Must Read|అరుదైన కథలతో “చలి చీమల కవాతు”

( Sujatha Velpuri )

సరళ మైన వాక్యం కథకు “చదివించే లక్షణాన్ని”అద్దుతుంది. వాక్యం ఎంత క్లిష్టంగా ఉంటే అంత లోతుగా ఉన్నట్టు భావిస్తూ,కవితాత్మకతను అద్ది , అల్లే వాక్యాలు చాలా సార్లు కథలకు నప్పవు. అవి పేజీలను అలవోకగా ,దగ్గరుండి తిప్పించేస్తాయి. కథలోని గాఢత ఏ మాత్రం చెడకుండా, దాన్ని చక్కని సరళమైన వాక్యంలో పొదిగి రాసిన కథలు ఈ ఐదు కథలూ కొత్త కథా సంకలనం “చలి చీమల కవాతు” లో ఉన్నాయి. ఒక సామాజిక సమస్యను నేరుగా ప్రస్తావించకుండా, కథ అల్లిక లోని లోపలి పొరల్లో దాన్ని లాఘవంగా పొదిగి పాఠకుడికి పట్టి ఇవ్వడం సుధాకర్ గారి ప్రత్యేకత. పాత హిందీ పాటలతో చుట్టూ పూల తోటలు పండించుకున్న శారద జీవితంలో విషాదానికి కారణాన్ని , ఒక చిన్న వ్యాక్యంలో కథకురాలి తల్లి చేత చెప్పించేస్తారు. అంతే! ఇక ఆ తర్వాత దాని ప్రస్తావనే ఉండదు. కానీ కథ చదువుతున్నంత సేపూ అదే పాఠకుడిని వెంటాడుతుంది. కళ్లముందే జనం ఎటువైపు తప్పుడడుగులు వేస్తున్నారో, “ఆమె తమ్ముడు దేశభక్తుల పార్టీ నాయకుడు” అన్న మాటలో తేల్చేస్తారు రచయిత.

ఆ క్రూరత్వానికి బాలెన్స్ గా అటువైపు నర్సక్క నిల్చుని ఉంటుంది. Wah! నిచ్చెన పై మెట్టు, కింద మెట్టు ల మధ్య సంఘర్షణని ప్రతీకాత్మకంగా చెప్పడం “గోళ్ళు -గిట్టలు” బ్యూటీ. ఇజాల జోలికి కథ వెళ్ళినపుడు ప్రతీకాత్మకత ను ఎంచుకోవడం వివాదాస్పదం కావడానికి అవకాశం లేని టెక్నిక్. “ఇక్కడేదో మతలబు ఉందని మేకపోతుకీ మిగతా పెద్దలకీ అనిపించింది గానీ అదేమిటో అర్థం కాలేదు”

“మొదటి సారిగా మేకలూ గొర్రెలూ ఒకే జట్టులో ఆడుతున్నాయి ” వంటి వాక్యాలు కథ దేని గురించి, ఎవరి గురించి మాట్లాడుతున్నాయో చెప్పేస్తాయి. వృత్తిగత జీవిత వాతావరణాన్ని కథలో ఆసక్తికర వాతావరణం కోసం సమర్థంగా వాడటంలో (తెలుగులో) సమర్థులు సి రామచంద్రరావు గారు. “లాహిరీ నడి సంద్రములోనా” చదువుతున్నంత సేపూ ఆయనే గుర్తొచ్చారు. వస్తువు మీద పూర్తి అథారిటీ తో రాసిన కథ. ప్రొటాగనిస్ట్ మీద కథా పరిణామ క్రమం ఏ విధంగా ప్రభావం చూపించిందీ పాఠకుడి ఊహకే వదిలేయటం , పాఠకులను ఆలోచనలో పడేయటమే? ఒక కథ గమ్యం అదేవిద్యార్థి రాజకీయాలలో సైతం స్త్రీ పురుష సంబంధాల సంక్లిష్టత!

ఒక పురుషుడి కోసం దాదాపుగా పోటీ పడిన ఇద్దరు స్త్రీలు తమ శక్తిని, బలాన్ని తాము తెలుసుకుని విద్యార్థి పోరాటంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రాణ స్నేహితులుగా మారడం ఎంత చక్కని విషయమో. (చలిచీమల కవాతు) అయినా వారు ఆ పురుషుడిని ద్వేషించక “ఈ పోరాటంలో అతడు ఉండుంటే బావుండేది” అనుకోవడం ఊహించని పరిణతి. మహా మహా పోరాట యూధులైనా స్త్రీ విషయానికొచ్చే సరికి భోగ వస్తువు పరిథి దాటరని మాధవన్ పాత్ర తో దాదాపు గా చెప్పిస్తారు. అయితే, ఈ కథలో కొంత గడిచాక , బహుశా నిడివి ఎక్కువైన కారణం వల్ల కాబోలు, సంఘటనలేవీ జరగనివ్వకుండా, రచయిత కథను క్లుప్తంగా చెప్పుకుంటూ పోయిన అనుభూతి కల్గుతుంది.

వాస్తవ చరిత్రకు కల్పనను అద్ది, సరికొత్త ప్రయోగం చేసిన “రెక్కలు చాచిన రాత్రి” తెలుగులో ప్రత్యామ్నాయ చరిత్రకు సంబంధించి తొలి ప్రయోగం కావచ్చు. భాష, వ్యక్తీకరణ, గాఢత కోల్పోని సరళ వాక్యం సుధాకర్ గారి బలం. సులభంగా తెలుగులో మాట్లాడగలిగిన,వాడగలిగి ఆదరణ పొందగలిగిన పదాలను యధాతథంగా కథల్లో వాడారు. కోచ్ అనే మాటకు శిక్షకుడు అనే పదం వాడతారు. “పిలిచే గంటను” నొక్కాడు అంటారు. సరంగు, ఓడ కళాసీ, తుడుపు, పని దుస్తులు ఇవన్నీ చాలా సహజంగా కథలో ఇమిడి పోతాయి తప్ప పని గట్టుకుని ఆ పదాలు వాడారనిపించదు. ఇది తెలుగు కథలో చోటు చేసుకోవలసిన మంచి విధానం. కథలో అంతర్లీనంగా ఉండే సందేశం పాఠకుడికి సులభంగా అంది పోతుంది.కానీ సందేశపు ఎజెండాతో బయలు దేరిన కథలన్నిటికీ దూరంగా నిలబడి తన ప్రత్యేకతను నిబెట్టుకుంటుంది సుధాకర్ గారి కథ. ఇది ప్రతి కథలోనూ ప్రస్ఫుటంవాక్యం క్లిష్టతా లేకుండా ఎంత సరళంగా ఉంటే, అంతగా “చదివించే లక్షణాన్ని” అద్దుకుంటుంది. ఆ లక్షణం ఈయన కథల్లో దండి గా ఉంది.

రొటీన్ కథాంశాల నుంచి తప్పని సరి సందేశాల నుంచి కాసింత రిలీఫ్ కోరుకునే తెలుగు పాఠకులకు సుధాకర్ గారి వాక్యం, చిత్రణ, వాతావరణం..ఇవన్నీ సరికొత్త అనుభూతినిస్తాయి. ఐదు మంచి కథలతో తయారై వచ్చిన ఈ మస్ట్ రీడ్ (తప్పకుండా చదవాల్సిన) పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది.

………………………………………………………………..

ఇవి కూడా చదవండి…

భావాలను చంపే తుపాకులు పుట్టలేదు.. https://www.ruralmedia.in/public/comparative-analysis-of-communist-movements-in-telugu-states/

అడవిని కాపాడే మానవులను చూస్తారా? https://www.ruralmedia.in/indepth/the-eco-friendly-chenchu-tribes/

అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్! https://www.ruralmedia.in/back-to-nature/organic-millet-restaurant-in-zaheera-bad/

WATCH NEXT: Green School, Dream school  https://youtu.be/qy4qDQjAI0k

Awesome Agriculture Technology https://youtu.be/3YNPaOb9s2c

Coconut Tree Climber(తెలుగు) https://youtu.be/urRkOIIXdyY

SUBSCRIBE to Rural Media YouTube : https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles