పచ్చదనం తరిగి పోతూ, పక్షుల అలికిడి లేని నల్లమల అడవిలో నడుస్తున్నాం.
‘‘ స్వార్ధం కోసం పరుగులు తీసే ప్రపంచం ఎవడి కోసం ఆగదు !’’ అన్నాను.
‘‘ దానిని బ్రేక్ చేద్దాం..’’ అన్నాడతడు.
‘‘ ఎలా ? ’’
‘‘ నాతో రండి … స్వార్ధాన్ని ఎలా ఆపాలో చూపిస్తా… !’’ అన్నాడు ధీమాగా.
పైన రాసింది, కలయో.. కవిత్వమో కాదు.. జీవన సత్యం.
మీరు చూడాలనుకుంటే ఈ వీడియో లింక్ https://youtu.be/kJx-qwsCjNA క్లిక్ చేయండి.
ప్రకృతిని కాపాడితే మనిషిని అదే రక్షిస్తుందని అంటాడు ఈ సామాన్యుడు . పంటలు విస్తారం గా పండ డానికి కారణం పక్షులే అంటాడు .
ఈ భూమి మీద పండే ప్రతీ గింజలో పక్షులకు వాటా ఉంది అంటాడు . తనకున్న ఒక్క ఎకరాను
పక్షుల కోసమే వదిలేసి, అవి హాయిగా తీతుంటే చూసి మురిసి పోతున్న అరుదైన రైతు జాజిని కలుద్దాం రండి.