ఆయుష్షు పెంచే అద్భుత రైస్

మన దేశంలో మణిపూర్ లో నల్ల బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు. అక్కడ ఈ బియ్యాన్ని చకావో అముబి అని పిలుస్తారు. మణిపురీ భాషలో చకావో అంటే నోరూరించేది అని అర్థం. అముబి అంటే నల్లనిది అని అర్థం. నల్లగా, నోరూరించే రుచితో ఉండే బియ్యం కాబట్టి దీనికి ఆ పేరు.

నల్ల బియ్యం ప్రయోజనాలు

* నల్ల బియ్యం లో ఫైబర్, విటమిన్ ఇ, నియాసిన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయి. * నల్ల బియ్యం డయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ని ఇది కంట్రోల్లో ఉంచుతుంది. * ఈ బియ్యంలో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒబేసిటీ సమస్యను కూడా తగ్గిస్తాయి. దీన్ని మామూలు బియ్యానికి బదులు తినడం వల్ల బరువు వేగంగా తగ్గే వీలుంటుంది. * నల్ల బియ్యంలో యాంథో సైనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి వ్యాధులను నయం చేస్తాయి. * ఈ బియ్యం గంజిని తలకు పట్టిస్తే వెంట్రుకలు చాలా బలంగా పెరుగుతాయి. ముఖానికి మాస్క్ గా వేసుకుంటే మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి. * నరాల బలహీనత ఉన్నవారికి ఈ బియ్యాన్ని మసాజ్ చేసేందుకు కేరళ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. * ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యాన్ని ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. * అధిక రక్త పోటు సమస్య నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుంది.

బియ్యం సాగు చేస్తున్న రైతును కలుద్దాం రండి…

సిద్దిపేట జిల్లా లింగాపూర్ గ్రామంలో లో మూడు ఎకరాల పొలంలో నల్ల బియ్యం తో సహా 50 రకాల వరి వంగడాలను సేంద్రియ విధానంలో మేము సాగు చేస్తున్నాం. క్యాన్సర్ తో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మూల కారణం ఆహారమే. రసాయనాలతో పండించిన ఆహారం తీసుకోవడం వలన ఆ సమయానికి ఆకలి తీరుతుందేమో కానీ శరీరంలో అనారోగ్యం పెరుగుతుంది. . మన పూర్వీకులు ఏం తినేవారు ఎలాంటి వంగడాలను వాళ్ళు సాగు చేసే వాళ్ళు అన్నది తెలుసుకునే ప్రయత్నం లో పురాతన స్వదేశీయ వరి వంగడాలను సేకరించడం మొదలు పెట్టాం. అలా దాదాపు 51 రకాల వరి వంగడాలను సేకరించి సాగుచేసి ఈ విత్తనాలను ఉచితంగా ఇతర రైతులకు పంపిణీ చేశాం.” అంటున్నారు జక్కుల తిరుపతి… https://youtu.be/sCJpyA1GqV0

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles