సేద్యపు కుంటతో పచ్చని పంటలు !

Evolution and Rising Trends of Watershed

 మానవాళి మనుగడకు  భూతాపం, వాతావరణ మార్పు అతిపెద్ద ముప్పుగా మారాయి. కురిసిన వాన నేల లోకి ఇంకే పరిస్ధితులు లేవు.   ఫలితంగా పడిన వర్షపు నీరు  వృధాగా పోతుంది.వాగులు, చెరువులు ఎండిపోతున్నాయి. పంట దిగుబడులు పడిపోతున్నాయి.     ఈ నేపథ్యంలో జలవనరుల రక్షణ అత్యంత కీలకం. ఈ బాధ్యత అందరిదీ, అని గ్రహించారు, ఈ రైతులు.

  ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప వర్షపాత ప్రాంతమైన ప్రకాశం జిల్లా రైతులు… 2009 నుండి 2019 వరకు, వాటర్‌ షెడ్‌  పథకం ద్వారా 62 గ్రామాల్లో( ఉప్ప మాగలూరు, బల్లికురవ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌) జల సంరక్షణ చేశారు.

 పదేళ్ల క్రితం ఇదంతా బీడు భూమి. వేమవరం మైక్రోవాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌లో ఇక్కడ  చెక్‌డ్యామ్‌, పంటకుంట నిర్మించారు. ఇలాంటి పంట కుంటలు  ప్రకాశం జిల్లా లో 7653 నిర్మించారు. కురిసిన ప్రతీ వాన చినుకును ఒడిసిపట్టి, సహజ వనరులను కాపాడారు.  ఉప్ప మాగలూరు లో 120  ఎకరాలకు పైగా  సస్యశ్యామలంగా మారి, వరి, వేరుశనగ, కంది,పొగాకు,దానిమ్మ పంటలు  పండుతున్నాయి.  జలవనరుల సంరక్షణ ద్వారా భూసారాన్ని కాపాడి, రైతులు స్వయం సమృద్ధి సాధించారనడానికి, ఈ పంటకుంట ఒక ఉదాహరణ !!

Impact

1  భూగర్భ జలాలు గతంలో కంటే  పెరిగాయి. 2  వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు  వల్ల  రైతుల  జీవనోపాధులు పెరిగి, ఆదాయ భద్రత చేకూరింది.  3 సంఘటితంగా శ్రమిస్తే, కరవుని జయించవచ్చని, ప్రకాశం జిల్లా  రైతులు నిరూపించారు.

Global warming and climate change have become the biggest threat to human survival. There are no more conditions into the fallen rain soil.

The resulting rainwater is wasted. Ditches and ponds are drying up. Crop yields are falling. In this context the Rainwater harvesting is of utmost importance. The farmers realized that it was the responsibility of all.

Prakasam district has the lowest rainfall in Andhra Pradesh. From 2009 to 2019, groundwater conservation was done in 62 villages through the watershed scheme by the farmers. Uppa Magaluru, Ballikurava Mandal, Prakasam District, Andhra Pradesh.

Ten years ago all this was dry land .The check dam, Farm Pond, was built here during the Vemavaram Micro water Shed Project. Similar Farm Ponds were constructed in 7653 in Prakasam district. Defeated every raindrop and conserved natural resources.

Over 120 acres of Uppa Magaluru,  are overgrown with  groundnut, sorghum, tobacco and pomegranate. This Farm Pond is an example of how farmers can become self-sufficient by conserving the soil through the conservation of Water.

Groundwater levels have risen more than ever.

The watershed project has increased the livelihoods of farmers and secured income.

Prakasam district farmers have proved that if they work together, the drought can be conquered.

(Impact Evaluation of PMKSY Watershed ,Prakasam District , A.P)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles