బంగారం కంటే విలువైనవి,ఈ బ్యాంక్ లో… !

బంగారం కంటే విలువైనవి, ఈ బ్యాంక్ లో ఉన్నాయి !!

ఎవరైనా బ్యాంకులో పదో పరకో దాచుకుంటారు లేదూ అంటే లాకరు తీసుకుని నగా నట్రా పెట్టుకుంటారు. కానీ, తెలంగాణలోని మారుమూలనున్న ఈ గ్రామంలో మట్టి గోడలతో కట్టిన బ్యాంకులో మాత్రం విత్తనాలను ఈతబుట్టల్లో భద్రపరుస్తారు. రేపటి తరాలకు స్వచ్ఛమైన ఆహారాన్నీ , భవిష్యత్తుని అందించే అరుదైన ఈ బ్యాంక్ ని పల్లె మహిళలే నిర్వహిస్తున్నారు. అత్తా కోడళ్ల జొన్న విత్తుల తో సహా దాదాపు 70 రకాల చిరుధాన్యపు విత్తనాలు ఈ బ్యాంక్ లో ఉన్నాయి. అన్నీ ప్రకృతి వ్యవసాయం చేసి పండించనవే… సంగారెడ్డి జిల్లాలో వందగ్రామాల్లో సేంద్రియ సాగు చేస్తున్న రైతుల దగ్గర విత్తనాలు సేకరించి ఈ బ్యాంక్ లో ఉంచారు. ఆ విత్తనాల విశేషాలను బ్యాంక్ మేనేజర్ లక్షమమ్మ ఆసక్తికరంగా వివరించారు ఈ వీడియోలో… https://youtu.be/l9rdRNK8ESo

అత్తా   కోడలు రకం  జొన్నలు తెలుసా ?  నాలుగు రకాల సజ్జలు, కొర్రలు, నువ్వులు  ఉంటాయని  విన్నారా ?

కుసుమ నూనె చుక్కలు ఈ గ్రామస్తులు కంట్లో ఎందుకు వేసుకుంటారో తెలుసా … రండి.వారి తో మాట్లాడు దాం..

….https://youtu.be/l9rdRNK8ESo

 ఈ విత్తనాలు కావాలంటే వీరిని సంప్రదించండి.

Deccan Development Society,  opp. Pantaloon, Begumpet, Hyderabad, phone number- 040-27764577, 8978560409

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles