రాయల సీమను కోనసీమ గా ఎలా మార్చారో తెలుసా ?

మానవాళి మనుగడకు  భూతాపం,వాతావరణ మార్పులు అతిపెద్ద ముప్పుగా మారాయి. మబ్బుల నుండి పడిన వాన చుక్కలు నేలలోకిభఇంకే పరిస్ధితులు లేవు. ఫలితంగా కురిసిన వానంతా  వృధాగా పోతుంది.  వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. పంటదిగుబడులు   తగ్గి పోతున్నాయి.

 ఈ నేపథ్యంలో జలవనరులను కాపాడుకోవడం అత్యంత కీలకం. ఈ బాధ్యత అందరిదీ, అని గ్రహించి, ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప వర్షపాత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో కరవును ఎదొర్కుంటున్న  రైతులు 2009 నుండి 2019 వరకు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆసరాతో,  వాటర్‌షెడ్‌ షెడ్‌ పథకం ద్వారా 62 గ్రామాల్లో,  భూగర్బ జలసంరక్షణ పనులు చేశారు. కురిసిన ప్రతీ వాన చినుకును ఒడిసిపట్టి, సహజ వనరులను కాపాడి, స్వయం సమృద్ధి సాధించారు.

జలసంరక్షణ వల్ల ప్రకాశం జిల్లా పచ్చల హారంగా ఎలా మారిందో వీడియో చూడండి https://youtu.be/qmcYfu7JQeY

సహజ వనరుల అభివృద్ధి

  సహజ వనరుల అభివృద్ధి, జలసంరక్షణ, జీవనోపాధి మెరుగుదల కోసం Integrated Watershed Management Programme (IWMP)  కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలవుతోంది. జలవనరుల సంరక్షణ ద్వారా భూసారాన్ని కాపాడి, హరిత వనాల్ని పెంచారు. దీనిలో భాగంగా వాటర్‌షెడ్‌ పథకంలో  చెక్‌ డ్యామ్‌లు నిర్మించారు. వీటి పరిధిలో వందలాది ఎకరాలు సస్యశ్యామలంగా మారింది.  వరి, వేరుశనగ, కంది, పొగాకు, దానిమ్మ,బొప్పాయి పంటలు సాగు చేస్తున్నారు.

చెక్‌ డ్యామ్‌ల  తో హరిత పల్లెలను ఎలా సృష్టించారో ఈ వీడియో చూడండి…https://youtu.be/L3O_N8Y1LZ4

 సమగ్రాభివృద్ధి లక్ష్యంగా…

1 వాటర్‌ షెడ్‌ కార్యక్రమంలో భాగంగా, వాన నీటి సంరక్షణకు ఫారం పాండ్‌లు నిర్మించారు. వర్షాకాలంలో పడిన నీటిని నీటి కుంటల్లో నిలువ చేసుకోవడం వల్ల వేసంగిలో కూడా పంటలకు నీరు అందుతోంది.

2 రైతులు శ్రమించి పండిరచిన పంటలను సకాలంలో తగిన విధంగా భద్రపరుచుకోక పోతే, నష్టపోయే ప్రమాదం ఉంది. పంట దిగుబడులను జాగ్రత్తపరుచుకోవడానికి  కల్లాలు కూడా నిర్మించి రైతుకు ఆసరాగా నిలిచింది ప్రభుత్వం.

3 వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో వాటర్‌ షెడ్‌కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేశారు. ఉద్యాన శాఖ ద్వారా జామ, దానిమ్మ, నిమ్మతోటల పెంచుతున్నారు. బీడు భూముల్లో అరుదైన  చెర్రీ తోటలను పెంచి అధిక ఆదాయం పొందటం విశేషం.

4 పశుసంవర్ధక శాఖ ద్వారా పశుపోషణ చేపట్టి అదనపు ఆదాయాలు పొందుతున్నారు. సెర్ఫ్‌ ద్వారా జీవనోపాధుల మెరుగుదలకు కిరాణా షాపులు,చిరువ్యాపారాలు, టైలరింగ్‌ కి రుణాలు అందించడంతో పేద మహిళలు  సుస్ధిర జీవనం గడుపుతున్నారు.

 సబ్బిడీ పై  కొందరు రైతులకు వ్యవసాయ పనిముట్లు కూడా ఇచ్చారు.

5 జలసంరక్షణ వల్ల భూగర్భ జలాలు పెరిగినప్పటికీ , గ్రామాల్లో సురక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్‌లను నిర్మించారు.  ఉప్పమావులూరు పంచాయితీ లోని, సోమవారపు పాడులో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ వల్ల గ్రామస్తులు రక్షిత తాగు నీటిని తాగుతూ రోగాలకు దూరం గా ఉన్నారు.

 సహజ వనరులను సంరక్షించుకుంటూ , నీటిని పొదుపుగా వాడుకుంటూ, వివిధ కార్యక్రమాల ద్వారా, జీవనోపాధి పెంచడానికి ఉద్దేశించినది ఈ సమగ్ర వాటర్‌షెడ్‌ పథకం.

  2030 సంవత్సరం  నాటికి ఆంధ్రప్రదేశ్‌  కరువు ప్రాంతాల్లోని 87.2 లక్షల హెక్టార్లలో సమగ్ర జలసంరక్షణ ఫలితాలు సాధించి కరవునేలలో సిరుల పంటలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

 తెలంగాణలో బీడు భూమి ఆకుపచ్చగా రైతులు ఎలా మార్చారో వీడియో చూడండి https://youtu.be/tzrq-mA5k7w

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles