మీకు మేలు చేసే వీడియోలు|Rural Media

1 పంటల మీదకు మిడతలో ఉడతలో వస్తే తరిమి కొట్టవచ్చు.

చీడ, పీడలు  పడితే  నివారించ వచ్చు..

కానీ,   ఏనుగుల గుంపులు దాడి చేస్తే ?

 ప్రాణాలకు తెగించి వాటితో పోరాడుతూ,  బీడు నేలలో బంగారం పండిస్తున్న ఈ  ధీరులతో  కలిసి జర్నీ చేయడం మాకు ఆరుదైన అనుభవం… మీరు  చూస్తారా ? https://youtu.be/UeVXYtzVUp0

2 సమస్యలు ఒకదాని తరువాత ఒకటి గా  వస్తే కొంత తట్టుకోగలం. కానీ కష్టాలన్నీ మూటకట్టుకొని మూకుమ్మడిగా దాడి చేస్తే! చంద్రకళ జీవితం అలాంటిదే… గతంలోని చేదును ,భవిష్యత్‌ గురించి భయాన్ని పక్కకు తోసి వర్తమానంలో తలెత్తుకొని జీవిస్తున్న ఆమెకు పలకరిస్తే… https://youtu.be/Yqq2xD9cpdk  ఒక అంతులేని ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఆవరిస్తుంది!

3 ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో ఉండే చంద్రగిరిని మినీ టిబెట్ అని పిలుస్తారు. దేశం లోనే అత్యధికం గా ఇక్కడ మొక్క జొన్న సాగు చేస్తారు   ఎటు చూసిన మంచు, పచ్చదనం కప్పుకొన్న కొండలు మన మనస్సులను ఆహ్లాద పరుస్తాయి.

4 అయ్యో… సంక్షేమ పథకాల పేరుతో  ఖజానా  ఖాళీ చేసి, పేదలకు పంచేస్తున్నారు…

ఇలాగైతే రాష్ట్రం అప్పుల పాలవ్వక తప్పదు అంటున్న గౌరవ నీయులైన మేధావుల్లారా మాతో రండి. ఈ క్యూలో నిలబడండి.

పేదరికం ఎంత విచ్చల విడిగా వీర విహారం చేస్తుందో చూసి తరించండి.  https://youtu.be/h1NDQZbwGnE

5 మధ్యాహ్నం 12 దాటితే , అన్నం, పప్పు, సాంబారు, కూర, పాయసం, వడ, పెరుగు, అరటి పండుతో భోజనం సిద్ధంగా ఉంటుంది. మీరు శ్రీకాళహస్తి వెళ్తే ఇక్కడ ఉచితం గా రుచి చూడండి . సొంత ఇల్లు కూడా లేని ఒక సామాన్యుడు వందల మంది ఆకలి ఎలా తీరుస్తున్నాడో తెలుసు కోండి.. లేదా   ఇదిగో వీడియో  ….

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles