సజ్జ రొట్టెలు,గడ్డినువ్వుల పొడి!

లంచ్ సమయం, ఆకలి దంచుట… పస్తాపూర్ ( Jaheerabad ) రోడ్ పక్కన జొన్నపొత్తులు తప్ప వేరే ఆహారం కానరావడం లేదు. ఇంతలో ఈ రొట్టె ల బండి ప్రత్యక్షం అయింది. కూతురు బండిని నడుపుతుంటే, సరళమ్మ సజ్జ రొట్టెలు వత్తుతోంది. పెనం మీద కాలిన రొట్టెలను మాకు వడ్డించింది . దానిలో గడ్డినువ్వుల పొడి వేసింది. మబ్బుల నీడలో మెత్తని రొట్టెలు భుజించుట, ఒక ఆహ్లాద మైన అనుభవం .

‘జర ఈ మసాలా పాల కూర రొట్టెలు కూడా తిని చూడండి… అన్నా ’ అని వాటిలో నిమ్మకాయ కారం పొడి వడ్డించింది. తన పొలం లో పండించిన, చిరు ధాన్యాలు అమ్మగా మిగిలిన వాటిని ఇలా మనకు రుచి చూపిస్తుంది (వీటిని ప్రభుత్వ భాష లో Value added products అంటారు. ) Millet Cave, Millet Marvels లాంటి పేర్ల తో సిటీ లో అందమైన రెస్టారెంట్స్ లో ఈ ఫుడ్ పెట్టి 500 పైనే బిల్ వేస్తారు . ఈ తల్లి ఆరు రొట్టెలతో మా కడుపు నింపి 60 రూపాయలు మాత్రమే తీసుకుంది.

ఈ పనిలో ఆమెకు రోజుకు 300 నుండి, 600 వరకు రావచ్చు . అయినా తృప్తిగా, ఎవరి దయ కోసం ఎదురు చూడ కుండా బతుకుతూ… ( దీనిని పత్రికల భాష లో స్వయం సమృద్ధి అందురు.) మా లాంటి బాట సారులకు ఆరోగ్య ఆహారాన్ని ప్రసాదిస్తోంది. మరి మీరు కూడా టేస్ట్ చేస్తారా ? https://youtu.be/v_s6d6F99JU

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles