చిటిక లో కొబ్బరిబొండాం ఓపెన్ చేయవచ్చు!

 కొబ్బరి నీళ్లు తాగడం ఈజీ!

సమస్యలు ఎదురైనపుడే, కొత్త ఆలోచనలు పుడతాయి.

కొబ్బరి పీళ్లు తాగాలంటే బొండాలను బలమైన కత్తితో కొట్టాలి. ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇదంతా గమనించిన పాండ్యరాజ్‌  తన మిత్రులతో కలిసి, కొబ్బరికాయల పైన రంధ్రం చేసే సులభ సాధనం, కోకోనట్‌ ఓపెనర్‌ డిజైన్‌ చేశాడు.  స్టెయిన్లెస్‌ స్టీల్‌ చివర అంచున ఉన్న పదునైన కట్టింగ్‌ ఎడ్జ్‌ తో కొబ్బరి బొండాం పైన రంధ్రం చేసుకోవచ్చు. చిన్న  స్టెయిన్లెస్‌ గొట్టానికి  ప్లాస్టిక్‌ హ్యాండిల్‌ అమర్చారు. చూడడానికి  గ్యాస్‌ లైటర్‌ లాగా ఉంటుంది.

 దుకాణాలు పెట్టుకొని కొబ్బర బొండాలు కొట్టేవారి కోసం పెద్ద సైజ్‌ యంత్రాలు రెండు మోడల్స్‌లో తయారు చేశారు.

తమిళనాడు లోని కోయంబత్తూరు కి చెందిన పాండ్యరాజ్‌ ఎం.టెక్‌ చదివి మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవంతో ఈ సాధనం కనిపెట్టారు. ఎలా పనిచేస్తుందో ఈ వీడియో చూడండి. కొబ్బరి చెట్టు సులువుగా ఎక్కే స్కూటర్ కూడా తయారు చేశారు. ఈ వీడియో చూడండి.

దీనితోపాటు  చెరకు గడలు ముక్కలుగా చేసే యంత్రం కూడా తయారు చేశారు.

‘‘ ముగ్గురు కార్మికులు నాలుగు గంటల్లో చెరకు గడలను 32 వేల ముక్కలు చేయవచ్చు. దీని వల్ల చెరకు రసం తీసే వారికి చాలా సమయం,ఖర్చు తగ్గుతుంది ‘‘ అని ఆయన అంటారు. (వివరాలకు, పాండ్యరాజ్‌ … 8754625252 )

………………………………………………………………………………………………………………………………………………………………..

తక్కువ సమయంలో పొలం దున్నాలనే తపనతో ఈ రైతుల చేసిన పనికి జై కొట్టాల్సిందే.

ఈ పనిలో కొన్ని లోపాలుండవచ్చు కానీ, వారి ఆలోచనలో నిజాయితీ ఉంది . https://youtu.be/Z1KzWialabU   వీడియో చూడండి…

From Drought To Prosperity…

 These are the lands where drops of waters or mouths opened five years ago (2016)! When it rains, the rudder does not stand still. Some villages in Rayalaseema, which has become a drought-prone area, are now teeming with green peas…. https://youtu.be/M5PybmFagRo

ఇవి కూడా చదవండి…

భావాలను చంపే తుపాకులు పుట్టలేదు.. https://www.ruralmedia.in/public/comparative-analysis-of-communist-movements-in-telugu-states/

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles