నేల లోని నీరంతా అడుగంటడంతో అక్కడి ప్రభుత్వం ఆమధ్య ‘డే జీరో’ ప్రకటించింది. అదే దక్షిణాఫ్రికా రాజధాని ‘కేప్‌టౌన్’. అంటే నీళ్లు వాడాలంటే కొన్ని పరిమితులు ఉంటాయి .
చండీగఢ్ లో ఇకపై ప్రజలు ఎవరైనా సరే నీటిని వథా చేస్తే వారిపై రూ.2వేల జరిమానా వేస్తారు. అయినప్పటికీ వారు వినక పోతే, వారి నీటి కనెక్షన్‌ను కట్ చేస్తారు. ఇటీవల ఈ కొత్త రూల్ అక్కడ అమలులోకి వచ్చింది.
నేల పై రాలే ప్రతీ చినుకును ఒడిసి పట్టక పోతే, పై లిస్టులోకి మిగతా దేశాలు చేరడానికి ఎంతో కాలం పట్టదు. అని హెచ్చరిస్తున్నారు జలనిపుణులు.
భూగర్భజలాల వాడకంలో ఇండియా టాప్
నీటి వనరుల్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేక పోవడం వల్ల మన దేశంలో దాదాపు రెండు లక్షల గ్రామాలు దారుణమైన కరవును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం- దేశంలోని భూగర్భజలాల్లో 70 శాతం నీటిని రైతులు వ్యవసాయానికే వాడుతున్నారు.భూగర్భజలాల వాడకంలో చైనా, అమెరికాల వాడకాన్ని కలిపినా కూడా మనదే ఎక్కువ. దీనిక్కారణం హరితవిప్లవమే. వరి, చెరకు, గోధుమల్ని ఎక్కువగా పండించడం వల్లే నీటి వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇదిలాగే కొనసాగితే బంగారు బాతు గుడ్డు కథ నిజం కావడానికి ఎంతోకాలం పట్టదన్న విషయాన్ని గుర్తించారు తెలంగాణ రైతులు. ఎండిన బోర్లకు,బావులకు జీవం పోస్తున్నారు. వారికి నాబార్డ్ చేయూత నిచ్చింది.
SUBSCRIBE to Rural Media:https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber
” చేద వేసి నూతిలో నీళ్లను తోడినట్టుగా మోటారుపంపుల్ని బిగించి, భూగర్భ జలాలన్నింటినీ, తోడేస్తున్నాం. కానీ వాటిని తిరిగి భూమిలోకి ఇంకే మార్గం గురించి మాత్రం ఆలోచించడం లేదు. దాంతో బోర్లు,బావులు ఎండిపోతున్నాయి. పూర్వకాలంలో అయితే బావులు, చెరువులు, గుంతల్లో నిల్వ చేసుకున్న నీటితోబాటు నదులూ, వాగుల్లోని పారే నీటితోనూ పంటలు పండించుకునేవారు…” అంటున్నారు, సహాయ ఎన్జీఓ ప్రతినిధి రాజ్ కమల్. ఈయన భూగర్భ జలనిపుణుడు కూడా అయిన
How To Make Custard Apple Ice cream https://youtu.be/_ZnTZz6C_GU
రాజ్ కమల్ , కాకతీయ వ్యవసాయ ఉత్పత్తి దారుల రైతు సంఘం రైతులతో కలిసి ఆనాటి పద్ధతుల్ని అధ్యయనం చేశారు. ప్రాచీన వ్యవసాయ పద్ధతులకి ఆధునిక విజ్ఞానాన్ని జోడిస్తే ఫలితం ఉంటుందని తెలుసుకున్నారు. వర్షపు నీరే ప్రధాన వనరు అని గుర్తించి, ఎండిన బావులో, బోరుల్లో నీరు చేరేందుకూ ఓ సరికొత్త పద్ధతిని రూపొందించారు.
బోరు రీచార్జ్ ఇలా… ?
” ముందుగా బోరుకి సమీపంలో సుమారు ఎనిమిది అడుగుల లోతులో ఒక ఇంకుడు గుంత ను తవ్వుతారు. తరవాత బోరు చుట్టూ మూడడుగుల లోతున గుంత తీస్తారు. దాని చుట్టూ రాళ్లతో గోడ కట్టి, లోపల- అంటే బోరు చుట్టూ ఒక అడుగుమేర గుప్పెడు పరిమాణం ఉన్న కంకరనీ, ఆపై మరో అడుగు మేర దానికంటే తక్కువ సైజు ఉన్న కంకరనీ దానిమీద ఒక అడుగు మందంలో ఇసుకనీ నింపుతారు. బోరుకోసం దించిన గొట్టాలకు కటింగ్ మెషీన్‌తో అక్కడక్కడా చిల్లులు పెట్టి, వాటిని నైలాన్ మెష్‌తో మూసేస్తారు. దాంతో చుట్టూ చేరిన నీటిలోంచి మట్టిరేణువుల్లాంటివి లోపలికి వెళ్లవు. గొట్టంలోపలకూడా నీటిని వడబోసేందుకు ఓ ఫిల్టర్‌లాంటి పరికరాన్ని అమరుస్తారు. ఇప్పుడు బోరు చుట్టూ సిమెంటు రింగుల్ని పేర్చి, బావి మాదిరిగా కట్టి, మోటారు పంపుని అమరుస్తారు.
How to Make Bamboo Bowls https://youtu.be/GSZ2G5BwJFc
చివరగా నీటిని నిల్వచేసే చిన్న కుంట నుంచి నీరు బోరుబావిలోకి వెళ్లేలా ఓ పిల్లకాలువను తవ్వి, దాన్ని కూడా కంకరతో మూసేస్తారు. దాంతో వర్షపునీరు చెరువు నుంచి బోరుబావిలోకీ, బోరుగొట్టంలోకీ వెళ్లి, వేసవిలోనూ ఎండకుండా ఉంటుంది. ఈ పనికి నాబార్డ్ అర్ధిక సాయం అందిస్తోంది. ” అని వివరించాడు రాజ్ కమల్. ( rajkamal phone no- 9440958067 )
బోర్ బావిని రీచార్జి చేయడం ఎలాగో ఈ వీడియోలో వీక్షించండి.