కూలీల ఖర్చు తగ్గించే,బైక్ సాగు !

కష్టాల నుండే కొత్త ఆలోచనలు పుడతాయి!  నారడీ మల్లేష్‌ యాదవ్‌ కి ఆరు ఎకరాల పొలం ఉంది.

  పత్తి,పసుపు పండిస్తున్నాడు.  కలుపు తీద్దామంటే కూలీలు ఖర్చు భరించ లేక పోయాడు

  అతని మదిలో కొత్త ఆలోచన మెదిలింది.  వినూత్న రీతిలో తన బైక్‌ కు దౌరా పలుగును కట్టి,

  కలుపును తీస్తున్నాడు .  మీరూ చూడాలంటే ఆదిలాబాద్‌ జిల్లా,  బజార్‌ హత్నూర్‌ కి వెల్దాం పదండి…https://youtu.be/ROIIjEMqVrI

 తొలకరి మొదలైంది. వ్యవసాయ పనులు మొదలయ్యాయి. విత్తలనాలు నాటాలన్నా,కలుపు తీయాలన్నా పేద రైతుల కష్టాలు మామూలుగా లేవు.

కరోనా లాక్‌ డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు.

 తన  పొలంలో  వాణిజ్య  పంటలు సోయాబీన్‌, పసుపు వేశాడు,  ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు, పత్తి పంటలో కలుపు తీయాలని కూలీలను సంప్రదించాడు.

వారు  300 నుండి 400 రూపాయలు అడగడం వల్ల అంత కూలి చెల్లించలేక,  ఎడ్ల జోడి కోసం ప్రయత్నించాడు. అవి కూడా  దొరకకపోవడం వల్ల మల్లేష్‌ యాదవ్‌ కొత్త ఆలోచనతో వినూత్న రీతిలో తన బైక్‌ కు దౌరా పలుగును కట్టి పొలంలోని కలుపును తీసేస్తున్నాడు.

ఆ దృశ్యాన్ని ప్రముఖ జర్నలిస్టు అంజన్‌ రాజ్‌ తన సెల్‌ ఫోన్‌లో రికార్డు చేశారు.

    రైతులను అదుకోవాలి

 ‘‘ ప్రభుత్వం  చమురు ధరలు అమాంతంగా పెంచడం వల్ల  మాలాంటి చిన్న సన్నకారు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూలీ రేట్లు భరించ లేక ఇలాంటి ఆలోచనలు మాకు వచ్చినప్పటికీ,  బైక్‌ తో పంటలో దౌరా కొట్టుకోవడానికి  కూడా కష్టంగా ఉంటోంది. చమురు ధరల తగ్గించి మమ్మల్ని సర్కారు ఆదుకోవాలి’’ అని ఈ బడుగు రైతు ఆవేదన వ్యక్తంచేశారు.

 ప్రభుత్వం ఆలోచించాలి..

 ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు. ప్రతీ గ్రామపంచాయితీలో కలుపు తీసే యంత్రాలు, పొలం దున్నే వ్యవసాయ పరికరాలు చిన్న రైతులకు నామమాత్రపు అద్గెకు అందుబాటులో ఉంచితే వ్యసాయానికి తోడ్పాటు కలగుతుంది అని చాలా మంది రైతులు కోరుతున్నారు.

( ఈ రైతు చేస్తున్న వినూత్న సాగును వీడియో తీపి రూరల్‌ మీడియాకు పంపిన

అంజన్‌ రాజ్‌కి అభినందనలు.)

………………………………………………………………………………………………………..

ఇవి కూడా చదవండి…

భావాలను చంపే తుపాకులు పుట్టలేదు.. https://www.ruralmedia.in/public/comparative-analysis-of-communist-movements-in-telugu-states/

అడవిని కాపాడే మానవులను చూస్తారా? https://www.ruralmedia.in/indepth/the-eco-friendly-chenchu-tribes/

అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్! https://www.ruralmedia.in/back-to-nature/organic-millet-restaurant-in-zaheera-bad/

………………………………………………………………………………………………………..

Please watch RuralMedia  channel

How to Make Bamboo Bowls https://youtu.be/GSZ2G5BwJFc

Unknown benefits of Mahua (ఇప్ప) Oil https://youtu.be/leEeokBt7jU

Eco friendly cups  https://youtu.be/bfDzX4azzYQ

Amazing Food in Forest https://youtu.be/A9V0Vei7bD8

How To Make Jowar Roti  https://youtu.be/v_s6d6F99JU

Seed Bank:Types of millets in telugu https://youtu.be/l9rdRNK8ESo

Deccan Development Society PV Satish Interview https://youtu.be/0CC9fw1E7mU

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles