మారెమ్మ మరియమ్మగా మారినా…
వేల ఏళ్ల నాటి వేరు యీ నేలంతా పాకి పక్షులను కాకులను వేరు చేసింది, అడవిని క్రూర మృగాలుగా అలగా జంతువులుగా చీల్చింది,పాలను సైతం ముందు నాలుగు పాళ్ళు చేసి, వాటికి అయిదోతనమూ చేర్చింది,స్వేదం చదువుకున్నవారి అవసరాన్ని అనివార్యంగా గుర్తించిందివారి శ్రమను భుజంచి బొజ్జలు పెంచి వారి మొహాలపై వుమ్మేసే అమానుషానికి కాళ్ళు చేతులు కళ్ళు చెవుల మనిషి రూపమిచ్చి మెదడులో పాము కోరలు అమర్చింది, బుజం తడిమి తనవారిని వాటేసుకుని కానివారిని కాటేసి చంపే గుణమిచ్చిందివాడి చేతికి తంత్ర దండమిచ్చి వొకే తానును ముక్కలు చేసి ఒకదానిపై మరోదాన్ని పేర్చి పాలింపచేసే యుక్తినిచ్చింది…
కాయ కష్టానికి కడపంక్తి బయట అడుగు బొడుగుల వరుసనొకటి సృష్టించే నేర్పునిచ్చింది వాడికి రాజును మంత్రించి అమాయక జనం మీదికి తోలే కొంపలు ముంచే జ్ఞానమిచ్చింది, రాచరికాలు పోయిన తర్వాత వాడు ‘బ్రా’డై, స్వామీజీ అయి, బాబా అయి నామాల గుండయి, కపటాల పండయి రాజును మించిన, నోట్లతో వోట్లు నొల్లుకొని వోటర్ల నోటిలో మట్టిగొట్టే ఆధునిక ప్రభువుల తలలో దూరాడువారి యూనిఫామ్ కాపలాగాళ్ళకూ, వారి కింది స్థాయి పోలీసులకూ ఛిద్ర విద్యను నేర్పి, పై సోపానాలకు మొక్కి అడుగు మెట్లను తొక్కిపట్టే దౌర్జన్య దురహంకారాన్ని తాగించాడు, వారికి రక్షక భట ఆలయాలు కట్టి, వాడల పనివాళ్ళను మేడల ఆదేశాలతో చిత్ర హింసలకు గురి చేసి హతమార్చే కళ నేర్పాడు…
చదువుల్లో చేరి పదవులకేక్కే అడుగువారికీ తన వారిని నీచంగా చూసే చూపిచ్చాడుమారెమ్మ మరియమ్మగా సుల్తానాగా మారినా తేడా వుండదు, ఏటా క్రైస్తవుల మక్కాకు వెళ్లి అక్కడ జన్మదినం జరుపుకునేవారి వారసులదయినా మతం పేర అధికార మాయ పాచికలను చేజిక్కించుకొని ‘కడ’ బతుకులను చీట్ల పేక చేసుకొని ఆడుకొనే వాటమే, శిరోముండనగాళ్ళను అందలమెక్కించే ఆలోచనే ఇక్కడ లాఠీ సామాజిక లూటీ ఆయుధమే, కులానికి, ధనానికి తక్కువయినవారిని చంపించి, హతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాలిచ్చి మొసలి కన్నీటి సంతాపాలు సానుభూతులు పలికేవారి కాలి బూటే , మూల మూలాన్ని చాణక్యుడిలా ముక్క ముక్కలు చేసి కసకసా నమిలి మింగేవరకూ యింతే,యిదింతే!
-నిజం,27-06-2021
( జి. శ్రీరామ మూర్తి సీనియర్ పాత్రికేయులు . పలు ప్రముఖ దిన పత్రికలకు సంపాదకులుగా పని చేశారు.
‘నిజం’ కలం పేరు.)
…………………………………………………………………………………….
ఇవి కూడా చదవండి…
భావాలను చంపే తుపాకులు పుట్టలేదు..
అడవిని కాపాడే మానవులను చూస్తారా?
అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్!
30You, Wilson Sudhakar Thullimalli, Elanaaga and 27 others23 Comments7 SharesLikeCommentShare