మాయమై పోలేదమ్మా.. మనిషిన్నవాడు

నాకు తెలిసిన ఓ యువడాక్టర్‌ పశ్చిమదేశాల్లో పనిచేస్తూ నెలకు లక్షలు సంపాదిస్తూ చాలా బిజీగా ఉంటాడు. కాస్త సమయం దొరికితే ఇండియాలో పేదోడికి వైద్యం అందడం లేదని కులం,మతం అంటూ…. చాలా ఆవేదన పడిపోతూ సోషల్‌మీడియాలో రిలాక్స్‌గా పోస్టులు పెడుతుంటాడు.
” ఎంత కాలం ఇలా ఫీలవుతారు డాక్టర్‌గారూ, ఒక్క సారి ఇక్కడికి వచ్చి మీ సేవలందించి కన్న తల్లి నీదేశం రుణం తీర్చుకోవచ్చు కదా” అని అడిగాను. ఇప్పటికీ ఆతని నుండి స్పందన లేదు.
తమ రాతల్లోనే తప్ప జీవితంలో సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని ఇలాంటి వారిని పక్కన పెడితే….
డాక్టర్‌ చంద్రకాంత్‌ గాంధీ కూడా విదేశాల్లో పనిచేశారు. అమెరికా లాంటి దేశాల్లోకాదు. ఆఫ్రికా లాంటి పేద దేశంలో… అక్కడి నుండి హైదరాబాద్‌ వచ్చి పేదరోగులు రక్తాన్ని పీలుస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రుల మధ్య ప్రజావైద్యశాల పెట్టి ప్రజల గుండెల్లో నిలిచారు.
సామాన్యుడు ఇచ్చినంత తీసుకోవడం, మెరుగైన వైద్యం అందించడం గత 30 ఏండ్లుగా గాధీగారు చేస్నున్న సేవ. యూసఫ్‌ గూడా బస్తీలో ఎవరిని అడిగినా ఈ డాక్టర్‌ దేవుడు గురించి చెబుతారు. కష్టజీవి కన్నీళ్లను తుడిచే ఇలాంటి డాక్టర్‌ ఊరికొక్కరు ఉంటే చాలు .

ఇవి కూడా చదవండి…

జన గణమణలో ఈ జనం కనిపించరు? https://www.ruralmedia.in/water/untold-story-from-telangana/

Tripura’s Bamboo Salt | A Healthy Alternative https://www.ruralmedia.in/back-to-nature/tripuras-bamboo-salt-a-healthy-alternative/

ఇవి కూడా చూడండి WATCH NEXT: How to Make Variety Bags with Banana Fiber https://youtu.be/sxHJWAnjO5M

How to Make a Recycled Plastic Pot https://youtu.be/41JamvHz8qY

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles