కొన్ని వందల మంది రెక్కల కష్టం, సృజన, సాంకేతిక నైపుణ్యమే ఈ మహావిగ్రహ నిర్మాణం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆలోచనలో పుట్టిన ఈ ప్రాజెక్టును 11 ఎకరాల స్థలంలో ప్రారంభించారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ శిల్పులు రామ్ వి సుతార్, అనిల్ సుతార్ ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం 3.6.2021న ప్రారంభమైంది. రోడ్లు భవనాల శాఖ పర్యావేక్షణలో కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పనులు పూర్తిచేస్తోంది. ప్రారంభంలో రోజుకు 200 మంది కూలీలు పనిచేశారు. ప్రస్తుతం 425 మందికి పైగా కార్మికులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు.వీరిలో బిహార్,ఒడిసా తో పాటు తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారున్నారు.వీరితో పాటు 20మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు.

1,బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తున్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైనది.
2, ఎడం చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని.. కుడి చేతి చూపుడు వేలుతో ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్న బాబాసాహెబ్ విగ్రహం ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది.
3, ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం.. మరోవైపు అమరుల స్మారకం.. అంబేడ్కర్ భారీ విగ్రహం తెలంగాణకు మణిహారంగా మారనున్నాయి.
4, 155 టన్నుల స్టీల్.. 111 టన్నుల కంచుతో ఈ విగ్రహం రూపొందించారు. సుమారు రూ.146 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
5, ఈ విగ్రహం వెడల్పు 45 అడుగులు ఉండగా.. కింద పార్లమెంటు ఆకృతిలో ఏర్పాటు చేసిన పీఠం 50 అడుగుల ఎత్తు ఉంటుంది
6, ప్రధాన విగ్రహంతోపాటు అక్కడ నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్ స్కేపింగ్, వాటర్ ఫౌంటెయిన్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్ తదితర పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
7, విగ్రహం కోసం ఉపయోగించిన రాయి ఆగ్రా, నోయిడా మరియు జైపూర్ నుండి రప్పించారు. విగ్రహం తయారీలో దాదాపు 150 మరియు 110 టన్నుల ఉక్కు, కాంస్యం ఉపయోగించారు.
8, అంబేడ్కర్ షూ లేస్‌ల నుండి చేతి గడియారంలోని టైం వరకు చాలా స్పష్టంగా కనిపించేలా శిల్పులు ఈ విగ్రహాన్ని రూపొందించడం విశేషం.
9, ప్రాంగణ విస్తీర్ణం 11 ఎకరాలు, పచ్చదనం 293 ఎకరాలు, బేస్ మెంట్ ఎత్తు 50అడుగులు, విగ్రహం బరువు 465 టన్నులు, వెడల్పు 45 అడుగులు, నిర్మాణ వ్యయం 145కోట్లు, విగ్రహం కింద స్మారక భవనం విస్తీర్ణం 27,556 చదరపు అడుగులు.

