/kAN3fkvgWrM చూసి తరించండి!!