రూపాయిన్నరకు ఒక వెదురు స్ట్రా !

bamboo straws can be a great alternative to the plastic straws

 సాధారణ మానవులు తమ జీవిత కాలంలో దాదాపు 38,000 ప్లాస్టిక్‌ స్ట్రాలు వాడి పారేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. ఇలా వాడేసిన ప్లాస్టిక్‌ సముద్రాల్లో,నదుల్లో కలసి జల కాలుష్యానికి దారితీస్తుంది, అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్‌ స్ట్రాస్‌తో పర్యావరణ కాలుష్యం!

 సముద్రాలలో చదరపు కిలోమీటరుకు 18000 కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉన్నాయి. ఇది సముద్ర జీవులు అంతరించిపోవడానికి కారణం అవుతాయని, సముద్రాల పరిరక్షణ పై ఆ మధ్య ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశంలో  నిపుణులు వెల్లడిరచారు.

పాశ్చాత్య దేశాల్లో  నిషేధం!

అభివృద్ధి చెందిన ఐరోపా, యుకె, కెనడా దేశాలు ప్లాస్టిక్‌ వాడకాన్ని చాలా వరకు తగ్గించడానికి, ప్లాస్టిక్‌ స్ట్రాస్‌ నిషేధాన్ని ఇప్పటికే ప్రకటించాయి. ఇలాంటి నేపథ్యంలో భూమిలో కలిసి పోయి, పర్యావరణ హితమైన వెదురు స్ట్రాస్‌ ప్లాస్టిక్‌ కి  గొప్ప ప్రత్యామ్నాయం అంటారు త్రిపురకు చెందిన యువ వెదురు పరిశోధకుడు పమీర్‌.

లక్ష వెదురు స్ట్రాస్‌ కి ఆర్డర్‌

bamboo straws
Tripura youth develops bamboo straws

గోమతి జిల్లాలో ( త్రిపుర ) గార్జీ గ్రామంలో వెదురు వనాలు ఎక్కువ. అ వెదురు మధ్యనే ఎదిగాడు 36 ఏళ్ల సమీర్‌ జమాటియా. వెదురు నుండి వినూత్న ఉత్పత్తులు తయారు చేయాలనే ఆలోచన నుండి   వెదురు స్ట్రాలను కనిపెట్టాడు. నెల  వ్యవధిలోనే దాదాపు 1 లక్ష వెదురు స్ట్రాస్‌ కావాలని భారీ ఆర్డర్‌ అందుకున్నాడు. వీటి తయారీలో గిరిజనులకు ఉపాధి కలుగుతోంది.

  ‘‘  ఒక స్ట్రా ఖరీదు రూపాయిన్నర, కనీసం వెయ్యి స్ట్రాలు అర్డర్‌ ఇవ్వాలి.  వినియోగదారులకు పర్యావరణ హిత సేవలను అందించడానికి వెదురు  స్ట్రా లను తయారు చేస్తున్నాం.’’అని సమీర్‌ రూరల్‌ మీడియాకు చెప్పారు.

 పమీర్‌ 2007 లో చైనాలోని నాన్జింగ్‌ విశ్వవిద్యాలయంలో వెదురు సాంకేతిక పరిజ్ఞానంలో డిప్లొమా చేశాడు. అదే సమయంలో కంబోడియా, వియత్నాం జపాన్‌ సందర్శించి, అక్కడి వెదురు అడవులను, ఉత్పత్తులను అధ్యయనం చేశాడు.

…………………………………………………………………………………….

ఇవి కూడా చూడండి

How to Make Bamboo Bowls https://youtu.be/GSZ2G5BwJFc

Unknown benefits of Mahua (ఇప్ప) Oil https://youtu.be/leEeokBt7jU

Eco friendly Bamboo cups  https://youtu.be/bfDzX4azzYQ

Amazing Food in Forest https://youtu.be/A9V0Vei7bD8

……………………………………………………………………..

ఇవి కూడా చదవండి

భావాలను చంపే తుపాకులు పుట్టలేదు.. https://www.ruralmedia.in/public/comparative-analysis-of-communist-movements-in-telugu-states/

అడవిని కాపాడే మానవులను చూస్తారా? https://www.ruralmedia.in/indepth/the-eco-friendly-chenchu-tribes/

అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్! https://www.ruralmedia.in/back-to-nature/organic-millet-restaurant-in-zaheera-bad/

…………………………………….

SUBSCRIBE to Rural Media YouTube : https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles