మీకు ఉపాధి కావాలా? ఇది చదవండి!

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ వాళ్ళు , బండ్లగూడ సెంటర్, హైదరాబాద్  లో , 18 నుండి 33 సంవత్సరాలలోపు యువకులకు ( SSC లేదా  Inter అర్హత ) స్వయం ఉపాధి కలిపించుకోవడానికి కొన్ని అవకాశాలు కల్పిస్తుంది . 
ఎలెక్ట్రికల్  హౌస్ వైరింగ్, ల్యాండ్ సర్వే రంగాల్లో నేర్పు కోసం  మూడు నెలలు ఉచిత శిక్షణ ఇస్తుంది . ఈ మూడు నెలల పాటు ఉచిత భోజనం ,ఉచిత వసతి కూడా కల్పిస్తుంది . 
 తెలిసిన ఎన్నో గ్రామాల నుండి , ముఖ్యoగా ఉత్తర తెలంగాణా నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు . అందులో ఎన్నో మోసాలకు గురై ఇబ్బందులు పడ్డవాళ్లూ ఉన్నారు . జీతాలు సరిగ్గా లేక అప్పులపాలైన వారూ ఉన్నారు . 
అక్కడిదాకా వెళ్లి ఇబ్బందులు పడేకంటే , ఇక్కడే స్వయం ఉపాధి రంగాల్లో నేర్పును సాధిస్తే , విస్తరిస్తున్న హైదరాబాద్ , ఇతర జిల్లా పట్టణాల్లో కూడా  చాలా అవకాశాలు ఉన్నాయి .  Confidence తో పనిచేస్తే , గల్ఫ్ దేశాల కంటే ఇక్కడే మంచి సంపాదనను పొందవచ్చు . ఇది ప్రాక్టికల్ గా కొంత మందిని గమనించి , ఇంటర్వ్యూ చేసిన తరువాత నాకు కలిగిన అనుభవం . ఒక ప్లంబర్ , ఒక హౌస్ పెయింటర్ , హౌజ్ వైరింగ్ పర్సన్ , ల్యాండ్ సర్వ్ పర్సన్ , AC రిపేర్ పర్సన్ ఇలా ఒక్కొక్కరు తమ తమ ఫీల్డ్స్ లో – నేర్పును సాధించి నెలకు కనీసం 25 వేల నుండి – 60 వేల వరకు సంపాదిస్తున్నారు . కొంత మంది లక్ష వరకు సంపాదిస్తున్నారు . ఇంకొంత మందికి కూడా ఉపాధిని కల్పిస్తున్నారు . 
దీనికి కావాల్సింది : నామోషీ పడనీ తత్త్వం , కష్టపడే గుణం , అవకాశాలను కల్పించుకోడానికి తీసుకునే చొరవ , అన్నిటికి మించి ఆత్మవిశ్వాసం.
ఈ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ నిజలింగప్ప గారితో,  ఈ రోజు ఉదయం మాట్లాడితే – ” మీకు తెలిసిన యువకుల్ని పంపించండి . ఆసక్తి ఉంటె, ఈ నోటిఫికేషన్ లో లేకున్నా,  ఉపాధికి అవకాశం ఉన్న ఇంకొన్ని  రంగాల్లో (ప్లంబింగ్ , పెయింటింగ్ )  కూడా శిక్షణను ఇద్దాము ” అన్నారు . 
మొదట్లో వాళ్ళే శిక్షణ ఇచ్చి , ప్రాక్టికల్ అనుభవం కోసం కంపెనీల్లో జాబ్ అవకాశాలు కల్పిస్తారు . 
ఈ మెసేజ్ ను అవసరమున్న వారికి చేరవేయండి . అవకాశాల కోసం చూస్తున్న వారిని ప్రోత్సహించండి . 
అకాడమీని కాంటాక్ట్ చేయాల్సిన నంబర్స్ :9440410459, 9492489330 ( నిజలింగప్ప)
report-Ganga Reddy A

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles