సిద్దిపేట నుంచి ఛత్తీస్‌ఘడ్ వెళ్లడానికి ఓ పది వలస కుటుంబాలు కాలినడకన బయలుదేరాయి. దారితప్పి వాళ్లంతా ములుగు జిల్లా చేరుకున్నారు.
అప్పటికే 140 కిలోమీటర్ల దూరం అదనంగా నడవడంతో, ఆకలిమంటతో అడుగుతీసి అడుగేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ల అవస్థలు చూసిన స్ధానికులు, ‘తస్లీమా అమ్మ’ను కలవండి అని దారి చూపారు. ఆమెను వెతుకుతూ ఆశగా వెళ్లారు. వాళ్లను చూసిన ఆమె స్వయంగా వంట చేసి ముందుగా వారి ఆకలి తీర్చారు. తర్వాత కావల్సిన సరకులు,కొంత డబ్బులు ఇచ్చి సాగనంపారు.
ఆమె ప్రభుత్వ ఉద్యోగిని. లాక్ డౌన్ కాలంలో ఆకలితో ఉన్నవందలాది కుటుంబాల గుండె తలుపులు తట్టిన తల్లి. ఆమెతో ఈ రోజు మాట్లాడే అదృష్టం కలిగింది. హన్మకొండ బస్ స్టాప్‌లో ములుగు బస్ కోసం ఎదురు చూస్తూ జీవితం పట్ల తనకున్న క్లారిటీని వివరించారు.
……………………………………………………………………………………………………………….
ఇవి కూడా చదవండి…
భావాలను చంపే తుపాకులు పుట్టలేదు.. https://www.ruralmedia.in/public/comparative-analysis-of-communist-movements-in-telugu-states/
అడవిని కాపాడే మానవులను చూస్తారా? https://www.ruralmedia.in/indepth/the-eco-friendly-chenchu-tribes/
అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్! https://www.ruralmedia.in/back-to-nature/organic-millet-restaurant-in-zaheera-bad/
……………………………………………………………………………………………………………….
ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు గ్రామానికి 20 కిలోమీటర్ల కాలినడక వెళ్లి అక్కడి వాళ్లకు నిత్యావసర సరకులు అందజేశారు. కేశవపూర్ లో తండ్రి ని కోల్పోయిన, ఇద్దరు చిన్నారులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అతడి భార్యని కలిసి ధైర్యం చెప్పి, ఆ కుటుంబానికి తగిన ఆర్థిక సాయాన్నీ అందించారు.
తెలంగాణ , ములుగు జిల్లా, రామచంద్రాపురం తస్లీమా సొంతూరు. రెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. సోదరుడి స్ఫూర్తితో 2009లో గ్రూప్-1కు ఎంపికై సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం పొందారు. పన్నెండేళ్లుగా అటు ఉద్యోగం ఇటు సమాజ సేవ చేస్తున్నారామె. ఆదివారం , సెలవు రోజుల్లో పొలాల్లో కూలి పనికి వెళ్లి , వచ్చిన కూలీ డబ్బులను పేదలకే ఖర్చు పెడుతున్నారు.
………………………………………………………………………………………………………
ఇవి కూడా చూడండి…
Green School, Dream school https://youtu.be/qy4qDQjAI0k
Organic aquaculture https://youtu.be/3b0EUEYnRdQ
Wild honey harvesting https://youtu.be/TzpguDSNyKw
……………………………………………………………………………………………………….
కోవిద్ లాక్ డౌన్ సమయం లో ఆకలి తో వారికి అమ్మగా మారి, మారు మూల తండాల్లో రెండు వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందచేసింది. ” మా నాన్న కమ్యూనిస్ట్ భావాలున్న వారు. అయన స్ఫూర్తి తో సర్వెర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద బిడ్డల చదువుకు తోడ్పడు తున్నాను. ” అని RURAL MEDIA కు చెప్పారు
ఇలాంటి మహిళలు వల్లనే తెలంగాణ పచ్చగా ఉంది!!