ఆనందయ్య మందులో అతి విలువైన అద్భుత మొక్క ఇదే!!
ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ మందులో వాడే వన మూలికలు కరోనాకు పని చేస్తున్నాయనే ప్రచారం ఊపందుకోవడంతో ఆయుర్వేదంకు ఎనలేని డిమాండ్ పెరిగింది. ఏపీ నుండి తెలంగాణ వరకు ఆయుర్వేద షాపుల వద్ద రద్దీ పెరుగుతోంది.
‘‘ అడ్డసరం, తిప్ప తీగ, అశ్వ గంధ, వంటి మొక్కలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతున్నాయి. ఇమ్యూనిటీ కోసం ఇప్పుడు అందరూ అవే వాడుతున్నారు.’’ అంటున్నారు కృష్ణాజిల్లాకు చెందిన రైతు మరియదాసు. గత దశాబ్దకాలంగా తన పొలం నిండా ఔషధ మొక్కలను పెంచుతున్నారు. తిప్పతీగకోసం పందిర్లు ఏర్పాటు చేసి సాగు చేస్తున్నారు. ఆనందయ్య మందులో వాడుతున్న వన మూలికల్లో అతి ముఖ్యమైన ముళ్ల వంగను దాసు ఈ వీడియోలో పరిచయం చేస్తున్నారు. పొలం గట్లు పక్కన పెరిగే ఈ మొక్క వేరు నుండి కాయల వరకు అంతులేని ఔషధ గుణాలున్నాయని వివరించారు.
ముళ్ల వంగలోని అద్భుతాలను ఈ వీడియోలో చూడండి https://youtu.be/JqCYDaUOjxI
ఆనందయ్య మందును మీరు కూడా చేసుకోవచ్చు
ఈ ఔషధం ప్రతి ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. ఆ వనమూలికలు ప్రతి ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తాయి. ఆనందయ్య ఔషధం లో వాడిన వన మూలికలు.. పేర్లు వాటి మోతాదు ఇలా ఉన్నాయి. మారేడు ఇగురు 200 గ్రా , తెల్ల జిల్లేడు పూలు 200గ్రా. డావరడంగి ఆకులు 200గ్రా, నల్ల జీలకర్ర 30గ్రా. పట్టా దాల్చిన చెక్క30. నేరేడు ఇగురు 200గ్రా, వేప ఇగురు 200గ్రా, పసుపు 30.గ్రా, ఫిరంగి చెక్క30గ్రా, తేనె200 గ్రా, తాటి బెల్లం200గ్రా, తోక మిరియాలు గ్రా30, పచ్చ కర్పూరంగ్రా30 . పై మూలికలను పూర్తిగా మిక్సీ కి వేసి పేస్ట్ చేసి దానిని ఒక గిన్నెలో వేసి, స్టౌ పైన పెట్టి లేహ్యపు ముద్ద లాగా అయ్యేవరకు ఉడికించాలి.
ఈ ఔషధాన్ని చింతగింజ మోతాదులో కరోనా రోగులే కాక వైరస్ రాని వారు కూడా ఉదయం సాయంత్రం ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా 2 నుంచి మూడు రోజులు మందును తీసుకుంటే కరోనా నుండి బయట పడవచ్చు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ఈ మొక్క, కరోనాను నివారిస్తుందా ? https://youtu.be/Ekxlqf3bNxU
వ్యాధులన్నిటినీ తరిమేసి, ఇమ్యూనిటీని పెంచే తిప్పతీగ https://youtu.be/yD4W–3F2qk