దారాల మీదే డిజైన్ వేసి, ఆ తర్వాత మగ్గం మీద నెయ్యడం ఇక్కత్ ప్రత్యేకత.
ఇందులో ఆర్టూ, క్రాఫ్టూ రెండూ ఉన్నాయి. అందుకే దీనికి మార్కెట్లో అద్భుత డిమాండ్ .
ఇక్కత్ అద్దకం వల్ల రోజుకు 400రూపాయల నుండి, 6వందల రూపాయల వరకు ఆదాయం పొందుతున్న వారి సక్సెస్ స్టోరీ చూడండి…
తెలంగాణ గడ్డ చేనేతకు పెట్టిందిపేరు. రైతన్న తర్వాతి స్థానం నేతన్నదే. అయితే చేనేత గిట్టుబాటు కాకపోవడంతో చాలామంది నేతన్నలు
బతుకు తెరువు కోసం వలస బాట పట్టారు.
నాబార్డు సాయంతో జీసస్ వెల్ఫేర్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ
చేనేత మహిళలకు ఇక్కత్ నేతలో శిక్షణ ఇచ్చారు.
ఫ్యాషన్ ప్రపంచం ఇవాళ పాత కొత్తల మేలు కలయికగా రూపొందుతోంది. పోచంపల్లి డిజైన్‌గా పాపులర్ అయిన ఇక్కత్ వైపు దేశమంతా చూస్తోంది.
చేనేతలో ప్రత్యేకమైన శైలి ఇక్కత్. ఈ నేతలో నైపుణ్యాలను మెరుగుపర్చి జీవనోపాధి అవకాశాలు పెంచడానికి నాబార్డు తొలిసారిగా నల్గొండ జిల్లాలో శిక్షణ ఇచ్చింది.
ఇక్కత్ డిజైనింగ్‌కు నేడు ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
దాంతో మార్కెట్లో మంచి గిరాకీ పెరిగింది.
ఈ నేతలో స్త్రీల సామర్థ్యం, నైపుణ్యం పెంచారు.