పాతాళ గంగమ్మ పైపైకి వస్తోంది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం, ఆ వర్షపు నీరు వృథా కాకుండా ప్రజలు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడం తో భూగర్భ జలమట్టం పెరిగింది. ఎండిపోయిన బోర్లు, బావుల్లో కూడా నీటి లభ్యత పెరిగింది. దాంతో రబీలో సుమారు 24 లక్షల ఎకరాల్లో బోర్లు, బావుల కింద పంటలు సాగయ్యే అవకాశం ఉందని, మాతో అధికారవర్గాలు చెబుతున్నాయి.
2018 లో వర్షాకాలం ముగిసిన తర్వాత భూగర్భ జలమట్టం 12.85 మీటర్ల లోతులో ఉండేది. వాటర్ షెడ్ పనుల వల్ల గత మూడేళ్లలో భూగర్భ జలాలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 5.78 మీటర్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ స్థాయిలో అందుబాటులోకి రావడం మూడు దశాబ్దాల తర్వాత చూస్తున్నామని, అనంతపురం, ప్రకాశం జిల్లా రైతులు RURALMEDIA తో చెప్పారు . వీడియో లు చూడండి… https://youtu.be/FuP9wgSJ-vk