నగ్నంగా హృదయ భగ్నంగా, అది బద్ధలై దిక్కులు తాకేలా పేలుతూ తుళ్లుతూ నవ్వాలి…

నవ్వు దండోరా నవ్వాలి, నిండుగా పకపకా వికవికా పగలబడి విరగబడి నవ్వాలి, నవ్వుల ఉప్పెనలో బతుకు నావ తిరగబడిపోయి విరిగి ముక్కలైపోయినా ఖాతరు చేయకుండా, వశమనే సెంట్రల్ జైలు తాళాలు బద్దలు కొట్టుకొని,సకల సంకెళ్ళను కొలిమిలో కరిగించి నామరూపాలు లేకుండా చేస్తూ నవ్వాలి,విశ్వమంతా దహించుకుపోయి దాని కట్టుబాట్లన్నీ బూడిదయిపోయేలా, వొళ్ళు హూనమైపోయేలా, అడ్డు కట్టలన్నీ అదృశ్యమైపోయేలా హసించాలి, ఈ ముళ్ల కంచెల ప్రపంచాన్ని పరిహస్తూ అదేపనిగా మైమరచి నవ్వాలి.

నవ్వుతూ, తల్లి తరువు ముఖం విప్పారుతుండగా రెమ్మలు విచ్చుకునే పువ్వై పోవాలి,దాని పరిమళమై కొత్తవిలువలతో నేలను లాలించాలి,మనిషి మొక్క పూలను గలగలా పుడమి పరవశించిపోయేలా నిరంతరంగా అనంతంగా రాలుస్తున్నట్టు, మనసు తిన్నె మీదకు దూసుకువచ్ఛే పెదవుల కెరటంలా,ప్రతి ధ్వనుల హృదంగ మృదంగ ప్రవాహంలా,వయసు వాలకాలను తృణీకరిస్తూ భూమ్యాకాశాలు కదిలిపోయేలా…,నాలుగు విధాల చేటులను, నవ్వే ఆడదాన్ని,ఏడ్చే మగవాణ్ణి నమ్మరాదనే తీర్మానాలను పాతిపెడుతూ,నగ్నంగా హృదయ భగ్నంగా, అది బద్ధలై దిక్కులు తాకేలా పేలుతూ తుళ్లుతూ నవ్వాలి, నవ్వులో సకల విషాదాలు కరిగిపోయేలా…

అధికార గర్వంతో, ఆపనీతుల బ్లాక్మెయిల్ వికృత స్వరంతో అరిచే దేన్నైనా,

ఎవరినైనా యెదుర్కొని దానికి చితి పేర్చి సమాధి కడతామని చాటుతూ దంత బీభత్సం ప్రదర్శించాలి,

ధనిక నిర్ధనిక, పేద గొప్ప, పెట్టుబడి కట్టుబడి గట్లన్నిటినీ కూల్చి సమాజం యేక హృదయ మహా సముద్రమయ్యేలా… సంఘం తిడితే కొడితే, వంటింట్లో నట్టింట్లో పడకటింట్లో వీధిలో దారిలో ఎక్కడబడితే అక్కడ

ఏడిపిస్తానంటే కుదరదని కోటానుకోట్ల స్వరపేటికలతో కోరస్లో నవ్వుతూ చాటాలి,

హద్దులు సుద్దులు వుండని సహజ తేనెల పేటికలో భూమ్యాకాశాలను అలరించే భవితను ఆహ్వానిస్తూ త్యాగాల అగ్గి తీగకు వేల్లాడుతూ సజీవంగా విజయ నినాదంగా…

అన్ని రకాల నియంతలు పరాజయ భారంతో కుంగిపోయేలా, గుండెలు అగ్ని గుండాలై కిందబడి మీదబడి తల్ల కిందులై జగతి దశ దిశలా నిప్పులు చల్లుతూ నవ్వాలి, నవ్వు మోహ విరిబాల, మల్లె సన్నజాజుల మాల,మీరు గీసిన గీతలోపల మాత్రమే ప్రదర్శన చేసే కిరాయి వీణ కానే కాదని చాటింపు వేయాలి

-నిజం,30-06-2021

…………………………………………………………………………….

మీ బోరు ఎండి పోయిందా?  బావిలో నీరు అడుగంటిందా?

సింపుల్‌ గా రీచ్ఛార్జి చేసుకోవడానికి , ఈ తొలకరి సరైన సమయం.

నాబార్డ్‌ సాయంతో పాతాళంలోని గంగను పైకి ఎలా తెచ్చారో ఈ వీడియోలు చూడండి.

https://youtu.be/jzvM_p5bf9s

https://youtu.be/1E_XWd8RNa0

Related Articles

12 COMMENTS

 1. Oh my goodness! Incredible article dude! Many thanks, However I am experiencing problems with your RSS.
  I don’t understand the reason why I am unable to join it.

  Is there anyone else getting identical RSS problems? Anyone who knows the answer can you kindly respond?
  Thanx!!

  My web site Best THC Gummies

 2. I absolutely love your blog and find many of your post’s to be just
  what I’m looking for. Does one offer guest writers to write content for
  you personally? I wouldn’t mind creating a post or
  elaborating on a number of the subjects you write about here.
  Again, awesome weblog!

  my web-site; US Magazine

 3. Woah! I’m really loving the template/theme of this blog.
  It’s simple, yet effective. A lot of times it’s difficult to get
  that “perfect balance” between user friendliness and
  visual appearance. I must say that you’ve done a fantastic job with this.
  Additionally, the blog loads very quick for me on Safari.
  Outstanding Blog!

  my web-site: shop for weed online

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles