సాగునీరు లేని చోట, వానచినుకులకు మాత్రమే పంటలు పండే నేలలో ఫారంపాండ్ ఉండాల్సిందే. ఆంధ్రా,కర్నాటకలో వందలాది ఎకరాలు ఈ పంటకుంటల వల్లనే సాగు చేయడం మేం చూశాం. అదెలా తవ్వుకోవాలని చాలామంది రైతు మిత్రులు అడుగుతుంటారు. కొన్నిపద్దతులు,కొలతలు ఉంటాయి. మీ జిల్లా డ్వామా అధికారులను కలిస్తే, ఉపాధి హామీ పథకంలో ఉచితంగా తవ్విస్తారు.
అలాంటిదే ఇక్కడున్న ఫొటో. చిత్రదుర్గ నుండి ఓ మిత్రుడు పంపారు. వర్షాలకు ఈ కుంటలు నిండితే, సీన్ ఎలా ఉంటుందో https://youtu.be/qmcYfu7JQeY ఈ వీడియో చూడండి!!
………………………………………………………………………….
కొబ్బరి దింపు.. ఉండదిక జంకు
కొబ్బరి చెట్టు నుంచి కాయల్ని కోసి దించడం లో రైతులు పడే వెతలు ఎన్నో. దింపు సమయంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చే వారు తగ్గి పోతున్నారు. దీనివల్ల రైతులకు కొబ్బరి దింపు తలకు మించిన భారంగా మారింది.. ఇక పై ఆ సమస్యలు ఉండవు. జస్ట్ చిన్న బటన్ నొక్కి చెట్టు మీదకు చేరుకోవచ్చు. తాడి,కొబ్బరి చెట్లు ఏవైనా సులువుగా, సురక్షితం గా ఎక్కి దిగ వచ్చు . https://youtu.be/urRkOIIXdyY చూద్దాం రండి. Strapped comfortably with a back-support and safety harness, in less than 30 seconds, a farmer scaled an coco nut tree as high as 30 metres. Have a look https://youtu.be/urRkOIIXdyY
…………………………………………………………….
నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. దేశమంతా లాక్డౌన్లో ఉన్నా… గుప్పెడు గింజలు ఎక్కువ పండించిన రైతులు వీరు, కొండవాలు లో నీటి చెలమల్ని తవ్విన సాహసం ఇది… మన్నుల నుండి అన్నం తీసెటి మహిమ లివి… భూమి ఆకాశాలను సాగు చేస్తున్న మట్టి మనుషుల దృశ్య సాక్ష్యం https://youtu.be/o0t2Sc699HI ఈ వీడియో…