శ్రీసిటీలో ‘నోవా ఎయిర్’ ప్రారంభం

తాడేపల్లి నుంచి వర్చువల్ మోడ్ లో ప్రారంభించిన ఏపీ సీఎం 

పారిశ్రామిక మరియు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ‘నోవా ఎయిర్’ భారీ పరిశ్రమకు సోమవారం(27.1.22) శ్రీసిటీలో ప్రారంభోత్సవం జరిగింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ మోడ్ లో లాంఛనంగా దీనిని ప్రారంభించగ, క్యాంప్ కార్యాలయ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని, నోవా ఎయిర్ ఎండీ & సీఈఓ గజానన్ నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్, శ్రీసిటీ జీఎం (కమర్షియల్ అఫైర్స్) సీహెచ్ రవికృష్ణ పాల్గొన్నారు. అలాగే శ్రీసిటీలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నోవా ఎయిర్ డైరెక్టర్ ఎస్.రాయ్ చౌదరి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాజాబాబు, ఇతర ఆహ్వానితులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 14 నెలల తక్కువ వ్యవధిలో నోవా ఎయిర్ ప్లాంట్ పూర్తికావడం ఓ మైలురాయిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తులు పెంచే క్రమంలో మరో 220 టన్నుల ఆక్సిజన్ పరిశ్రమ ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆక్సిజెన్ తయారీ, ఆక్సిజెన్ పడకల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 176 పిఎస్ఏ ఆక్సిజెన్ ప్లాంట్లు, 24 వేల ఆక్సిజెన్ సరఫరా బెడ్లు సిద్ధంగా ఉందన్నారు. నోవా ఎయిర్, శ్రీసిటీ యాజమాన్యాలకు శుభాకాంక్షలు తెలిపారు. 

నోవాఎయిర్ ఎండీ గజానన్‌ నబర్‌ మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్‌ లోనూ సమయాన్ని వెచ్చించి తమ ప్లాంట్‌ ను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహం అద్బుతమన్న ఆయన, నోవాఎయిర్‌కు త్వరితగతిన అనుమతుల దక్కిన తీరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం విజయానికి నిదర్శనం అన్నారు. ఏడాదిలోపు కంపెనీ కార్యకలాపాలన్నీ పూర్తి కావడం అసాధారణ విషయమన్నారు. కోవిడ్-19 మహమ్మారి రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్నప్పటికీ, అత్యంత వేగంగా అనుకున్న సమయానికి నోవా ఎయిర్ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి చేయడంలో జిల్లా అధికారులు, ఏపిఐఐసి, పరిశ్రమల శాఖ మరియు శ్రీసిటీ మేనేజ్‌మెంట్ మధ్య సమన్వయం కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. యూనిట్‌ ప్రారంభానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోవిడ్, తుఫాను విపత్తులను సైతం ధైర్యంగా ఎదుర్కొని ప్రాజెక్ట్‌ కోసం శ్రమించిన నోవాఎయిర్ సిబ్బంది, కాంట్రాక్టర్లను అభినందించారు. సుస్థిర హరిత హిత చర్యల ద్వారా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో పురోగతిని సాధించడం తమ లక్ష్యం అన్నారు.

………………………………………………………………………………………….

జ్వరం లేని ఇల్లు లేదు. డోలో వాడని కుటుంబం లేదు. జలుబు చేసినా, కరోనా అనిపించినా… ఫొలో మంటూ డోలో వెంట ఎందుకు పడుతున్నారు ?జ్వరానికే చెమటలు పట్టించే Dolo-650 కధ https://youtu.be/jC9pD-mWRT4

………………………………………………………………………………………..

పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడం ద్వారా తమ శక్తి అవసరాలలో 50% తగ్గించుకుంటామన్నారు. వినియోగదారుల సంతృప్తి, నమ్మకాన్ని స్థిరంగా ఉంచేలా ఈ ప్లాంట్ పనిచేస్తుందని విశ్వసిస్తున్నట్లు అన్నారు.  ప్లాంట్ ప్రారంభంపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, శ్రీసిటీకి సంబంధించి ఇది ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి పాల్గొన్న మొదటి ముఖ్యమైన కార్యక్రమం అన్నారు. శ్రీసిటీ కమ్యూనిటీ తరపున ఆయనకు సాదర స్వాగతం పలికారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీసిటీలో ఆక్సిజెన్ ట్యాంకుల తయారీ పరిశ్రమ వీఆర్వీని ప్రారంభించగా, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ప్లాంట్ ను ప్రారంభించడం శ్రీసిటీ ప్రగతిలో ఓ ముఖ్య ఘట్టంగా అభివర్ణించారు. సకాలంలో ప్లాంట్‌ను ప్రారంభించినందుకు గజానన్ నబర్ మరియు నోవాఎయిర్ బృందానికి అభినందనలు తెలియచేశారు. ఏపి ఇండస్ట్రియల్ గ్యాస్, మెడికల్ ఆక్సిజెన్ తయారీ నూతన పారిశ్రామిక విధానం కు స్పందించిన మొట్టమొదటి అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ గ్యాస్ కంపెనీ ‘నోవా ఎయిర్’ అని రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను పటిష్టం చేసే దిశగా నోవా ఎయిర్ సంస్థ యుద్ధప్రాతిపదికన ప్లాంట్‌ ఏర్పాటు చేపట్టిందన్నారు. ‘నోవా ఎయిర్’  భవిష్యత్తులో ప్లాంట్ విస్తరణ చేపట్టడంతో పాటు ఈ రంగంలో దేశంలోని ప్రధాన పరిశ్రమలలో ఒకటిగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  
వాతావరణ వాయువుల (ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్) ఉత్పత్తిలో పేరుగాంచిన ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ గ్యాస్ కంపెనీ ‘నోవా ఎయిర్’ రూ.130 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో రోజుకు 200 టన్నుల సామర్థ్యంతో మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్ & లిక్విడ్ ఆర్గాన్ వాయువులను ఉత్పత్తి చేస్తారు. 150 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ఇది భారతదేశంలో నోవాఎయిర్ యొక్క మొదటి ప్రాజెక్ట్. గణనీయమైన పరిమాణంలో వైద్య ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తూ, ఈ ప్రాంతంలో కోవిడ్ వేవ్‌ కట్టడికి కూడా ఖచ్చితంగా సహాయపడుతుంది. దీంతో పాటు ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, మెటల్స్, ఆటో, టెలికాం, టైర్లు, జనరల్ ఫ్యాబ్రికేషన్, ఏరోస్పేస్, ఇన్‌ఫ్రా వంటి రంగాలకు చెందిన శ్రీసిటీ మరియు పరిసర ప్రాంతాలలోని పరిశ్రమలకు అవసరమైన వివిధ రకాల పారిశ్రామిక వాయువులను ఈ పరిశ్రమ సరఫరా చేస్తుంది. దేశంలో ఇలాంటి మరిన్ని ప్లాంట్‌లను నిర్మించేందుకు నోవా ఎయిర్ యోచిస్తోంది.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles