మన్నులో నుండి అన్నం తీస్తున్న రైతక్క!

ఆకలి కరవులాంటిది. ఓ పట్టాన వదిలిపెట్టదు. బిడ్డల్ని బతికించుకోవాలంటే చచ్చినట్టు పండించు కోవాల్సిందే. బిడ్డల ఆకలి అవసరం కోసమే ఆమె రైతమ్మగా మారింది. బీడుభూమిని మాగాణంగా మార్చింది. కలల పంటలైన పిల్లల కోసం విత్తుచల్లి పంట పండించి , సాగును వృత్తిగా మార్చుకుంది. పెట్టుబడులను తట్టుకోలేక, గిట్టుబాటు ధరలు లేని సమయంలో ఆమె సేద్యాన్ని బిడ్డలా భుజానికి ఎత్తుకుంది. పిల్లలను పంటలను సమబాధ్యతతో పెంచుతున్న రైతక్క విజయలక్ష్మి జర్నీ https://youtu.be/FJQtxwbi0Pg ప్రతీ రైతు చూసి తీరాలి .

…………………………………………………………………………………………….

కొండగాలి, కొత్తసాగు! మామూలుగా పొలం పనే కష్టం.  కొండల వాలులో చుక్క నీరు నిలువని చోట వరి పండిరచడమంటే, నిత్యజీవన పోరాటమే! అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడీ యువకుడు. కొండమీదకు మెట్లుగా మడులు కడుతూ,నాట్లు వేస్తూ, మనకందనంత ఎత్తుకి ఎలా వెళ్తున్నాడో, https://youtu.be/kAN3fkvgWrM చూసి తరించండి!

………………………………………………………………………………………….

సాగునీరు లేని చోట, వానచినుకులకు మాత్రమే పంటలు పండే నేలలో ఫారంపాండ్‌ ఉండాల్సిందే. ఆంధ్రా,కర్నాటకలో వందలాది ఎకరాలు ఈ పంటకుంటల వల్లనే సాగు చేయడం మేం చూశాం.  అదెలా తవ్వుకోవాలని చాలామంది రైతు మిత్రులు అడుగుతుంటారు. కొన్నిపద్దతులు,కొలతలు ఉంటాయి. మీ జిల్లా డ్వామా అధికారులను కలిస్తే,ఉపాధి హామీ పథకంలో ఉచితంగా తవ్విస్తారు. అలాంటిదే ఇక్కడున్న ఫొటో. చిత్రదుర్గ నుండి ఓ మిత్రుడు పంపారు. వర్షాలకు ఈ కుంటలు నిండితే, సీన్‌ ఎలా ఉంటుందో https://youtu.be/qmcYfu7JQeY   ఈ వీడియో చూడండి!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles