ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు (EOU) కోసం విశాఖపట్నంలో సెప్టెంబర్ 24, 2021 జరిగిన కేంద్ర ప్రభుత్వ ఎగుమతి ప్రోత్సాహక మండలి (EPCES) అవార్డుల కార్యక్రమంలో విశాఖపట్నం సెజ్, శ్రీసిటీ సెజ్ లకు ‘డెవలపర్స్ స్పెషల్ అచీవ్‌మెంట్’ అవార్డు, మరో ఐదు పరిశ్రమలకు ఎగుమతి ప్రోత్సాహక మండలి అవార్డులు లభించాయి. ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి అందించిన విశేష కృషికి గాను సెజ్ కేటగిరీ కింద 2020-2021 కి శ్రీసిటీ సెజ్‌కు ‘డెవలపర్స్ స్పెషల్ అచీవ్‌మెంట్’ అవార్డును కేంద్ర వాణిజ్య కార్యదర్శి డాక్టర్ బివిఆర్ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా శ్రీసిటీ ఫౌండేషన్ అధ్యక్షుడు రమేష్ సుబ్రమణ్యం అందుకున్నారు. శ్రీసిటీ సెజ్ లో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు సిద్ధార్థ లాజిస్టిక్స్, మింమ్ కో డీీఫ్ఎస్ ఇంండియా,. ఎవర్టన్ టీ, స్టోరిట్ సర్వీసెస్, వైటల్ పేపర్ ప్రొడక్ట్స్ అత్యధిక ఎగుమతిదారు అవార్డులను గెలుచుకోగా, సంబంధిత ఎండీలు వాటిని అందుకున
అవార్డు గ్రహీతలను ఉద్దేశించి వాణిజ్య కార్యదర్శి మాట్లాడుతూ, సెజ్ డెవలపర్లు, పరిశ్రమలు తమ వృద్ధిని ప్రపంచ దేశాలతో పోల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశీయ మార్కెట్లలో విక్రయాల కోసం కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం కొన్ని రాయతీలు, సౌకర్యాలు సెజ్జు లో పనిచేస్తున్న పరిశ్రమలకు కల్పిస్తోందన్నారు. VSEZ డెవలప్మెంట్ కమిషనర్ ARM రెడ్డి మాట్లాడుతూ, గత మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరాలలో విశాఖ, శ్రీసిటీ సెజ్ పరిశ్రమల ఎగుమతుల వివరాలను తెలియచేశారు.
‘డెవలపర్స్ స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డు’ సాధించినందుకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో మా నిబద్ధతకు దక్కిన గౌరవంగా దీనిని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఉత్తమ ఎగుమతుల అవార్డులు సాధించిన శ్రీసిటీ సెజ్‌లోని ఐదు యూనిట్ల ఎండీలను అభినందిస్తూ, మొత్తంగా శ్రీసిటీ సెజ్ లో ఎగుమతుల పనితీరు ప్రశంసనీయం అన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దేశంలో టాప్ 50 ఐటీయేతర సెజ్‌లలో ఇది 3 వ అతిపెద్ద సెజ్‌గా అవతరించిందని, మొత్తం టర్నోవర్ రూ. 38,355 కోట్లుగా పేర్కొన్నారు. జూలై 2021 వరకు 18,000 కోట్ల రూపాయల వస్తువులు మరియు సేవల ఎగుమతిని సాధించగా, 2020-21 సంవత్సరానికి సరుకుల మరియు సేవల ఎగుమతి రూ .5,211 కోట్లుగా తెలిపారు. 2019-20 ఎగుమతుల విలువ 4,101 కోట్లు కాగా, కరోనా పరిస్థితులోను 2020-21 లో 27 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు.