TV-9మహిళాజర్నలిస్ట్ పై ఇంత దారుణ మైన ట్రోలింగా ?|Huge Trolling Started on Anchor Devi

ట్రోలింగ్ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి. రోజూ పత్రికల్లో ఎన్ని తప్పులు దొర్లడం లేదు?

 Devi పొరపాటు చేయలేదని కాదు…ఇంత ట్రోలింగ్ అవసరమా…  సమాజం లో వేరే ఏ సమస్యలు లేవా?

ఈ మహిళా జర్నలిస్టు ను ట్రోలింగ్ చేయడం పట్ల ఒక విభిన్న స్పందన

 సీనియర్ జర్నలిస్ట్ నాంచారయ్య గారి నుండి వచ్చింది.

………………………………………

నాంచారయ్య గారి కామెంట్ పై   FaceBook ( ShyamMohan Timeline )

లో 75  మంది స్పందించారు. వాటిలో కొన్ని.. 

1, Raghuramulu Thummalapally-

nenu nancharayya tho purthiga ekibhavistunnanu. ila vedhinchadam manchi padhati kadu.

2, Mana Vijethalu-

Correct, ఒక్కోసారి ప్రతి ఒక్కరికి,తప్పులు దొర్లుతాయి, సహజం.

3, Malleswari Varanasi-

భాష నేర్చుకోవడానికి కవుల, సెలబ్రిటీల చుట్టాలం కానక్కర్లేదు…..మీడియా లో పనిచేస్తున్నప్పుడు కొంచెం భాషపై పట్టు ఉంటే చాలు… తెలియనప్పుడు తెలుసుకోవడమే… జర్నలిస్టు నిత్య విద్యార్థి.

4, Shankr Skhanna-

అది యాంకర్ తప్పు కాదు.. న్యూస్ ఎడిటర్..లేదా న్యూస్ ప్రిపేర్ చేసిన ఇంచార్జ్ ది..వాళ్ళు ఇచ్చే స్క్రోలింగ్ చదవటమే ఆమె చేసేది.. అయినా టీవీ 9 లో మేనేజ్ మెంట్ మారాక న్యూస్ గాసిప్..గాలి పోగు చేస్తున్నారు.. అని పిస్తోంది.నిజం..ఏదో చెప్పాలని ఎదో చెపుతున్నారు.వార్తను వార్తగా ఇవ్వడం లేదు.దానికి హంగులు రంగులు అద్దుతున్నారు. ప్రాసకోస పాకులాడుతూ.. పదాలతో..పదనిసలు పలికిస్తున్నారు.బాలేదు.. అస్సలు బాలేదు…ఇన్పుట్ ఎడిటర్ గారు..న్యూస్ అవుట్ ఫుట్ బాగా బాగా మార్చాలి..

5, Manjarlapati Kamal-

ఇలాంటి తప్పు ఎవరైనా చేస్తే… ఆ దేవినాగవల్లి గారు ఆ టీవీ9 వారు చేసే రచ్చ మామూలుగా ఉంటుందా చెప్పండి? దేన్నయినా న్యూస్ గా న్యూసెన్స్ గా చేయగలిగిన వాళ్ళు తగుజాగ్రత్తలో ఉండాలి కదండీ.

6, Prasad Charasala

నిజానికి ఈ వెక్కిరింతలు ఒక దేవి గురించి కాదు, మొత్తం మీడియాకు పట్టిన గతి మీద!

7, Sujatha Velpuri-

With due respects to Nancharayya garu, ఒక ప్రముఖ టీవీ చానెల్ లో ప్రైమ్ టైమ్ న్యూసు రీడర్ గా ఉన్న ఆమెకు రుధిరం అంటే ఏమిటో తెలియక పోవటం excusable అవుతుందా?

చాలా బేసిక్ పదం కదా? అది తెలియడానికి ఆమె మహా మహా సాహితీ వేత్రల మనవరాలు కావాలా? తప్పులు లేకుండా చదివే వాళ్లంతా సాహితీ వేత్తల చుట్టాలా చెప్పండి?

స్క్రిప్టు ఎవరో రాసి ఉండచ్చు, కానీ చదివిన ఆమె కి అది పొరపాటు అని తెలియాలి కదా సర్?

సోషల్ మీడియా లో సరదా ట్రెండింగ్ లకు ఉద్యోగాలు తీసేసే నిర్ణయాలు చానెల్స్ తీసుకోవేమో

ఒక సీనియర్ న్యూస్ ఎడిటర్ ఆటో స్పై అని చదివారు. అటాప్సీ ని అదే చానెల్ లో మీడియా లో ఉన్న వాళ్లు తప్పులు రాసేసి , చదివేసి చూసీ చూడనట్టు పొమ్మంటే ఎలా? భాష పట్ల మీడియా కి సామాన్యుల కంటే బాధ్యత ఎక్కువ ఉండాలి.

8, Siva Racharla-

Sujatha Velpuri garu, నాంచారయ్య గారితో కాసేపు ఏకీభవిద్దాం అనుకున్నా వివిధ సందర్భాలలో వీళ్ళు చేసిన ట్రోలింగ్,దాడి చిన్నది కాదు .. వీల్లబారిన పడి నష్టపోయిన వాళ్ళు కోకొల్లలు.

9, Nagavardhan Rayala-

అది ఒక్కరి తప్పు కాదు. ఆ వ్యవస్థలో ఉండే చాలా మంది చేసిన తప్పు. ఉన్నత హోదాలో ఉన్న ముగ్గురు, లేదా నలుగురికి రుధిరం అర్థం వేరు ఇక్కడేందుకు తప్పుగా వాడారని పట్టుకోలేకపోయారు.

10, Mana Vijethalu-

బహుశా , తెలుగు న్యూస్ చానళ్ళ మీద ప్రజలకు కలుగుతున్న ఏవగింపు, ఇలాంటి సమయాల్లో ట్రో లింగ్స్ రూపంలో బయటికి వస్తుందేమో నిపిస్తుంది.

11, Seshu Babu-

తెలుగు అనేది తల్లిభాష.. అది నేర్చుకోవడానికి ఎక్కడో పుట్టాల్సిన అవసరం లేదు.. ఇంకా చెప్పాలంటే శుద్ధగ్రామ్య భాష వాడేవవారు కూడా పదాన్ని కచ్చితంగా ఉపయోగిస్తారు…

ఇది రాసినవారు ఒక సామాజిక వర్గం మీద వ్యక్తిగత ద్వేషంతో రాసినట్లు అనిపిస్తోంది…

జాషువా గారు వీరన్న జాబితాలో లేరు.. కానీ ఆయన సాహిత్యం ఎప్పటికీ గుబాళిస్తుంటుంది…

పదప్రయోగాన్ని సాహిత్యానుభవం లేని గ్రామీణులు కూడా అద్భుతంగా చేస్తారు.. సదరు వ్యక్తికి తెలియకపోతే ఒక్కసారి తెలుగురాష్ట్రాల్లోని పల్లెటూళ్లను తిరమనండి…

రుధిరం పక్కనపెడితే.. కనీసం అది ఊడిపడడం ఏంది.. విచిత్రం కాకపోతే..

అయ్యా మీరేమీ చింతించకండి.. ఆమె ఉద్యోగానికి వచ్చిన ఢోకా లేదు..

మీడియాలో పనిచేసే యాకంర్లలో 90 శాతం ఇలాంటివారే..

చివరగా ఒక్కమాట ఇది ఆమె రాసింది కాదు.. ఎవరో ఒక కనీస భాషా పరిజ్ఞానం లేని సబ్ ఎడిటర్ లేదా సీనియర్ జర్నలిస్ట్ అయివుంటాడు.. ఇలాంటి మినిమం నాలెడ్జ్ లేని వాళ్లకు కాస్త ట్రైనింగ్ ఇప్పించి పుణ్యం కట్టుకోవాలి..

12, Subrahmanyam Kvs-

తప్పు యాంకర్ ది కాదు. స్క్రిప్ట్ రైటర్ ది. యాంకర్ ఉద్యోగం పోదనీ, నాంచారయ్య గారిని ఆందోళన చెందవద్దనీ చెప్పండి

13, Rama Krishna Rao

టీవీల్లో ఇంకా చాలా ఘోరాలే జరుగుతున్నాయి. ఎవరి ఉద్యోగాలు పోవటం లేదు. దేవి మంచి యాంకర్. సోషల్ ఇస్స్యూస్ లో ఆమె ప్రశ్నలు ప్రజల తరఫున వేస్తుంటారు. చిన్న పొరపాటు ఏదో జరిగింది. FB లో ఇది మామూలే. లైట్ తీసుకోండి.

14, Aruna Gogulamanda

అది పొరపాటు ఎలా ఔతుందండీ? ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియనంత సోయి లేదనుకోవాలా?

15, Raj Delhi-

వార్తలను ఎక్కడికో తీసుకెళ్లాలనే ప్రయత్నం లో ఆమె కాస్త తొందరతో ఇలాంటి పద ప్రయోగాలు చేస్తోంది సార్…మొదటి సారి నవ్వి మర్చిపోయిన జనాలకు రెండోసారి అదే సిట్యుయేషన్ రిపీట్ కావడంతో ట్రోలింగ్ కి కారణం అయింది… అంతే సార్…

16, Anand Pedduri –

TV9లో జరిగే ట్రోల్లింగ్ తొ పోలిస్తే ఇది చాలా చిన్న విషయం, వాళ్లకేదైనా న్యూస్ దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు చేస్తారు కదా…

17, Anil Dani-

పోనీ లేండి ఆవిడ ఏమి పండిత కుటుంబం నుంచి రాలేదు సరే. ఆవిడ పని గట్టుకుని ట్రోల్ చేసిన సందర్భాలు ఎన్ని..? వాళ్ల చానల్ వల్ల ఎంతో మంది ట్రోల్ కాబడ్డారు. వాళ్లంతా ప్రాణాలు తీసుకోలేదు కదా.ఈ మాత్రం దానికే ఆమె ఉద్యోగం ఏమి పోదు సార్. ఈమెకన్న ఓవర్ అతి చేసిన వాళ్ళున్నారు టీవీ 9 లో. ఈమె ఇలా చేయడం ఈ రోజు కొత్త కాదు.

18, Shyam Mohan-

Aruna Gogulamanda గారితో సహా విమర్శిస్తున్న మిత్రులందరికీ…

రుధిరం ఒక్కటే కాదు , దేవి చేసిన పాపాలు చాలా ఉన్నాయి. మహిళల ను ప్రతి ఫ్రేమ్ లో గౌరవిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం నింపే గొప్ప సామాజిక, అభ్యుదయ చిత్రం ‘ఆర్జున్‌ రెడ్డి’ హీరో ని, జబర్దస్త్‌ టీవీ షో ద్వారా అశ్లీలత లేని ఆరోగ్యవంతమైన హాస్యాన్నిఇంటింటికీ పంచుతున్న హైపర్‌ ఆది వంటి సామాజిక బాధ్యత ఉన్న కమెడియన్‌ని కూడా ఆమె సోయిలేని ప్రశ్నలతో, అజ్ణానంతో ఇబ్బంది పెట్టి, అవమానించింది. ఆ వీడియోలను కూడా ట్రోల్‌ చేయమని మనవి!

19, Shyam Mohan-

ఛానల్ మీద కోపాన్ని మహిళా జర్నలిస్ట్ మీద చూపుతున్న మిత్రులకు ,

Tv9 మెరుగైన సమాజం కోసమా, కాదా అన్నది పక్కన పెడితే..

వార్తల ప్రజెంటేషన్, ప్రసారం చేసే తీరు , యాంకరింగ్ లో జర్నలిస్టులకు అక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆ క్రమం లో రుధిరం లాంటివి జరగొచ్చు. ఇప్పటికీ ఎన్నో చానెల్స్ ఉన్నప్పటికీ వాటికి భిన్నం గా రూపం, సారంలో టివి 9 ఒక బ్రాండ్ సృష్టించింది . ఆ బ్రాండ్ తర్వాత మరొకటి ఎందుకు రాలేదు ? కొన్ని వేల మంది ఉపాధి తో ముడి వడి ఉన్న సక్సెస్ అది . కాలం తో పాటు అప్ డేట్ అవు తున్న Tv9 నుండి ఇతర ఛానల్స్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోవడం తెలుగు టీవీ జర్నలిజం లో ఒక పెద్ద ట్రాజెడీ.

20, Bp Padala-

Shyam Mohan Garu : the contempt , the pent up frustration and vengeance for tv 9 blown over poor girl . Devi is just a collateral damage.

…………………………………………………………………………….

Honey Bee man in Andhra

తేనే టీగలు కుట్టవు, మనుషులంత ప్రమాదకరమైనవి అసలే కాదు అంటున్నాడు, మన్యంలో తిరుగుతున్న ఈ అరుదైన మానవుడు.వాటిని కాపాడుకోక పోతే, భవిష్యత్‌లో మనకు ఫుడ్‌ దొరకదు బిడ్డా ! అని సున్నితంగా హెచ్చరిస్తున్నాడు. చినుకుల మధ్య చిట్టడివిలో తేనెటీగలతో సావాసం చేస్తున్న అతడితో మీరు కరచాలనం చేస్తారా…?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles