వారంతా నిరుపేద మహిళలు… రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కోవిడ్ లాక్ డౌన్ వారి ఆర్ధిక పరిస్ధితులను మరింత కుదేలు చేసింది. అయినా వారెక్కడా వెనకడుగు వేయలేదు. తమకు తెలిసిన పనిలో నైపుణ్యం సాధిస్తే అదే ఉపాధి చూపుతుందని నమ్మారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది, బైరిసన్స్ సంస్ధ.
రైతుల దగ్గర నుండి నేరుగా ఉత్పత్తులను కొంటున్నారు. వాటిని బ్రాండిరగ్ చేసి తక్కువ ధరకు వినియోగ దారులకు చేరుస్తున్నారు. ఇలా సామాన్య మహిళలు వ్యాపార వేత్తలుగా మారుతన్నారు. ఎలాగో చూడండి… https://youtu.be/pmbaYRlve-Y