పీడకల ( Gangadhara Tilak Katnam ) నాకు ఎనిమిది సంవత్సరాల వయసు నుండి పది సంవత్సరాల వయసులో ఒక పీడకల వచ్చేది . కలలో ఉండగానే జ్వరం కూడా వచ్చేది .మెలకువ వచ్చేసరికి చుట్టూ చాలామంది ఉండేవారు .మా ఊరి సూర్యనారాయణ డాక్టరుగారు అక్కడ ఉండేవారు అందరూ ఏమి కల వచ్చింది అని అడిగేవారు .ఆ కల చెప్పటం ఇష్టం ఉండేది కాదు .మర్చిపోయేను అని చెప్పేవాడిని .ఆ రెండు సంవత్సరాలలో ఆ కల నాకు చాలా సార్లు వచ్చేది .ఆ కల ఏమిటంటే :మాకు చాలా చోట్ల పొలాలు ఉండేవి .రెండు పొలాల్లో నూతిలోనుండి నీరు తోడటానికి డీసెల్ ఇంజన్లు ఉండేవి .ఒక పొలంలో నూతిలో నీరు చాలా లోతులో ఉండేవి .డీజిల్ ఇంజను నుతికి సగం లోతులో ఒక స్టేజి మీద ఉండేది .ఒకరోజు దానికి రిపేరు వచ్చింది . దానికి త్రాడులు కట్టి పైకి తెస్తున్నారు .తాటి దూలాలతో ఉన్న స్టేజి అమాంతంగా కూలిపోయింది .దానితోపాటు అందరూ నూతిలో పడిపోయేరు .పిల్లలం అంటే నేను, మాపెద తమ్ముడు ,( మాపెదనాన్న గారి అబ్బాయి )కజిన్ .నుయ్యి దగ్గరకు పోయి వారికోసం ముందుకు వంగి నూతిలోకి చేస్తుంటే పట్టు తప్పిపోయి నేనుకూడా నూతిలో పడిపోయేను.పై నుండి ఎదో అందరిమీద పడి అందరం చచ్చిపోయాము .
మాఇంటిలో అన్నం వండుకోవటానికి బియ్యంలేక అందరూ ఏడుస్తున్నారు . కలలో జరిగిన ప్రమాదంలో మా తాత, చిన్నాన్న , పెదనాన్న,మామయ్య అందరూ చనిపోయారు .ఆ కలలో ఉండగానే జ్వరం వచ్చేసేది ..ఇంటికి ఆధారమైన వ్యక్తి చనిపోతే వారు అందరూ అనాధలైపోతారు అనే భయం వెంటాడుతు ఉండేది . ఒకరోజు నా క్లాస్మేట్ నాన్న మా ఊరి చెరువులో దిగి చనిపోయేడు . ఆ ఇంటిలో వారికి ఎవరూ దిక్కులేరు .ఆస్తులు లేవు . ఊరులో అందరూ వారికి బియ్యం , డబ్బులు ఇచ్చేవారు .
వారి అబ్బాయి కొంచెము పెద్దవాడు అయ్యేక హైస్కూల్ లో అటెండర్ ఉద్యోగం ఇచ్చేరు . వాళ్ళ నాన్న ఉంటె చదువుకొని ఉద్యోగం చేసేవాడుకదా అని అతనిని చూసినప్పుడల్లా కడుపులో త్రిప్పేసేది .(సంపాదనకు / పని చేయటానికి వెళ్లేవారు కదా రోడ్డు మీదకు వస్తారు )ఏదైనా ప్రమాదం చూస్తే….అతను ఆ ఇంటికి జీవనాధారమైతే ఆ ఇంటిలోని వారి పరిస్థితి ఏమిటని కడుపులో త్రిప్పేస్తుంది .గుంతలు పూడ్చటానికి అదే ముఖ్యకారణం . గుంతలు పూడ్చటం వలన ప్రమాదాలు తప్పించటమే కాదు ఎంతోమందిని అనాథలు కాకుండా కాపాడుతున్నామనే గట్టినమ్మకం .
Preventive action is always better than cure .Instead spending money on the supply / donation ofartificial legs/ arms and wheel chairs , it will be very less expensive to fill the potholes .Nation First Jai Bharat .
…………………………………………………………………………………………..
చిన్న రైతులకు ఉపయోగపడే చక్కని వ్యవసాయ పరికరాలను రూపొందించి శభాష్ అనిపించుకున్న యువకుడు గొర్రె అశోక్. Telanganaసూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, అంజలీపురంలో రైతు కుటుంబంలో పుట్టాడు అశోక్. కేవలం రూ. 250 ఖర్చుతో వరి పొలంలో కలుపు తీతకు ఉపయోగపడే చేతి పరికరాన్ని రూపొందించి ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో ప్రథమ బహుమతి పొందారు. పత్తి, కంది, పెసర వంటి విత్తనాలను నడుము వంచే పని లేకుండా నిలబడే వేసుకునే ఒక చిన్న పరికరాన్ని అశోక్ రూపొందించారు.