శుక్రవారం( సెప్టెంబర్ 24, 2021) శ్రీసిటీలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు, పర్యావరణవేత్తలు పలువురు శ్రీసిటీ అనుసరిస్తున్న పర్యావరణ హిత విధానాలపై సానుకూలంగా స్పందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో మల్లవారిపాలెం వెస్ట్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రాంతీయ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ నరేంద్ర, శ్రీసిటీ డైరెక్టర్ ముకుందరెడ్డి, డీఎస్పీ జగదీష్ నాయక్, సత్యవేడు తహసిల్దార్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఇరుగులం, కొల్లడం, పెద్దఈటిపాకం, తొండూరు గ్రామాలలో 2202 ఎకరాలలో రెండవ దశ శ్రీసిటీ సెజ్ అభివృద్ధి ప్రతిపాదన మేరకు పర్యావరణ ప్రజాభిప్రాయం కోరుతున్నామని, కాలుష్యం సమస్యలు పట్ల ఏదైనా అనుమానాలు ఉంటే ఎలాంటి భయాలు లేకుండా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
దీనిపై స్పందించిన పలువురు స్థానికులు, గత పదేళ్లలో ఊహించని ఆభివృద్ధిని ఈ ప్రాంతం పొందిందని చెబుతూ, దాదాపు 200 పరిశ్రమలు ఉన్నప్పటికీ శ్రీసిటీ అనుసరిస్తున్న పర్యావరణ హిత కార్యక్రమాల వలన ఏ విధమైనటువంటి హాని జరుగలేదని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉపాధికి ఏమాత్రం అవకాశం లేని సత్యవేడు ప్రాంతం వలసలకు కేంద్రంగా ఉండేదని చెబుతూ, శ్రీసిటీ రాకతో స్థానికంగా వేలాది ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. గతంలో వ్యవసాయ కూలీలుగా పనిచేసిన తాము శ్రీసిటీ చేయూతతో పరిశ్రమలకు అవసరమైన పనులను నేర్చుకుని ఉద్యోగస్తులుగా స్థిర పడ్డామని తెలిపారు. శ్రీసిటీ చొరవతో ఈ ప్రాంతంలో మెరుగైన విద్య, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆర్థికాభివృద్ధిలో స్త్రీల ప్రాధాన్యత పెరిగిందన్నారు. శ్రీసిటీ ఏర్పాటు సమయంలో తామంతా పలు అపోహలతో తీవ్రంగా వ్యతిరేకించటం జరిగిందని, గత పదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధిని చూసి తమ అభిప్రాయం మార్చుకున్నామని చెప్పారు.

వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ సెజ్ కు వ్యతిరేకంగా పార్టీపరంగా గతంలో పలు పోరాటాలు చేశామని, అయితే ఇప్పుడు స్థానికులకు అందుతున్న ఉపాధి అవకాశాల దృష్ట్యా తాము శ్రీసిటీ రెండవ దశ అభివృద్ధిని స్వాగతిస్తున్నామని అన్నారు. ఉపాధి అవకాశాలతో పాటు గ్రామాలలో శ్రీసిటీ అందిస్తున్న విద్యా వైద్య సదుపాయాలు, సేవలు ప్రశంసనీయమన్నారు. రెండవ దశలోనూ పేదలకు మేలు జరిగేలా శ్రీసిటీ కృషి చేయాలని సూచించారు. సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ పర్యావరణానికి విఘాతం కలిగించని పరిశ్రమలకు కేంద్రంగా విస్తరిస్తున్న శ్రీసిటీ పారిశ్రామిక నగరం యొక్క రెండవ దశ అభివృద్ధికి ఏ విధమైన షరతులు లేకుండా అవసరమైన పర్యావరణ అనుమతులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఈ తరహా పలు సమావేశాలకు హాజరయ్యామని, ఈ రకమైన సానుకూల స్పందన చూడలేదన్నారు. ఎస్వీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, తాము గతంలో శ్రీసిటీ పరిసర గ్రామాల ఆర్థిక సామాజిక స్థితిగతులపై సర్వే నిర్వహించామని చెబుతూ, శ్రీసిటీ రాకతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు.
కార్యక్రమం ముగింపులో శ్రీసిటీ డైరెక్టర్ ముకుందరెడ్డి మాట్లాడుతూ, స్థానికులు, ఇతర ప్రముఖులు సూచించిన విషయాలను పరిగణన లోకి తీసుకొని రెండవ దశలో అవసరమైన అన్ని జాగర్తలూ తీసుకుంటామని అన్నారు……………………………………………………………………………………
సిక్కిం… ఓ చిన్నరాష్ట్రం..కానీ , మన దేశంలో మొత్తం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం అదొక్కటే… ఆంధ్రప్రదేశ్ లో…పార్వతి పురం మన్యం లో వంద గ్రామాల్లో ప్రక్రుతి పంటలు పండిస్తున్నారు అదొక స్ఫూర్తి . ఇప్పుడు తెలంగాణ ,సిద్ధిపేట జిల్లాలో జక్కుల తిరుపతి సేంద్రియ పంటలు పండిస్తూ, ఊరందరినీ అదే బాట లో నడిపిస్తున్నాడు . ,తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు ఎలా పొందాలో RuralMedia కు చెప్పాడు, వినండి…https://youtu.be/CedHJpTwqhc మీరు ఆచరించండి.
ప్రముఖ ఐటీ కంపెనీ సయంట్ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ 2021 కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యారంగంలో ఒక అరుదైన విప్లవం చూస్తున్నాను అన్నారు.. వినండి https://youtu.be/BPCfZIClPvk