కొండ మీద ప్రగతి ‘పొల్ల’

అది అటవీ ప్రాంతం. చుట్టూ కొండలు కోనలు.. అసలే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో మరీ మూలకు విసిరేసినట్టుండే ప్రాంతం. వ్యవసాయానికి అంతంతమాత్రమే అనువుగా ఉండే భూములు. మౌలిక సదుపాయాల సంగతి సరే సరి. అలాంటి గ్రామంలో ఉపాధి హామీ పథకం అద్భుతాలే చేసింది. కొండకోనల్లోని గిరిజనుల్లో కొండంత ఆత్మవిశ్వాసం నింపింది. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాడుతో అడవి బిడ్డలు కదిలారు. ప్రగతి బాట పట్టారు. అదెలాగంటే..

శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి 80కిలో మీటర్ల దూరంలో సీతంపేట మండలం లో 16 ఆవాసాలున్న గిరిజన గ్రామం పొల్ల పల్లె జనాభా 2392. ఊరు బాగుపడాలంటే జల సంరక్షణ చేపట్టాలికురిసిన ప్రతి చినుకునూ ఒడిసిపట్టాలిఇంకుడు గుంతలు తవ్వుకోవాలివ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవాలివైవిధ్యమైన పంటలు పండించాలిఇవన్నీ నిజమేకానీ ఇవి జరిగేదెలా.. వీటికి నిధులు ఎవరు ఇస్తారు.పోనీ గ్రామస్తులంతా ఏకమై పనులు చేసుకుందామంటే పొట్టగడిచేదెలా.. ఇవన్నీ ప్రశ్నలేవీటికి సరైన జవాబుగా ఉపాధి హామీ పథకం నిలిచింది గ్రామ తలరాతను మార్చేసిందికొంచెం కొంచెంగా కుదిరిన నమ్మకం గ్రామస్తులను ఒక్కటి చేసింది.

ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని ఊరి బాగు కోసం కలసికట్టుగా కదిలారుపొల్ల గ్రామస్తులుజల సంరక్షణతోనే జీవితాలు బాగుపడతాయని నమ్మారుగ్రామం చుట్టుపక్కల ఉన్న నాలుగు చెరువుల్లో పూడిక తీశారుమరో నాలుగు బోర్వెల్రీచార్జ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని బోర్లు పునరుద్ధరించుకున్నారు. 485 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారుక్రమంగా వారి కృషి ఫలించింది.గతంలో 16బస్తాల వరి దిగుబడి ఉంటేఉపాధి హామీ పథకం ద్వారా జలసంరక్షణ పనులు చేపట్టాక అది 24బస్తాలకు పెరిగిందని గ్రామస్తులంటున్నారు.

WATCH NEXT: How to Make Variety Bags with Banana Fiber https://youtu.be/sxHJWAnjO5M

పొల్ల గ్రామంలో 527 మందికి జాబ్‌ కార్డులున్నాయి. మొత్తం మీద సహజ వనరుల అభివృద్ధి పనుల వల్ల 969 ఎకరాలు పొల్ల పంచాయితీలో సాగులోకి వచ్చాయి. గ్రామస్తులు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి.  పొల్ల గ్రామంలో మొత్తం 40 పొదుపు మహిళా సంఘాలు ఉన్నాయి. గ్రామంలో పారిశుధ్యం స్పృహ కూడా పెరిగింది.  గ్రామంలో మొత్తం 352 వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. గతంలో పూరింటిలో బతికిన నిమ్మక ప్రమీల ఇప్పుడు ఎన్టీఆర్‌ గృహాన్ని నిర్మించుకొని సంతోషంగా చంటి బిడ్డతో బతుకుతోంది.


అజ్ఞానం లాగానే అభివృద్ధి కూడా అంటువ్యాధేకనుచూపు మేరలో కనిపించిన మార్పు పొరుగువారినీ ఆలోచింపజేస్తుందిపొల్ల గ్రామస్తుల విషయంలో అదే జరిగిందిపొల్ల ప్రగతి పయనం ఇదే పంచాయితీలోని చీడిమాను గూడలోనూ మార్పు తీసుకొచ్చిందిఅయితే ఇక్కడ సమస్య వేరే ప్రాంతమంతా కొండవాలుకురిసిన చినుకులు జాలువారి భూమి సారవంతమయ్యేది కాదుఅందుకే దీనికి పరిష్కారంగా కొండవాలులో కందకాలు తవ్వారుభూసారం కొట్టుకు పోకుండా ఆపారు కొండ వాలులోనే నేల కాస్త ఎక్కువ చదునుగా ఉన్నచోట వరి పండిస్తున్నారుమిగిలిన ప్రాంతంలో పైనాపిల్,పసుపుజీడిమామడిసీతాఫలం పంటలు పండిస్తున్నారు.

చీడిమానుగూడలో వచ్చిన మార్పుకు నాగేశ్వరరావురాము నిదర్శనంజలసంరక్షణ చర్యలు ఇచ్చిన భరోసాతో కూరంగి నాగేశ్వరరావుహారిక రాము చెరో అరెకరంలో మామిడిసపోటా మొక్కలు పెంచుతున్నారు సాగు కూడా నరేగా కార్యక్రమంలో భాగంగానే చేశారువచ్చే ఏడాది తోట కాతకు వస్తుందని వారు సంతోషంగా చెప్పారుతనకు తాను సాయపడేవాడికే దేవుడు కూడా సహాయపడతాడు అని సామెత పొల్ల గ్రామపంచాయతీ విషయంలోనూ ఇదే జరిగిందితాగునీటి కోసం చాపరాయి గూడ

గిరిజనులు పడుతున్న కష్టాలు చూసి పరిష్కారం కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు కదిలింది. విద్యుత్ కోతలతో ఇబ్బంది లేకుండా సోలార్ పవర్‌తో తాగునీటి సదుపాయం ఏర్పాటు చేసింది. ఇలా నరేగా అందించిన తోడ్పాటుతో పొల్ల గ్రామ పంచాయతీ అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. మిగిలిన గిరిజన పల్లెలకు ఓ రోల్‌ మోడల్‌ గా నిలుస్తోంది.

SUBSCRIBE to Rural Media:https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles