భావాలను చంపే తుపాకులు పుట్టలేదు| Cartoonist Mohan

అప్పుడా పాత శతాబ్దం ఏడ్చీ, అరిచీ, కెవ్వున కేకేసీ నెత్తురు ముద్దను కనింది. అందులోంచి కొత్త శతాబ్ది లేచి కళ్ళు తెరిచి దిక్కులు చూసింది. తప్పటడుగులేసింది. కమ్యూనిజం ఎదురొచ్చి రమ్మని పిలిచింది. దారి చూపించింది. నేరుగా రష్యాలోకి నడిచింది ఇరవయ్యో శతాబ్ధం.

ఎర్రపంట విరగ్గాసింది

ప్రతి శతాబ్దాన్నీ పాతశతాబ్దం వెనకే ఉంచాలనుకున్న ప్రతివాళ్లూ గాభరాపడ్డారు. అలవాటు ప్రకారం కత్తులు దూశారు. కత్తుల్ని కర్రులుగా మార్చింది కమ్యూనిజం. ఆ సేద్యం అదేపనిగా సాగింది. రెండో ప్రపంచయుద్ధం అయ్యేసరికి చైనాలో, యూరప్, కొరియాలో పద్నాలుగు దేశాల్లో ఎర్రపంట విరగ్గాసింది. అటు అలాస్కా నుంచి ఇటు జర్మనీ. వరకూ భూగోళాన్ని ఆదరంగా కానిలించుకుంది. ఈగోళానికి దక్షిణాదిన ఉన్న పేదలందరికీ, దేశభక్తులందరికీ ఇది ఆదర్శమయింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వలస పాలకుల బూట్లూ, బానెట్ల కింద నలుగుతున్న జనాలకిది ఒక ఆయుధాన్నీ, పుస్తకాన్నీ, కవితనూ, కళనీ అందించింది. అర్జెంటుగా కొత్త పుట్టిన రోజు చేసుకోమనింది.
పండగంటే అందరికీ ఇష్టమేగా. అందుకని మన దేశంలో కూడా ఒక భగత్ సింగ్, అజయ్ కుమార్ ఘోష్, మరో డాంగే సుందరయ్య, చంద్రరాజేశ్వరరావు మరెందరో దేశభక్తులు ఆ పుస్తకాన్నీ, ఆయుధాన్నీ, అన్నిటినీ అందుకున్నారు. అలాగే అక్కడెక్కడో, ఎక్కడెక్కడో ఒక హోచిమిన్ ఒక లుముంబా, అప్పటి చేగువేరా, ఇప్పటి ఫిడేల్ కాస్ట్రో ఆపని చేశారు. ఆ శతాబ్దాన్ని శాసించి పాలించిన పికాసో నెరూడా, చార్లెస్, మన శ్రీశ్రీ, మగ్దుం, బలరాజ్ సహానీ, ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఇక్బాల్ ఇలా చెప్పుకుపోవాలంటే నోరు చెప్పెడుతుంది. రాసుకుపోవాలంటే చెయ్యి పీకుతుంది.

ఎటు చూసినా ఎక్కడకెళ్ళినా ఈ కమ్యూనిజం గాళ్లేగా..


వలసదేశాలు ఒక్కొక్కటే చేజారిపోతుంటే పాత, కొత్త వలస దొరలంతా జడుసుకు వచ్చారు. కమ్యూనిజాన్ని కట్టడి చేయాలని చుట్టూ ఇనుపదడి కట్టి యుద్ధనౌకలూ, మిసిలీలూ, విమానాలూ మోహరించారు. రష్యా చైనాలను ఇలా చుట్టుముట్టి ఆ వెంట సిద్ధాంత ప్రచారంతో వాటిని మట్టుపెట్టే పథకం అంతే ముఖ్యమైంది. ఇలాంటి ప్రచారాన్ని వినడానికీ, ఆ సిద్ధాంత గురకల్ని హాయిగా మింగడానికీ ముందుకు ముందే తొందరపడిపోయే ఒక తరహా వర్గం: వలసదేశాలన్నిటిలో తయారై ఉంది.
యూరోపియన్ తెల్లదొరల సూట్లూ, బూట్లూ, భాషా, చదువులను మిక్కిలి మిమిక్రీ చేయడానికి సరదా పడే వర్గమిది, మెకాలే లాంటి మహానుభావులు ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోర్చుగల్ల నిండా ఉన్నారు. వాళ్ళంతా బోల్డంత దూరదృష్టితో వందల ఏళ్ళ తరబడి ఊదరగొట్టిన విద్యావిధానం నుండి ఈ వర్గం పెరిగి పెద్దదై విస్తరించింది. వలసపాలన ఉన్నప్పుడూ, ఆ తర్వాత కూడా ఈ వర్గం పాతి పాలకుల భావజాలాన్ని భక్తితో వెత్తిన మోసేది. తన కింద ఉన్న మరో మధ్యతరగతి వారిక్కూడా బుద్ధిగా ఈ లగేజీని ట్రాన్స్ఫర్ చేసేది.

డెమోక్రసీ పేరిట, ఫ్రీడమ్ పేరిట చెల్లుబడయ్యే ప్రచారంలో పెద్దపీట కమ్యూనిస్టు వ్యతిరేకోన్మాదానికే. ఇది మన ఒక్క దేశంలోనే జరగలేదు. వలస పీడనపై తిరగబడ్డ దేశాలన్నిటి విముక్తి ఉద్యమాల్లో జరిగింది. పరిపాలనమీద పోరాడి నాయకత్వం వహించిన వారిపై కమ్యూనిణం ప్రభావం, కమ్యూనిస్టు వ్యతిరేకత రెండూ ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా విముక్తి ఉద్యమాలన్నిటిలో ఈ ధోరణి కనిపిస్తుంది.

రాబోయే మార్పును ముందుగా…


రెండో ప్రపంచయుద్ధం ముగిశాక రష్యా ప్రపంచశక్తిగా ముందుకొచ్చింది. ఫాసిజాన్ని ఓడించి పేద దేశాల విముక్తి ప్రదాతగా నిలిచింది. భారతదేశాన్ని ఇతర వలసల్నీ పిడికిట్లో ఇక బిగించలేమని పశ్చిమదేశాలకి అర్ధమయిపోయింది.. రష్యా విముక్తి సందేశాన్ని అందరికంటే ముందుగా అందుకున్నది కవులూ కళాకారులే. భూకంపాలను ముందుగా గుర్తుపట్టే పశువులూ, పక్షుల్లాగా వీరు రాబోయే మార్పును ముందుగా గానం చేశారు. సంఖ్యలో తక్కువైనా వీళ్ళ ప్రభావం అనంతం. అందుకే ఈ సాహితీ ప్రపంచంలో సాధ్యమైనంత మందిని తమవెంట తిప్పుకోవడానికి కమ్యూనిస్టు వ్యతిరేకులు అష్టకష్టాలు పడ్డారు అని చెప్పడానికి ఈ పుస్తకమే నిదర్శనం.

How to build a resort https://youtu.be/osDbl6v7uh0

‘‘ఆయనివి ప్రపంచ ప్రఖ్యాత పాదాలు’’ https://www.ruralmedia.in/success-story/traveler-gypsy-professor-international-traveler/


ఒక్కగానొక్క శ్రీశ్రీని కేంద్రంగా చేసుకుని ఆనాడు ఆంధ్రపత్రిక రేపిను దుమారాన్ని, ఉన్మాదాన్నీ ఈ పుస్తకం యధాతథంగా మీముందుంచుతోంది.యాభైపిళ్ళ నాటి మాట, అప్పటి తాత్కాలిక ఉద్రేకాలూ, ఉన్మాదాలూ ఇప్పటి ఇరుపక్షాల్లోనూ లేవు. అప్పటి పొగడ్తలకూ, తెగడ్తలకూ కేంద్రాలయిన మాస్కో, పెకింగ్ పాలనలూ లేనిపుడు. కనక అందరం ప్రశాంతంగా, నిష్పాక్షికంగా, వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. సిద్ధాంతాలూ, రాద్దాంతాలూ కాసేపు పక్కన పెడితే, పెద్ద వాదోపవాదాలూ, రచ్చలూ జరిగినపుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో తెలుస్తుంది.. కుతర్కాలూ, భేషజాలూ, పాండిత్య ప్రకర్ష ఒకటి కాదు వందరంగులు కనిపిస్తాయి.. రాజకీయాల్లో, సాహిత్య రంగంలో వివాదా లొచ్చినపుడు మనమంతా ఇంకా అప్పటిలాగే, వాళ్ళలాగే చేస్తున్నామా అనిపించి సిగ్గుపడతాం. నవ్వొస్తుంది కూడా.

Recharge open well Ultimate solution https://youtu.be/1E_XWd8RNa0


ప్రచురించినవారు కూడా అప్పటి లేఖల్ని అచ్చం అలాగే అచ్చువేయడం. బాగుంది. ఫుట్వోట్స్ తప్ప ఎక్కడా ఎలాంటి ఎడిటింగ్ జోక్యాలూ చేసుకోలేదు.

రాజ్యాలు కూలిపోవచ్చు….


ఈ పుస్తకం, లేఖలన్నీ శ్రీశ్రీ చుట్టూ తిరిగినట్టే కనిపిస్తాయి. కానీ అప్పుటి ఉద్యమ ఉధృతి కనిపిస్తుంది. ఎగిరిపడుతున్న ఎర్రకెరటాల ఎత్తుతోపాటే వ్యతిరేకుల టెంపరేచర్లు పెరగడమూ కనిపిస్తుంది. యాభైఏళ్ళనాడు మన రాష్ట్రం నాడిని పట్టుకోవచ్చీ పుస్తకంతో, పరిణతి కలిగిన వాళ్ళనీ, పనికి మాలిన వాళ్ళనీ పోల్చుకోడానికి నార్ల చిరంజీవి సమాధానం, పండితారాధ్యుల నాగేశ్వరరావు లేఖలూ ఎంతో పనికొస్తాయి.

బొంగులో బ్రాందీ ! రుచి చూస్తే వదలరు! https://www.ruralmedia.in/desktop-story/how-to-make-bamboo-wine/

How To Make Jowar Roti  https://youtu.be/v_s6d6F99JU


ఆనాడు అటు జారూ, ఇటు పోపూ, మెటర్నిక్, గిజాట్ లందరూ పోగై కమ్యూనిస్టు భూతాన్ని ఆవాహన చేసే పవిత్రమైన ఫ్రంటు పెట్టినట్టే 1955 ఎన్నికల్లో కూడా జరిగింది. అప్పుడు కమ్యూనిస్టులు ఎన్నికల్లో ఓడిపోయారు. యాభై ఏళ్లు తిరిగాయి. వాళ్ల భావాలు ఓడిపోయిన దాఖలాలు తెలుగునాట కనిపించడం లేదు.. కేవలం ఎన్నికల విజయాల గురించే చెప్పుకోవాలంటే నిన్న మొన్న కేరళ, బెంగాల్లో వాళ్ళే గెలిచారు. దశాబ్దంన్నర క్రితం రష్యాలో, అంతకు ముందే చైనాలో కమ్యూనిజం పాలన, అధికారం అంతరించాయి. అయినా నేపాల్లో మొన్న రాజుగారి సింహాసనాన్ని కుళ్లగించిందే జెండాయే. లాటిన్ అమెరికాలో ఎన్నో దేశాల్లో ఇప్పుడు ఎగురుతున్నది జెండాయే.

mohan,cartoonist

రాజ్యాలు కూలిపోవచ్చు. భావాలు కూలవేమో. ఈ భావాలున్న మనుషుల్ని తుపాకుల్తో కాల్చి చంపవచ్చు. భావాలను చంపే తుపాకులు పుట్టలేదు. పుట్టవేమో.
-మోహన్,cartoonist.

(శ్రీశ్రీ పై దొంగదాడి పుస్తకానికి మోహన్ గారి ముందుమాట.)

Help us grow our Positive Story Movement.

 We at The Rural Media want to showcase everything that is working in this country. By using the power of constructive journalism, we want to change Society – one story at a time. If you Watch, like us and want this positive rural news movement to grow, then do consider supporting us . Write to us: ruralmedia30@gmail.com

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles