ఈ అరుదైన మానవీయ సేవ వెనుక…

అరకు వెళ్తున్నపుడు ఒక మలుపులో ఉంటుంది అనంతగిరి. కాఫీ, మిరియాలు సాగు చేసుకొని బతికే ఆదివాసీల పెంకుల ఇళ్లు విసిరేసినట్టుంటాయి. అక్కడ ఆగింది తెల్లని కాడమల్లె పూవు లాంటి వాహనం. వికలాంగ చిన్నారులను తీసుకొని బయలు దేరి, విజయనగరం జిల్లా, కోనాడ జంక్షన్‌లోని విశాలమైన క్యాంపస్‌ ఛాలెంజ్‌ ప్రాంగణంలోకి చేరుకుంది.

వారికి అవసరమైన ఫిజియో ధెరఫీ , ఇతర వైద్య సేవలు అందించి సాయంత్రం మళ్లీ వారిళ్లకు చేరుస్తారు. కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పేరు వినే ఉంటారుకదా! అక్కడ చదివిన విద్యార్ధులు దేశంలో అనేక చోట్ల ఉన్నత స్ధానాల్లో పనిచేస్తున్నారు. వారిలో కొందరు కర్మభూమి రుణం తీర్చుకోవాలని దివ్యాంగుల కోసం ఈ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.మనిషి మారిపోలేదనడానికి,మానవత్వం కనుమరుగై పోలేదని చెప్పడానికి… మా క్రియేటివ్‌ ఫిల్మ్‌ మేకర్‌ హరికృష్ణతో కలిసి రెండురోజులు ఈ క్యాంపస్‌లో తీసిన మానవీయ జీవన చిత్రం… https://youtu.be/-Cw0I5XSrwU

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles