రాత్రి కురిసిన వాన చినుకులు, మారేడు దళముల మీద మిలమిలా మెరుస్తున్నాయి. నల్లమల కొండల అంచులో చెంచులు జింకల్లా కదులుతున్నారు. వారు వెతుకుతున్న చెట్లు కనపడటంతో దాని చుట్టు చేరి సంతోషంగా పాటలు పాడారు. ఆ చెట్టు మెల్లగా నేలకు ఒరగడంతో తొర్రలో నుండి అరుదైన తేనె బయటకుతీయసాగారు… దీని వెనుక పర్యావరణ పరిరక్షణ ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి.
చెంచులకు తెలిసిన రహస్యం
అడవిదారుల్లో నడుస్తూ, చెట్ల కింద రిలాక్స్ అవుతున్నపుడు, మాతో ఉండే స్ధానికులు, ‘‘ ఈ చెట్టు దగ్గర వద్దు, వేరే చోట ఆగుదాం’’ అని హెచ్చరిస్తుంటారు. దానికి కారణం ఆ చెట్టు ఎపుడైనా పడిపొతుందని అడివితో అనుబంధం ఉన్న చెంచు గిరిజనులకు మాత్రమే తెలిసిన సీక్రెట్. కొన్ని చెట్లు వాటంతట అవే కూలిపోవడానికి కారణం వాటి కాండం లోపల గుల్లగా తొర్రలు ఏర్పడటమే…ఇవి బయటకు కనిపించవు. గాలి వాటుకు అవి పడిపోయి, వాటిచుట్టూ ఉన్న జంతుజాలం దెబ్బతింటాయి. దీనిని నివారించి, పర్వారణాన్ని కాపాడుతున్న మానవులను ఈ వీడియోలో చూస్తారు.
నల్లమల లో చెంచులు, కూలిపోయే చెట్లను గుర్తించి, వాటిని పడగొట్టి, జంతువులు,పక్షులను రక్షిస్తున్నారు. దానికి ప్రతిఫలంగా అడవి తల్లి వారికో అరుదైన బహుమతిని ప్రసాదిస్తుంది.. అదేంటో మీరూ చూడండి…https://youtu.be/1PXhnc6TSeA
కొన్ని చెట్లకు తొర్రలు బయటకు కనిపించకుండా కాండం లోపల గుల్లగా ఏర్పడుతుంది. ఇలాంటి చెట్లను గుర్తించి, అడవిని కాపాడే పర్యావరణ వేత్తలు నల్లమల కొండ అంచుల్లో ఉన్న చెంచులు మాత్రమే అని మా స్టడీలో తెలిసింది. కనిపించని తొర్రలు వల్లనే చెట్లకు ప్రమాదం. గాలి వీచినపుడు ఆ చెట్లు పడిపోతుంటాయి. దానివల్ల వాటి మీద నివాసం ఉండే పక్షులతో పాటు, ఆ చెట్ల కిందపడి కొన్ని జంతువులు కూడా దెబ్బతింటాయి. వాటిని ముందుగా గుర్తించి పడగొడుతున్నారు ఆదివాసీలు.
అహోబిలంలో అరుదైన తేనె…
కర్నూల్ జిల్లా, ఆహోబిలం సమీపంలో కొత్తకొట్టాల చెంచు గూడెంకు చెందిన చెంచు గిరిజనులు . తెల్లవారు జామునే తేనె సేకరణకు వెళ్తారు. కొన్ని నెలల క్రితం ఒక చెట్టులోపల తొర్రను కనిపెట్టి చిన్న గాట్లు పెట్టారు. తేనె టీగలు లోపలకు చేరి తేనెతుట్టును తయారు చేశాయి. ఇపుడు ఈ చెట్టు తొర్రను పగుల గొట్టి తేనెను సేకరించారు. ఒక చెట్టు నుండి 8 నుండి 10 కిలోల తేనె వచ్చిందని వారు మాకు చెప్పారు. అన్నారు. అడవిని కాపాడుకుంటూ, జీవనోపాధి పొందుతున్నారు చెంచులు.
WATCH NEXT: How to Make Variety Bags with Banana Fiber https://youtu.be/sxHJWAnjO5M
అద్భుత ఔషధ గుణాలు….
వీరు సేకరించే తొర్రతేనె, గర్భిణీ మహిళలు. పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, అంటారు ఈ ప్రాంతంలో తేనెను వాడుతున్న వినియోగదారులు. అహోబిలం లోని ‘కోవెల్ టీమ్’ సంస్ధకు తేనెను విక్రయించి, వీరు ఆదాయం పొందుతున్నారు. కోవెల్ టీమ్ సభ్యులు అడవి తేనెను పరిశుభ్రమైన పద్దతుల్లో ప్యాకింగ్ చేసి వినియోగదారులకు అందచేస్తున్నారు.
WATCH NEXT:WOW! Strange Guava in Terrace https://youtu.be/Nt-kLheOaf4
నల్లమల నీడలో….. కష్టాల బాటలో
నల్లమల ఫారెస్ట్ లో ఎక్కువగా చెంచుగిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు. విద్య,వైద్యం అందుబాటులో లేని మారు మూలపల్లెల్లో బతుకుతున్న వీరికి అడవే ఆధారం. వీరు ప్రధానంగా నల్లమలలోనే కనిపిస్తారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొంతమంది చెంచులు నివసిస్తున్నప్పటికీ 80 శాతానికిపైగా మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 43 వేల మంది చెంచులు నివసిస్తున్నారని ఒక అంచనా.
How to Grow Black Jamun https://youtu.be/1gEzxHjvn9Y
340 చిన్న చిన్న గూడేలు, పెంటలు ఏర్పాటుచేస్తున్నారు. 46 మండలాల్లో 10768 కుటుంబాలున్నాయి. 25 మంది కన్నా తక్కువ చెంచులు నివసిస్తున్న పెంటలు 26 వరకు ఉన్నాయి. ఇంత తక్కువ సంఖ్యలో ఒక చోట నివసిస్తుండడంతో వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టంగా ఉందని కొందరు అధికారులు రూరల్‌మీడియాకు చెప్పారు. మైదాన ప్రాంతాలకు రమ్మన్నా వారు ఆసక్తి చూపడం లేదు. దీంతో వారికి అభివృద్ధి ఫలాలు వారికి అందడం లేదని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అంటారు.
How to Make Bamboo Bowls https://youtu.be/GSZ2G5BwJFc
How to Conserve Water https://youtu.be/L3O_N8Y1LZ4
Green School, Dream school https://youtu.be/qy4qDQjAI0k