చిత్తూరు జిల్లా , శ్రీకాళహస్తి మండలం, మేలచూరులో క్యాప్చర్ చేసిన దృశ్యం అది.వీరిని ఇర్లోళ్లు అంటారు. సంచార జీవులు. తమిళనాడు,చిత్తూరు సరిహద్దుల్లో ఎక్కువగా ఉంటారు. అడవుల్లో కి వెళ్తే వెనక్కి ఎపుడు వస్తారో వీళ్లకే తెలీదు. తేనె, దుంపలు, చింతపండు సేకరిస్తారు. ఉడుములు, పాములు, ఎలుకలు పట్టడం, పండ్లతోటలకు కాపలాగా ఉండటం వృత్తి. అదంతా దశాబ్దం క్రితం ట్రాజెడీ… ఇప్పుడు సంచార జీవనం నుండి స్దిరమైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ 1500 కుటుంబాలు పండ్ల తోటలకు యజమానులుగా ఎలా మారారో మా రాబోయే డాక్యుమెంటరీలో చూస్తారు.
అదలా ఉండగా…….. ….. …..
చరిత్ర గురించి తెలియకపోవడం వల్లనే ఆదివాసీల పట్ల అధికారులు ఇంత క్రూరంగా ఉన్నారని… రావు రమేష్‌తో ఒక కోర్ట్ సీన్‌లో అంటాడు లాయర్ సూర్య. ‘జై భీమ్’ ని తెలుగులోకి డబ్ చేసిన టీమ్ ఎవరో కానీ ఈ పాయింట్‌ని మిస్ అయ్యారు. చిత్తూరు జిల్లా తూరుపు వైపు ఎక్కువగా కనిపించే ఇరులర్ లనే యానాదులు అంటారు. వీరి మాండలికమంతా చిత్తూరు యాస.
వీరి మధ్య చాలా రోజులు ఉండటం వల్ల వారి యాస ,జీవన శైలి కొంత తెలుసు. సినిమాలో రాజన్న, సిన్నతల్లి మాట్లాడే గోదారి జిల్లా మాండలికం కొంచెం ఇబ్బంది గా అనిపించింది.ఈ విషయంలో డబ్ చేసిన వాళ్ళు కొంత శ్రద్ధ తీసుకుంటే పిక్చర్ మరింత పర్ఫెక్ట్ గా ఉండేది. -shyammohan
………………………………………………………………………………………………….
ఈ మొక్క శేషాచలం, అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. మిద్దె మీద కూడా పెంచు కోవచ్చు దాని వేర్లు నేల లో రెండు మీటర్లు వరకు విస్తరిస్తాయి. అద్భుత మైన ఆదాయం ఇచ్చే ఈ సాగు వివరాలు చూడండి.
బొగ్గునిల్వలుతగ్గడంతోదేశవ్యాప్తంగావిద్యుత్సమస్యలురాబోతున్నాయ నేహెచ్చరికలువింటున్నాము , టీవీల్లోవాదోపవాదాలుచూస్తున్నాము. కానీ వజ్ర కరూర్ అనే ఊరిలో ఒక యు వకుడున్నాడు. ఈ సమస్యకు ఓ మార్గం కని పెట్టాడు. విద్యుత్ మాత్రమే కాదు, స్వచ్ఛ మైన తాగు నీటిని గాలి నుండి తీసి చూపిస్తున్నాడు.. ఆ మ్యాజిక్ మీరు చూస్తారా ? https://youtu.be/pCdRCTBgF3E