శ్రీసిటి ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి గారి కుమార్తె వివాహం మరియు రిసెప్షన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
గురువారం రాత్రి చెన్నైలో జరిగిన వివాహ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, మంత్రి రోజా, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమూరి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, కనుమూరి బాపిరాజు, శ్వేతా మాజీ చైర్మన్ భూమన్, మాజీ ఎంపీలు చింతామోహన్, కెవిపి రామచంద్రరావు, సిపిఐ నాయకులు నారాయణ, సినీ దర్శకులు రాఘవేంద్రరావు, సినీ నటి మంజు భార్గవి, కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి జికె పిళ్ళై, యూఎస్ కు చెందిన పలువురు మిత్రులు, బంధువులు పాల్గొని నూతన వధూవరులు “నిరీష & సాగర్ పంకజ్” లను ఆశీర్వదించారు.
శుక్రవారం రాత్రి సూళూరుపేటలో నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిమూలం (సత్యవేడు), సంజీవయ్య (సూళూరుపేట), మధుసూదనరెడ్డి (శ్రీకాళహస్తి), వరప్రసాద్ (గూడూరు), మేకపాటి విక్రమ్ రెడ్డి (ఆత్మకూరు), కోరుముట్ల శ్రీనివాసులు (కోడూరు), మాజీ ఎంపీలు పనబాక లక్ష్మి, నెలవల సుబ్రమణ్యం, మాజీ మంత్రి పరసారత్నం, మాజీ ఎమ్మెల్యేలు హేమలత, తలారి మనోహర్, పనబాక కృష్ణయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి కందారపు మురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఎస్వీబీసీ చైర్మన్ డా.సాయికృష్ణ యాచేంద్ర సహా పలువురు రాజకీయ ప్రముఖులు, పరిశ్రమల సీఈఓలు, పలువురు అధికారులు, శ్రీసిటీ, సత్యవేడు, వరదయ్యపాలెం, సూళూరుపేట ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమల, శ్రీకాళహస్తి, గుడిమల్లం, సురుటుపల్లి ఆలయాలకు చెందిన పురోహితులు విచ్చేసి వేదమంత్రోచ్చారణలతో వధూవరులకు ఆశీర్వచనాలు అందచేశారు.
రవీంద్ర సన్నారెడ్డి దంపతులు తమ కుమార్తె వివాహానికి మరియు రిసెప్షన్ కు హాజరైన ప్రతి ఒక్కరినీ పలకరించి, అతిథి మర్యాదలతో ధన్యవాదాలు తెలిపారు