మానవీయ,సామాజిక శాస్త్రాల పరిశోధనా కేంద్రం

క్రియా యూనివర్సిటీలో నూతన పరిశోధనా కేంద్రం ఏర్పాటు

– లాంఛనంగా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

శ్రీసిటీలో క్రియా యూనివర్సిటీలో ‘మోటూరి సత్యనారాయణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్’ నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటేరియన్ మోటూరి సత్యనారాయణ పేరున ఆయన కుటుంబసభ్యులు మానవీయ, సామాజిక విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీన చెన్నై రాజ్ భవన్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దీనిని లాంఛనంగా ప్రారంభించారు.  

ఈ  సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, మానవీయ, సామాజిక శాస్త్రంలో నాణ్యమైన విద్యకు మారుపేరైన క్రియా ప్రయాణంలో ఇదో ముఖ్యమైన మైలురాయిగా పేర్కొంటూ, క్రియా యాజమాన్యం, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ కేంద్రం యొక్క విద్యా విధానాలు మరియు భోదన వినూత్న పంధాలో ఉంటాయన్నారు. కేంద్రం ఏర్పాటుపై మోటూరి కుటుంబసభ్యులను ఆయన అభినందించారు. ఇదే తరహాలో విద్య, వైద్య, విజ్ఞాన రంగాల అభివృద్ధి కోసం ఆర్థికంగా ఉన్నత స్థాయి కుటుంబాలు ముందుకు రావాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని సూచించిన ఆయన నేర్చుకోవాలి, సంపాదించుకోవాలి, సమాజ అభివృద్ధి కోసం నలుగురితో పంచుకోవాలి (లెర్న్, ఎర్న్, రిటర్న్ టు సొసైటీ) అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మోటూరి సత్యనారాయణకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  భారతీయ భాషలను ప్రోత్సహించడంలో మోటూరి కృషిని గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి, మాతృ భాషలో విద్యావిధానంతో ఆత్మగౌరవం పెరుగుతుందని అన్నారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదని, వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవడం మంచిదని, అయితే ముందుగా మాతృభాష, సోదర భాష, జాతీయ భాషను నేర్చుకోవాలని సూచించారు. 

వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ మహేష్ రంగరాజన్ మాట్లాడుతూ, నిర్దేశిత విజన్, మిషన్ తో పనిచేస్తున్న క్రియా విశ్వవిద్యాలయంలో మానవీయ సామాజిక శాస్త్రాలలో మరింత ప్రావీణ్యత పెంపొందించడమే మోటూరి సత్యనారాయణ  సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కేంద్రం లక్ష్యం అన్నారు. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్స్, సమాచార మార్పిడి, పరస్పర చర్చల ద్వారా క్రియా లోపల, బయట ఒక శక్తివంతమైన మేథో పరిసరాలను ప్రోత్సహించడానికి ఈ కేంద్రం సహాయపడుతుందన్నారు. మన భవిష్యత్తుకు పరిశోధనలు ఎంతో అవసరం కాగా, మంచి భవిష్యత్తు కోసం గతాన్ని మరియు వర్తమానాన్ని గురించి ఆలోచించడంలో ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

……………………………………………………………………………………

పెద్దజుట్టు, తెల్ల చొక్కా, పంచెకట్టు, కోరమీసం, భుజం మీద ‘మెట్ల కిన్నెర’తో అత్యంత సాధారణంగా కనిపించే అసాధారణ కళాకారుడు దర్శనం మొగిలయ్య. తన పూర్వీకులనుండి వారసత్వంగా వస్తున్న అరుదైన కళకు చిట్టచివరి వారసుడు. ఆయన వాడే ‘పన్నెండు మెట్ల కిన్నెర’ ఓ అద్బుత వాద్యం. హరిత సమాజం కోసం అతడు గానం చేసిన కొత్తపాట ఇది…https://youtu.be/3ylC2T9Fc9g

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles