ప్రమాద కరమైన ఈ మొక్కను నివారించడం సాధ్యమా?

రైతులు ఈ మొక్కను చూస్తే హడలిపోతారు.  సుమారు 3 కి.మీల మేర గాలి లో ఈ మొక్క విత్తనాలు వ్యాపిస్తాయి.

 పంట పొలంలో ఈ మొక్కలు మొలిస్తే , దిగుబడి తగ్గిపోతుంది.  ఈ మొక్క పుప్పొడిని పీలిస్తే జలుబు, కళ్లు ఎర్రబడడం, కను రెప్పలు వాపు వస్తాయి.

 నేలకు అంతులేని హాని చేసే  ప్రమాద కరమైన ఈ మొక్కను నివారించడం సాధ్యమా? ప్రకృతి వన మూలికా నిపుణుడు కొమెర జాజి ఏమంటారో చూడండి..https://youtu.be/PFS1m9IhmyM

 వయ్యారిభామ శాస్త్రీయ నామం   Parthenium hysterophorus .

అమెరికా అమ్మాయి, కాంగ్రెస్‌ గడ్డి, క్యారెట్‌ గడ్డి, నక్షత్రగడ్డి  వంటి పేర్లున్న

ఈ మొక్కను  వాడుకలో వయ్యారిభామ అంటారు. ఈ   మొక్క పెరిగింది, తొలుత

అమెరికాలోని ఉష్ణ ప్రాంతంలో మొదలైంది.  మన దేశానికి ఆహార ధాన్యాలతోపాటు 1956లో దిగుమతి అయింది.

 1973లో ఈ మొక్కను మహారాష్ట్ర, బీహార్ ల్లో కనుగొన్నారు.

ఈ మొక్క  పుప్పొడిని పీలిస్తే జలుబు, కళ్లు ఎర్రబడడం, కను రెప్పలు వాపు వస్తాయి.

వయ్యారభామను తిన్న  పశువులు జీర్ణక్రియ, కిడ్నీ, లివర్‌ అన్నవాహిక శ్వాసక్రియలు దెబ్బతింటాయి.

నివారణ ఇలా..:

1, పంట పొలాల్లో మొలిచిన వయ్యారిభామ పూత పూయకముందే బురదలోకి తోసేయాలి. 2, నీరు పెడితే అది బాగా మురిగి పచ్చరొట్టె ఎరువుగా మారుతుంది.

3,ఇది పూత దశకు రాకముందే వేళ్లతో సహా పీకి తగల బెట్టాలి. కాలుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి.

4,  వయ్యారిభామను నివారించే శక్తి తంగెడు మొక్కకు మాత్రమే ఉంటుంది. పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగెడు చెట్లను తొలగించకూడదు.

5, ఈ కలుపు మొక్క పూత దశకు రాకమునుపే 10 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపి ద్రావణాన్ని పిచికారి చేయాలి. అలా చేస్తే  మొలవవు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles