టీవీ,సెల్ ఫోన్,కంప్యూటర్ వాడని ఊరు! అమెరికాలోఉంది చూడండి!

( Prasad Charasala,USA )

అక్కడ స్త్రీలు ఎటువంటి ఆభరణాలూ ధరించరు. ఎటువంటి డిజైన్లు, అలంకారాలు లేని ఒకే రంగున్న సాదా బట్టలనే పురుషులూ, స్త్రీలూ, పిల్లలూ ధరిస్తారు. సెల్‌ఫోన్లే కాదు, ఎటువంటి ఫోన్లనూ వాడరు. ఇక కంప్యూటర్లు, ల్యాప్‌టాపులూ నిషిద్దమని వేరే చెప్పాలా? ఇంటికి ఎలెక్ట్రిక్ తీగెలు రావడమూ నిషిద్దమే!

ఇదంతా వింటే ఆ ప్రదేశమేదో అండమాన్ మారుమూల దీవి, వారేమో ఆదిమ తెగ మానవులు అనుకుంటున్నారా? కాదు. అమెరికా నడిబొడ్డునే మిగతా అందరి మధ్యనే వారూ నివసిస్తున్నారు. వాళ్ళనే “ఆమిష్ పీపుల్” అంటారు. మాకు రెండు గంటల దూరంలోనే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం వున్నా, ఎప్పట్నుంచే అలా వెళ్ళి చూసి రావాలని వున్నా, ఇన్నాళ్ళకు వీలుపడింది.

16వ శతాబ్దంలో క్రైస్తవంలో ఎన్నో తిరుగుబాట్లు వచ్చాయి. అందులో ఒక పాయల్లో పాయ ఆమిష్ తెగ. జాకోబ్ ఆమ్మన్ అనే ఒక క్రైస్తవ ఫాదర్ బోధనలను పాటించే వారిని ఆయన పేరుతో “ఆమిష్” అనడం మొదలైంది. వీరి నమ్మకాల్లో ప్రధానమైనవి…బాప్తిసం అనేది యుక్తవయసు వచ్చాక ఆ వ్యక్తి పూర్తి సమ్మతితో జరగాలి. (అంటే పుట్టుకతోనే ఒక వ్యక్తి ఆమిష్ కాదన్నమాట.)చర్చ్ మరియు స్టేట్ పూర్తిగా ఒకదానికొకటి సంబందం లేనివి. (లౌకికత్వం)హింసకు వ్యతిరేకం. పోలీసు, మిలటరీ వుద్యోగాలు చేయరు.

ఫోటోలు లాంటి ఎటువంటి చిత్రాల ద్వారానైనా తమను తాము చిత్రీకరింపబడడానికి వ్యతిరేకం. దీనివల్ల వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్సులు రావు. పాస్‌పోర్టులు వుండవు. పాస్పోర్టులు వుండవు గనుక విమానాల్లో ప్రయాణించరు. నిదానమే ప్రధానం అన్నది వీరి మరో విధానం.

ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రపు బళ్ళ మీదే ప్రయాణం. దూర ప్రయాణాలు అరుదుగా చేస్తారు. ప్రయాణాలు బస్సులో, లేదా రైలులో చేస్తారు.సాదా సీదా జీవనం. పురుషులంతా ఒక రకమైన బట్టలు ధరిస్తే, స్త్రీలు మరో రకం. వీరి బట్టలు ఏ డిజైన్లూ వుండని సాదా రంగుల్లో వుంటాయి. మగవాళ్ళు చివరికి బెల్టులు కూడా ధరించరు.వీళ్ళు ప్రార్థనల కోసం ప్రత్యేకంగా చర్చి లాంటి భవనం కట్టుకోవడం ఇష్టపడరు. ఇళ్ళలోనే రెండు మూడు గదుల మధ్యగోడలను తాత్కాలికంగా మడిచేసేట్లు డిజైన్ చేసుకొని దాన్నే ఆదివారపు ప్రార్థనలకు వుపయోగిస్తారు.

అదీ చాలదనుకుంటే చెట్టు కిందో, పందిట్లోనో కూడా ప్రార్థనలు చేస్తారు. అందువల్ల వీళ్లకు చర్చి భవనాలు లేవు.వీళ్ళు పిల్లలను 8వ తరగతి వరకే చదివిస్తారు. అంతకు మించిన చదువు అక్కర్లేదని వీరి వాదన. ఆ ఎనిమిది వరకూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒకే గది వున్న బడుల్లో చదువుతారు. బయటివారు చదివే ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వెళ్ళరు.అన్నింటికీ మించి ఇళ్ళలో టీవీలు వుండవు. సెల్ ఫోన్లు వుండవు. చివరికి ఇంట్లో కరెంటే వుండదు. అంటే నో ఇంటర్నెట్, నో కంప్యూటర్స్, నొ సెల్ ఫోన్స్.

వామ్మో!ఇళ్ళల్లో గ్యాస్‌తో పనిచేసే లాంతర్లు, బల్బులు, పొవ్వులు వాడుతున్నారు.అత్యవసరాల్లో పోలీసు, అంబులెన్సు మరియు అగ్నిమాపక సర్వీసులకోసం ఇంటి బయట పాతకాలపు పోన్లు ఎర్పాటు చేసుకున్నారు. అది అత్యవసరం అయితే తప్ప వాడరట.మగవారు వ్యవసాయం పనులు చేస్తే, ఆడవారు వంట, ఇల్లు, బట్టలు వుతకడం, కుట్టడం వగైరా చేస్తారు.అమెరికాలో వుద్యోగాలు చేసే ఎవరైనా వారి జీతంలోంచి కొంత సామాజిక భద్రతా అక్కౌంటుకి, ఆరోగ్య భద్రతా అక్కౌంటుకీ పోతుంది.

వుద్యోగ విరమణ వయసు వచ్చాక ప్రభుత్వం అందులోంచి నెలకింత ఇస్తుంది. కానీ ఆమిష్ ప్రజలు వుద్యోగాలు చేసినా ప్రభుత్వం వారి డబ్బులోంచి ఈ పథకాలకు డబ్బు తీసుకోదట. వీళ్ళు చాలా గట్టి కుటుంబ, సామాజిక చట్రంలో వున్నారు గనుక వృద్దాప్యంలో కుటుంబం, సమాజమే వారి భద్రతా విషయాన్ని చూసుకుంటుంది.అన్ని కొనడాలు, అమ్మకాలు నగదు రూపంలో చేస్తారు. క్రెడిత్, డెబిట్ కార్డుల తలనొప్పి లేదు.వీళ్ళు ఎటువంటి జీవిత భీమాలు చేసుకోరు.పెళ్ళిళ్ళకు వందల మందిని ఆహ్వనించినా ఏ పెళ్ళి వంట అయినా ఒకేలా వుంటుంది. పెళ్ళి బట్టల ఆర్బాటము వుండదు.

ఆభరణాలు అసలే పెట్టుకోరు.పెళ్ళి తర్వాత ఆ జంట దగ్గరి బందువుల, ఆత్మీయుల యింట ఆతిథ్యాలకు వెళుతుంది తప్ప ఎటువంటి హానీమూన్ జంఝాటాలూ లేవు.చివరికి సమాధి రాళ్ళు కూడా అన్నీ ఒకే సైజులో వుండాలట! దర్పాన్ని, హోదాను సూచించే ఎటువంటి పద్దతి అయినా నిషిద్దమట! పిల్లలకు చిన్నప్పట్నుంచే ఇంటిపని, పొలం పనుల్లో తర్ఫీదు ఇస్తారు. సెల్ ఫోన్లూ, టీవీలు, సినిమాలు లేవు గనుక తీరిక సమయాల్లో వాళ్ళలో వాళ్ళు ఆటలు ఆడతారు.మేము చూసిన ఏ యిల్లు అయినా, పొలం అయినా అందంగా, అద్భుతంగా తీర్చ్చి దిద్దబడి వుంది.

ఇలాంటి వాళ్ళు ఈ అధునిక ప్రపంచంలో ఎల నెగ్గుకు వస్తారు అనుకుంటాం కానీ గత శతాబ్దంలో వీళ్ళ జనాబా బాగా పెరిగిందట. వీళ్ళు అమెరికాలో వేర్వేరు రాష్ట్రాల్లో వున్నా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని లాంకాస్టర్ కౌంటీలో 35వేల పైనే వున్నారు. అక్కడి మాల్స్, షాపింగ్ పార్కింగ్ లాట్లలో వాళ్ళ గుర్రపు బగ్గీలను ఆపుకోవడానికీ స్థలం కేటాయించి వుండడం మనం చూడవచ్చు. ఆ వీధుల్లో గుర్రపు బగ్గీలలో తిరిగే పిల్లలనీ, స్త్రీలనీ మనం విరివిగా చూడవచ్చు.మనం కూడా ఈ పరుగు ఎక్కడో ఒకచోట ఆపాలి. వాళ్ళు 17వ శతాబ్దంలో ఆపేశారు.

వాళ్ళకున్న అతిపెద్ద ప్రమాదం అల్లా బయటి ప్రపంచం వేగంలో పడి నలిగిపోకుండా వుండడమే! మనం పరుగెత్తీ పరుగెత్తీ సాధించేదేమిటో, వాళ్ళు నిలబడి, నిదానించీ కోల్పోయిందేవిటో!

అసలు గుడి ఎందుకు ? బడి ఎందుకు? వందల కోట్లు పోసి దేవాలయాలు నిర్మించడం వల్ల ప్రయోజనం ఉందా? యాదాద్రి నిర్మాణంలో కీలక పాత్ర వహించిన స్థపతి సుందర రాజన్ ని అడిగినపుడు.. ఇలా వివరించారు…https://youtu.be/k5LnWhSjEf4

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles