మట్టి పాదాలకు స్వాగతం !
‘‘ వెలుగు, విద్య,వైద్యం లేని వారి కోసం పనిచేయడమే
జీవితం అని నిరూపిస్తున్నారు డాక్టర్ నరేందర్ ,
కరవు నేలలో నీటికి నడకలు నేర్పి,పసిడి పంటలకు బాటలు వేస్తున్నారు పరేషమ్మ,
తోడు,నీడలేని మహిళలకు అండగా మారిన శ్రావ్యదేశ్‌ముఖ్,
ప్రకృతి పంటలతో ప్రజల ఆరోగ్యం కాపడటమే కాక, విత్తనాలను రైతులకు పంచుతున్న జక్కుల రేణుక,
నల్లమల అడవిలో చిన్నారులకు ప్రకృతి పాఠాలు చెబుతూ కొత్త ఆకుపచ్చని లోకాన్ని సృష్టిస్తున్న కొమెర జాజి,
‘‘ తేనెటీగలను కాపాడక పోతే,సమస్త జీవనం ఎందుకు
ఆగిపోతుందో హెచ్చరిస్తున్న పెదబాల…’’ అని నేను చెబుతుంటే…
‘‘ పద్మ అవార్డులకు ఏమాత్రం తగ్గని ప్రతిభావంతులు. వారిని గౌరవించుకోవడం మన సామాజిక బాధ్యత! ’ అన్నారు సుచిర్ ఇండియా సంస్ధ ప్రతినిధులు.
ఇదంతా రెండువారాల క్రితం మాట.
ఈ రోజు (28-11-2021) సాయంత్రం 6కి వీరందరికీ హైదరాబాద్ రవీంధ్రభారతిలో సత్కారం.
Big thanks to, Adesh Ravi,Suchir India.
వీరిలో కొందరి విజయాలు ఈ వీడియో లో చూడండి.