2022లో కూడా విద్యుత్ లేని గ్రామాలను మేం చూశాం. అభివృద్ధికి విద్యుత్ అవసరమే కానీ, బల్బులు వచ్చాక వెన్నెలను అనుభవించడం మర్చి పోయాం. చంద్రుడిని అభినందించడం మానేశాం.
ఇలాంటి ఒక చీకటి పల్లెలో కష్టజీవులు సృష్టించిన స్వర్గమే Aevum Jagat .డబ్బు కోసం, డబ్బు చుట్టు తిరిగి తిరిగీ అలసిపోతున్న మనుషులకు కొత్త దారి చూపేదే ఈ సినిమా.
ఒక్క రూపాయి నాణెం కూడా తయారు చేయకుండా సుఖంగా జీవించే సమాజపు స్వప్నమే ఈ చిత్రం. https://youtu.be/4AoGaH9TiCg ఈ నెల 16 ఉదయం 10 గంటలకు జరిగే Aevum Jagat రిలీజ్ వేడుకను రూరల్ మీడియా ఛానల్ లైవ్ లో చూడండి. 30 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు టిక్కెట్ మాత్రం ఒక్క రూపాయి మాత్రమే.