రూరల్ మీడియా|ఎకో ఫ్రెండ్లీ యూట్యూబ్ ఛానెల్ !

శ్యాంమోహన్‌ ఒక రైతుబంధు జర్నలిస్టు. ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు. సేంద్రియ వ్యవసాయ ప్రమోటర్. గిరిజనుల, ఆదివాసీల జన జీవన ప్రమాణాలలో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తున్న వలంటీర్. రూరల్ మీడియా డైరెక్టర్.”రూరల్ మీడియా” ఒక ఎకో ఫ్రెండ్లీ అండ్ ఇన్స్పైరింగ్ యూ ట్యూబ్ ఛానల్. ప్రకృతి వ్యవసాయాన్నీ, సేంద్రీయ సేద్యాన్నీ, స్వచ్ఛమైన జన జీవన విధానాన్నీ శ్వాసించీ, స్వప్నించీ ముఖ్యంగా ప్రేమిస్తూ, సామాన్య ప్రజలకి ఈ జీవన విధానాన్ని తెలియ చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్నీ, సేంద్రీయ సాగునీ మరింతగా ప్రమోట్ చేసే ఒక వేదిక. గిరిజనులు, ఆదివాసీలు, వెనుక బడిన జాతులు, ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా మిగిలి పోయిన కొన్ని గ్రామాల బాగోగుల కోసం శ్యాంమోహన్‌ పర్యవేక్షిస్తున్న వొక యూ ట్యూబ్ ఛానెల్ .అయితే మనం చూసే ఈ చిన్ని చిన్ని ప్రయోగాత్మక, సందేశాత్మక వీడియోలని ప్రసారం చేసే నేపధ్యంలో శ్యాంమోహన్‌ పడే తపన, తీసుకున్న రిస్కు, చూపించిన ఆసక్తి, తను పడిన శ్రమ ఈ వీడియోల వెనుక జేగురు రంగులో కనిపిస్తూ ఉంటుంది.

తను వెళ్లే కొన్ని గ్రామాలకి కనీస రవాణా వ్యవస్థ కాదు కదా, నడిచే దారి కూడా ఉండదు. రాళ్లు, రప్పలు, ముళ్లు, తుమ్మ కంపలు ఇవన్నీ చిన్న మాటలు. అభయారణ్యాలు, నల్లమల అడవులు, దండకారణ్యాలు. చిన్నప్పుడు చందమామ కధల్లో చదివినట్టు చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవులు గుర్తొస్తాయి. ఇండియన్ ట్రైబ్స్ గా వ్యవహరించే గిరిజనులు మరియు ఆదివాసీల జీవనాధారాలనీ, జీవన ప్రమాణాలనీ, వారి ఆహారపు అలవాట్లు, సేద్య రీతులు, ఎటువంటి ఆధునిక టెక్నాలజీలు, ఆడంబరాలు తెలీని వారి జీవనశైలిని మనకి పరిచయం చేస్తాడు. ఈ డిజిటల్ ఏజ్ లో కూడా ఇప్పటికీ విద్యుత్తు లేని ఒక మారుమూల పల్లెని పరిచయం చేసి గుడ్డి దీపాల వెలుతురులో వాళ్ల బతుకు చిత్రాన్ని చూపిస్తూంటే ఇంకా ఇటువంటి గ్రామం ఒకటుందా అని ఆశ్చర్య పడాలో, సిగ్గు పడాలో అర్ధం కాదు.ఒక్కోసారి ఆగికల్చరల్ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఆశ్చర్య పడేలా వారికి తెలీని కొన్ని వ్యవసాయ మెళకువలనీ మారుమూల గ్రామాల్లోని సాధారణ రైతులు ఎలా అమలుపరుచుకుని ఒక ఆరోగ్యకరమైన పంటని పండించుకుంటున్నారో వివరిస్తాడు.

ప్రభుత్వ సహాయం ఏమాత్రం అందని చోట అక్కడి గిరిజనులు, ఆదివాసీలు స్వంతంగా వారికి వారు తయారు చేసుకున్న ప్రాజెక్టుల గురించి, ప్రత్యమ్నాయ వసతుల గురించి వివరించి వారి సక్సెస్ స్టోరీస్ ని ఒక ఐ ఫీస్ట్ లా విజువలైజ్ చేస్తాడు.సుమారుగా ఎనభై మంది కొండ రెడ్లు నివసించే పెద్ద కొండ, రంప చోడవరం, తూర్పు గోదావరి జిల్లా కి ఇంత వరకు రోడ్ లేక పోవడాన్ని చూస్తే నోట మాట రాదు. వంద శాతం ప్రకృతి వ్యవసాయాన్నే నమ్ముకున్న కొండబారిడి గ్రామం. కొండ వాలు లో చుక్క నీరు నిలువని చోట మెట్ల సాగు పద్ధతి. కర్ణాటక లో కరువుతో అల్లాడి పోయే చిత్రదుర్గ లో ఒక నీటి చెలమని సృష్టించడం. నీటి ఊట కూడ లేని మహాదేవ్ పూర్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో మహిళలతో మాత్రమే ఏర్పాటయిన తొలి వాటర్‌ షెడ్‌ కమిటీ.

చిత్తూరు జిల్లాలో నాబార్డ్ సహాయంతో ఒక పంటకు బదులు మరో నాలుగు పంటలు వేసి సంవత్సరం పొడవునా ఆదాయం పొందుతూ రైతు కూలీల స్థాయి నుంచి స్వయంగా రైతులు గా ఎదిగిన తీరు. చదువంటే తెలియని ఒక కోయ గిరిజన గూడెంలో పాతికేళ్ళు లోపు సంతోష్ ఈశ్రం తన మిత్రులతో కలిసి నిర్వహించే భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ అనే ప్లే స్కూల్ ని చూస్తే ప్రభుత్వ విద్యా విధానాలకి పాఠం చెప్పినట్టు వుంటుంది. అభయారణ్యం లోని క్రాంతి నగర్ తండా లో ఇప్పటికీ చొక్కా, చెప్పులు వాడని డెబ్బయ్యేళ్ళ సోడి గంగ పరిచయం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ విద్య, వైద్యం, విద్యుత్ వంటి సదుపాయాలు లేవు. యేటి లో నీటిని మోకాళ్ల మీద కూర్చుని నోటితో పీల్చి తాగుతారు. ఇవన్నీ మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే రూరల్ మీడియా ఈజ్ ఏన్ అన్ ఎండింగ్ సిరీస్ ఆఫ్ వీడియో స్టోరీస్ ఇన్ రియల్.

శ్యాంమోహన్‌ చెప్పే రియల్ స్టోరీస్ లో చాలా వరకు ఆదివాసీలు, గిరిజనులే హీరోలు. హీరోయిన్లు కూడా. నిజమైన విక్టరీస్ కి వీళ్ళే ప్రతీకలు. మనకి తెలీని, ఊహకు కూడా అందని కొన్ని జీవితాల్ని పరిచయం చేస్తాడు.ట్.వి. ఆన్ చేస్తే చాలు. వెకిలి హాస్యం, కుళ్లు జోకులు. అదే పనిగా పగల బడి నవ్వే జడ్జీలు. బూతు కామెడీల రియాలిటీ షో లు. హాల్లోనూ, పడక గదిలోనూ కూడా కెమెరాలు పెట్టి వాళ్ళేం చేస్తుందీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసే నిరంతర ప్రసారాలు. వాయోరిజాన్నీ, పీపింగ్ టామ్ సిండ్రోమ్ నీ ప్రమోట్ చేసే ద మోస్ట్ సిక్ రియాలిటీ షో లు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం రిటైర్మెంట్ తీసుకున్న హీరోయిన్ని గంట సేపు లైవ్ లో వెతుక్కుంటూ వెళ్లి తనేం చేస్తుంది, ఎలా ఉంది, ఎన్ని సార్లు విడాకులు తీసుకుంది, ఎంత మంది పిల్లలు. మూతి దగ్గర మైక్ పెట్టి అదొక ఇంటర్వ్యూ.జుగుప్సాకరమైన స్కిట్లు. ఉత్సవాలు, సంబరాలు పేరిట వెకిలి ఆటల చేష్టలు. ఎంత వినోదం పంచే ప్రోగ్రాం అయినా ఇంత అసహ్యంగా, వెకిలిగా, రోతగా డిజైన్ చెయ్యడం అవసరమా. మీడియాలో ఈ చెదలు మొదలైన విధానమెట్టిది !

ఈ నేపథ్యంలో ఈ మధ్యనే శ్యాంమోహన్‌ ప్రెజంట్ చేస్తున్న వొక యూ ట్యూబ్ ఛానెల్ “రూరల్ మీడియా” చూసాను. శ్యాంమోహన్‌ తీసుకున్న కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. థీమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ లో ఒక కొత్త జీవం కనిపించింది. నాకు తోచిన నాలుగు మాటలు చెప్పాలనిపించింది.నిజానికి జర్నలిస్ట్ గా శ్యాంమోహన్ కి ఉన్న ఎక్స్పీరియెన్స్ కి, టాలెంట్ కీ, పలుకుబడి కీ ఎదో ఒక ఛానెల్ లో చిన్న క్యూబ్ లోనో, క్యాబిన్ లోనో కూర్చుని కడుపులో నీళ్లు కదలకుండా సుఖంగా, హ్యాపీగా బతికేయొచ్చు. బట్, భుజం మీద ఒక కెమేరా మోసుకుని రాళ్లు రప్పలు కొండలు గుట్టలు వాగులు వంకలు ఫారెస్టులు దాటుకుంటూ కొన్ని వందల మైళ్ళ దూరం ప్రయాణం చేసి, సమయానికి తినీ తినక, ఒక్కోసారి ఆదివాసీల చేతి రుచిని కూడా చవి చూసి, క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి రూరల్ మీడియా ద్వారా మనకి ఈ వీడియోల్ని ప్రెజెంట్ చేస్తున్నాడు. అన్నా! ఇంత సమాచారాన్ని సేకరించి మనకి విజువలైజ్ చెయ్యడం అంటే మనం వీడియో చూసినంత ఈజీ కాదు. ప్రకృతి మీద ప్రేమ. పర్యావరణం మీద శ్రద్ద. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అన్న తపన ఉండాలి. ఇవే రూరల్ మీడియా మూలాలు. కొన్ని కష్ట నష్టాలని కూడా భరించాలి.

కరోనా కాలం నుంచి ముక్కుకీ, మూతికీ కూడా ఆకు నే మాస్కులా చేసుకుని ప్రొఫైల్ పిక్ పెట్టుకున్న తీరు చాలు కదా శ్యాంమోహన్‌ అంటే ఏంటో అర్ధం చేసుకోవడానికి. నిజానికి శ్యాంమోహన్‌ ఏదేని మీడియాలో ఉంటే ఇంత మంచి ఔట్ పుట్ ఎప్పటికీ వెలుగు చూసేది కాదు. ఇన్ని ఇన్స్పైరింగ్ వెంచర్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చీకటి మాటున మిగిలి పోయేవి. మీకు కొంచెం అతిశయోక్తి గా ఉండొచ్చేమో కానీ నాకు మాత్రం శ్యాంమోహన్‌ చేసే ఈ ప్రయత్నం ఒక యజ్ఞం లా ఉంది.చివరగా చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రయిబ్ ఫర్ రూరల్ మీడియా.

Subscribe to Channel : https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber

శ్యాంమోహన్‌ కోసం కాదు. మన కోసం. ముందు తరాల జీవ వైవిధ్యం కోసం !

  • జి.ఎస్. శ్రీకాంతు.9963053217.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles