అక్కడ విత్తనాలను వింతపరికరంతో విత్తుతారు !

ఇపుడు ఖరీఫ్‌ పంట కాలం ప్రారంభమయ్యే సమయం.

కోవిడ్‌ లాక్‌ డౌన్‌ల వల్ల సమస్త పనులు స్తంభించినప్పటికీ సాగుబడి మాత్రం ఆగదు. మనిషికి అన్నం పెట్టే రైతులు శ్రమిస్తూనే ఉంటారు. దక్షిణ తెలంగాణలో వ్యవసాయపనులు పండుగలా మొదలయ్యాయి. ఇక్కడి  రైతులకు ఇప్పటికీ వారి సాంప్రదాయ జ్ఞానం, వారి స్వంత అంతర్‌ దృష్టితో తిధులు, నక్షత్రాల కదలికలను అనుసరించి పనులు మొదలు పెడతారు. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌ ప్రాంతంలో ఎక్కువ శాతం బీడు భూములు కాబట్టి, రైతులు పంటల కోసం రుతుపవనాలు మీద ఆధారపడుతుంటారు.

 వారికి తొలకరి ఒక పండుగ!

 15 రోజులు పాటు  విత్తనాలు, వనరులు సమకూర్చుకొని, తమ భూమిని సిద్ధం చేసుకుని, తొలకరి చినుకులకు ముందే విత్తడం ప్రారంభిస్తారు. ఈ ప్రాంతపు  ప్రజలు మృగశిర కార్తె తొలి రోజున నేలకు పూజలు చేసి,  చిరుధాన్యాలతో,విభిన్నమైన వంటలు చేసుకొని తొలకరిని ప్రారంభిస్తారు. ఈ సమయంలో ప్రతి కుటుంబం  బెల్లం లో చింతపండుతో చిటికెడు ఇంగువ కలిపి తీసుకుంటారు. దీని వల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గును నివారించవచ్చు అని వారి తరతరాల నమ్మకం.

ఈ వీడియో చూడండి ,
ఈ బ్యాంకు లో రకాల విత్తనాలు ఉన్నాయ్. https://youtu.be/l9rdRNK8ESo

‘‘ అసలు పంట కాలం ఇప్పుడు ప్రారంభమైనప్పటికీ, రోహిణి కార్తె చివరి వారంలోనే మా  భూమిలో కొంత భాగాన్ని విత్తడం పూర్తి చేశాము.దీని వల్ల ఇపుడు మిగతా పనులు చేసుకోవచ్చు. చినుకులు పడిన వెంటనే బీజాలకు తేమ అందుతుంది…’’ అంటారు పస్తాపూర్‌కి చెందిన రైతు మొగిలమ్మ.

విత్తడం ఒక అరదైన సంప్రదాయం

జహీరా బాద్‌కి చెందిన స్నేహ కొప్పుల ప్రకృతిని క్యాప్చర్‌ చేసే అరుదైన ఫొటో గ్రాఫర్‌. జీవవైవిద్యం,పర్యావరణం పై విజువల్‌ అధ్యయనం చేస్తుంటారు. రైతు సంగప్ప సంప్రదాయ పద్ధతిలో  విత్తనాలను భూమిలో విత్తే విధానాలను ఫొటోలు తీశారు.

‘‘ పొలం దున్నుతున్నపుడు, నాగలికి  మూడు  వెదురు కర్రల అమర్చి, వాటి మీద  3 రంధ్రాలున్న గరాటు ఆకారంలోఉండే కొయ్య ముంతలో విత్తనాలు వేస్తుంటే అవిభూమిలోకి జారుతుంటాయి. దీనిని  జడిగం ముంత అంటారు. ఆధునిక సీడర్లు ఎన్ని ఉన్నప్పటికీ ,ఇక్కడి రైతులు దీనినే విత్తడానికి వినియోగిస్తారు. ఇవి వారి  సంప్రదాయ వ్యవసాయ పనిముట్టు. ’’ అని స్నేహ వివరించారు.

ఒక ట్రక్కు ధాన్యాన్ని 10 నిముషాల్లో తిరగెయ్యెచ్చు!! https://youtu.be/3YNPaOb9s2c

తూరుపు కనుమల్లో తొలకరి ఇలా…

వర్షఋతువు ప్రారంభాన్ని కోస్తాంధ్ర  రైతులు ఏరువాక పున్నమిగా జరుపుతారు.  తొలకరి చినుకుల ఆగమనం  ఆనందోత్సాహాల మధ్య రైతన్నలు అరక దున్నటంతో సాగు పనులు మొదలవుతాయి.

ఏరు అంటే దున్నడానికి సిద్ధంగా ఉన్న నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. అంటే సాగుబడి ప్రారంభించడం. సాంప్రదాయికంగా అన్ని ప్రాంతాల వారు ఏరువాక పున్నమిని సందడిగా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి , అలంకరించి, వాటికి పొంగలి పెడుతారు. తరువాత  రైతులందరూ వాటిని తోలుకుని పొలాలోకి వెళ్లి దున్నుతారు. అదే సమయంలో, ఆడపడుచులు పుట్టింటికి వస్తారు.

ఒక్క రూపాయి ఖర్చు తో కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు తీసుకోవచ్చు …https://youtu.be/lKBUiaYMcmE

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా ,పార్వతీపురం మన్యంలో  భగత, కొండదొర, వాల్మీకి, కొటియ, నూకదొర, గదబ, కోందు తెగల గిరిజనులు నివశిస్తున్నారు. తెలుగు, ఒడియ, సవర భాషలను మాట్లాడతారు.వీరు జరుపుకునే పండుగలు అన్నీ తొలకరి నుండే మొదలవుతాయి. వారు పండించే సంప్రదాయ పంటలకు, ప్రకృతికి పరిమితమవుతాయి. మృగశిర కార్తె ప్రారంభంలో కొర్రకొత్త, జొడ్ల పండుగ జరుపుతారు. తరువాత నంది పండుగ, బారిజం వంటి పండుగలు వీరి ప్రత్యేకం. వీరు పాలిష్‌ రైస్‌ కాకుండా , దంపుడు బియ్యం మాత్రమే తింటారు. ఏ పని చేసినా వేపాకులను నలిపి చేతులను శుభ్రం చేసుకుంటారు. అదే వారికి సానిటైజర్‌.

( Photo credit / Sneha Koppula)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles