An humble appeal to AP government…మా కాటన్ దొర అని , ప్రజలు అభిమానంగా పిలుచుకొనే నీటిపారుదల ఇంజనీరు, సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించక పోతే ఈ రోజు కోనసీమ కరవు సీమగా మారేది.
తమకు అన్నం పెట్టిన కాటన్ దొర మీద ప్రేమతో ఒక రైతు తన ఇంటి ముందు కాటన్ విగ్రహం పెడితే, ( https://youtu.be/zRQBXrXjLSs )మరో నర్సరీ రైతు అంటుకట్టి అభివృద్ధి చేసిన కొత్త పండ్ల మొక్కకు కాటన్ దొర నేరేడు అని పేరు పెట్టుకోవడం ( https://youtu.be/1gEzxHjvn9Y ) మేం రిపోర్ట్ చేశాం. గోదారి ప్రజల గుండె చప్పుడు ఆర్థర్ కాటన్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి వినతి.