బొంగులో బ్రాందీ ! రుచి చూస్తే వదలరు!

బొంగులో చికెన్‌ గురించి మాత్రమే మనకు తెలుసు కానీ, చైనీయులు బొంగులో వైన్‌ తో సందడి చేస్తున్నారు. ఇటీవల కరోనాకు పుట్టిల్లుగా మారి అప్రతిష్టపాలైన చైనా ఒకప్పటి చరిత్ర మాత్రం ఘనమైనదే.

   రెండు వందల సంవత్సరాల క్రితమే హ్యాన్‌ చక్రవర్తి కాలంలో కలపగుజ్జు నుంచి  కాగితం తయారీని కనిపెట్టారు. తొలిసారి ప్రింటింగ్‌ మిషన్‌ 220వ సంవత్సరంలో కనిపెట్టారు. సముద్రంలో నౌకలకు దారి చూపించే దిక్సూచిని కూడా చైనీయులు 1044 లోనే కనుగొన్నారు. అలాగే పట్టుపురుగులను పెంచి, పట్టు వస్త్రాలను అల్లింది కూడా వాళ్లే. టూత్‌బ్రెష్‌ని కనుగొని,  ప్రపంచానికి  పళ్ళు తోముకునే అలవాటు నేర్పించింది ఆ దేశమే. ప్రస్తుత కథనంలోకి వస్తే, వెదురు నుండి మద్యాన్ని తయారు చేసి  రికార్డు సృష్టిస్తున్నారు చైనీయులు.

తూర్పు చైనాలోని Lin’an  నగరానికి  దూరంగా అటవీ ప్రాంతంలో ఉన్న  గ్రామం Baishuijian. వెదురు విస్తారం గా పెరుగుతుంది.అక్కడున్నఒక వెదురు వనంలో  మద్యం తయారు  చేస్తున్నారు.వెదురు పిలకలలో   మొదటి దశ  రైస్‌ మద్యాన్ని  ఇంజెక్ట్‌ చేసి, ఏడాది తరువాత రుచి కరమైన మద్యాన్ని బొంగుల నుండి తీస్తున్నారు.చైనా మీడియా అంచనా  ప్రకారం, తయారుచేసిన మద్యం  కర్రకు 500 యువాన్ల ధర పలుకుతోంది.

ఎలా తయారు చేస్తారు ?

  వెదురు పిలకలు ఎదుగుతున్న  దశలో  ఒకటి నుండి రెండు కాండాలకు చైనీస్‌ సంప్రదాయ ఆల్కహాలు జొన్న, రైస్‌ మద్యాన్ని  ఇంజెక్ట్‌ చేస్తారు.ఆ వెదురును  సుమారు ఒకటిన్నర సంవత్సరాలు పెరగనిస్తారు. బొంగులు లావుగా పెరిగి సిద్ధమైన వెంటనే, బాంబూ బ్రాందీ తాగడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో, వెదురు గొట్టంలో ఊరిన  రసాలు కలిసి మద్యం మరింత మజాగా మారుతుంది.

 వెదురుతో అధిరే గ్లాసులు, ప్లేట్లు…https://youtu.be/bfDzX4azzYQ

లిక్కర్‌  కావాలని ఆర్డర్‌ చేసిన కస్టమర్‌లు వెదురు వనాలకు చేరుకుంటారు. అక్కడి రైతులు బొంగులో మద్యం ఎంత వరకు ఉందో చూపించి, కనుపుల వద్ద కట్‌  చేస్తే  మద్యం బయటకు ధారగా  వస్తుంది. మగ్గుల్లో నింపి సర్వ్‌ చేస్తారు.

వారాంతపు శెలవు రోజుల్లో భారతీయ గ్రామాల్లో కల్లు కోసం ఎగబడుతున్నట్టు చైనాలో వెదురు బ్రాందీ కోసం పరుగులు తీస్తున్నారు.

పోషకాల మద్యం

ఈ మద్యం కిక్‌ ఇవ్వడంతో పాటు.  వెదురులో గొట్టంలో నిలువ ఉండటం వల్ల  ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి, ఆరోగ్యానికి మంచివి అని ఆ దేశపు పోషకాహార నిపుణులు అంటున్నారు.

ఈ అడవిలో వెదురుతో అధిరే  వంట… https://youtu.be/C4Uv5_tY9Ug

ఉక్కు కంటే దృఢమైనది

చైనా వెదురు ఒక రోజులో 35 అంగుళాల వరకు పెరుగుతుంది. మన కళ్ళ ముందే  చెట్టు పెరుగుతున్నట్లు ఉంటుంది. ఇప్పటివరకు రికార్డు సృష్టించిన ఎత్తైన చెట్టు ఐరోపాలో 130 అడుగుల పొడవు ఉంది.

వెదురు  ప్రపంచవ్యాప్తంగా బలమైన పదార్థాలలో ఒకటి,  ఇది ఉక్కు కంటే బలమైనది.  సాధారణ కాంక్రీటు కంటే ఎక్కువకాలం ఉంటుంది అని వెదురు పరిశోధకులు అంటారు.

ఇవి కూడా చూడండి.. బొంగులో కల్లు, తెలంగాణ స్పెషల్‌ https://www.bbc.com/telugu/india-43955491

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles