మన్నుల నుండి అన్నం తీసెటి మహిమలివి…

నేడు ఏరువాక

నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయ పండుగే ఏరువాక పౌర్ణమి.

దేశమంతా లాక్డౌన్లో ఉన్నా… గుప్పెడు గింజలు ఎక్కువ పండించిన రైతులు వీరు,  

కొండవాలు లో నీటి చెలమల్ని తవ్విన సాహసం ఇది…

మన్నుల నుండి అన్నం తీసెటి మహిమ లివి…

భూమి ఆకాశాలను సాగు చేస్తున్న మట్టి మనుషుల  దృశ్య సాక్ష్యం  

https://youtu.be/o0t2Sc699HI   ఈ వీడియో…  

 Rural Media తీసిన మరి కొన్ని వినూత్న వీడియోలు చూడండి.

మీ బోరు ఎండి పోయిందా?  బావిలో నీరు అడుగంటిందా?

సింపుల్‌ గా రీచ్ఛార్జి చేసుకోవడానికి , ఈ తొలకరి సరైన సమయం.

నాబార్డ్‌ సాయంతో పాతాళంలోని గంగను పైకి ఎలా తెచ్చారో ఈ వీడియోలు చూడండి.





కొబ్బరి దింపు.. ఉండదిక జంకు
…………………………………..
 కొబ్బరి చెట్టు నుంచి కాయల్ని కోసి దించడం లో రైతులు పడే వెతలు ఎన్నో. దింపు సమయంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చే వారు తగ్గి పోతున్నారు. దీనివల్ల రైతులకు కొబ్బరి దింపు తలకు మించిన భారంగా మారింది.. ఇక పై ఆ సమస్యలు ఉండవు. జస్ట్   చిన్న బటన్ నొక్కి చెట్టు మీదకు చేరుకోవచ్చు. తాడి,కొబ్బరి చెట్లు ఏవైనా సులువుగా, సురక్షితం గా ఎక్కి దిగ వచ్చు .  https://youtu.be/urRkOIIXdyY చూద్దాం రండి

అరటి గెల తయారయ్యక చెట్లను  నరికి పారేస్తారు.
అక్కడితో అరటి సాగు పూర్తవుతుంది.
” కానీ మా స్టోరీ ఇక్కడ నుండే మొదలవుతుంది…” అన్నారు, కృష్ణానదీ తీరంలో మహిళలు.  మీరూ చూస్తారా ? https://youtu.be/sxHJWAnjO5M

8, ఈ కొండ పచ్చగా ఉంటేనే ఊరు బాగుంటుందని గుర్తించిన, గురువాజీపేట(ప్రకాశం జిల్లా) ప్రజల్లో కదలిక వచ్చి, కొండ శిఖరం నుండి కింది వరకు 120 ఎకరాల్లో చిన్న జలాశయాల ను తవ్వారు. ఆ ఊరి పరువును భుజాన నాగలిగా ధరించి నడుస్తున్న వాళ్లను పలక రిద్దాం రండి   https://youtu.be/gmA3fWqQ3Pw

9,అనంతపురం జిల్లాలో కురిసిన వాన చుక్కను  చుక్కను నిలుపు కోవడానికి ఒక ఉద్యమం మొదలైంది.. ఆ పోరాటానికి నాయకురాలు సహరాబీ. వారు సాధించిన జలాశయంలో మునకలు  వేద్దాం రండి …  https://youtu.be/O6ToQckoXTI

…………………………………………………………….

ఇవి కూడా చదవండి…

భావాలను చంపే తుపాకులు పుట్టలేదు.. https://www.ruralmedia.in/public/comparative-analysis-of-communist-movements-in-telugu-states/

అడవిని కాపాడే మానవులను చూస్తారా? https://www.ruralmedia.in/indepth/the-eco-friendly-chenchu-tribes/

అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్! https://www.ruralmedia.in/back-to-nature/organic-millet-restaurant-in-zaheera-bad/

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles