నీటి వనరుల సంరక్షణలో శ్రీసిటీకి సిఐఐ అవార్డులు

నీటి వనరుల సంరక్షణనిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందుకు 

శ్రీసిటీకి సిఐఐ అవార్డులు   

మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు శ్రీసిటీని వరించాయి. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందుకు, సిఐఐ (భారత పారిశ్రామిక సమాఖ్య) రెండు ప్రతిష్టాత్మక అవార్డులను బహూకరించటానికి శ్రీసిటీని ఎంపిక చేసింది. శ్రీసిటీ చేపడుతున్న నీటి సుస్థిరత, అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఈ ఏడాది ఆగస్టు 28 న  సిఐఐ నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. 

దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇది నిజంగా తాము గర్వించదగ్గ గుర్తింపుగా వ్యాఖ్యానించారు. సిఐఐ గుర్తింపు పర్యావరణ సుస్థిరతలో తమ 

నిబద్ధతను చాటుతుందన్నారు. 

బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా, శ్రీసిటీ నీటి వనరులను సంరక్షించడానికి, నీటి నిల్వలు పెంచడానికి కట్టుబడి ఉందన్నారు. ఈ గుర్తింపు ఖచ్చితంగా తమ సిబ్బందికి మరింత ప్రోత్సహాన్ని ఇవ్వడంతో పాటు వారి భవిష్యత్ ప్రయత్నాలకు మంచి ప్రేరణ ఇస్తుందన్నారు. 

నూతన ఆవిష్కరణలు, ఉత్తమ నిర్వహణ, సీఎస్సార్ చర్యల ద్వారా నీటి సంపదను పెంచే చర్యలకు గాను అందచేసే సిఐఐ అవార్డులు దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి. పలు విభాగాలలో ఉత్తమ పద్ధతులను పాటించే  కంపెనీలను ఎంపిక చేసి  ఈ అవార్డును సిఐఐ బహూకరిస్తుంది.  పరిశ్రమలలో అత్యుత్తమ నీటి నిర్వహణ పద్ధుతులను గుర్తించడం, ఈ సమాచారాన్ని ఇతర కంపెనీల వారితో పంచుకోవడం ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ స్థాయి విధానాలను అనుసరించి  అవార్డు గ్రహీతల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles