నాలాంటి వాడికి మొక్కలు నాటండి,అని చెప్పారను కోండి. ఏదో ఒక పిలకను నాటి పదిరకాల సెల్ఫీలు తీసి ఫేస్బుక్ ని డిస్ట్రబ్ చేస్తాడు.అదే చిన్న పిల్లలకు ఒక పాఠం లా చెబితే, జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ‘‘ మొక్కలు నాటే ముందు, వాటి గురించి తెలుసుకోండి.’’ అంటాడు కొమెర జాజి.పొద్దు పొడవక ముందే నల్లమల అడవుల్లోకి వెళతాడు. అతడి కోసమే ఎదురు చూస్తున్న పక్షులు చుట్టూ చేరతాయి.
గుప్పెడు గింజలు వాటికి వేస్తాడు. కృతజ్ఞతగా ఆ పిట్టలు జాజికి అరుదైన మొక్కలను పండ్లను, ఆకులను చూపిస్తాయి. వాటిని గుర్తు పెట్టుకుంటాడు. మర్నాడు కొందరు విద్యార్దులను తీసుకెళ్లి ఆ మొక్కలను చూపించి వాటి వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్ల లోని ఔషధ గుణాలను వివరిస్తాడు.అడవికి కృతజ్ఞతగా ఆ చిన్నారులు ఆ మొక్కలను తమ పెరట్లో, స్కూల్లో పెంచుతారు.
అలా ఆకుపచ్చని భవిష్యత్ చిత్రపటం సృష్టిస్తున్న ఈ యువకుడు ఎవరు ? కాలుష్యం వెదజల్లుతున్న మనుషుల మధ్య సన్న జాజి తీగలా అల్లుకుంటున్న కొమెర జాజికి Hi చెబుతారా ? ఈ https://youtu.be/XhOPsWVe7Ts లింక్ క్లిక్ చేయండి!